
గుంటూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. రాజధాని భూసేకరణపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో స్థానిక ప్రజలు అభిప్రాయాలను జిల్లా నేతలు ఈ సందర్భంగా వైఎస్ జగన్కు వివరించినట్లు సమాచారం. అలాగే జిల్లాలోని ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని వారు వివరించారు. కాగా వచ్చే నెల 5న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే నిరసన కార్యక్రమాలపై జిల్లా నేతలలో వైఎస్ జగన్ చర్చించారు.
కాగా ఈ నెల 21న విశాఖపట్నం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాంపై 22న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్ సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. 24, 25 తేదీల్లో ఒంగోలులో ప్రకాశం జిల్లా పార్టీ సమీక్షా సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు వైఎస్ జగన్ హాజరుకానున్నారు.