
జననేతను చూసేందుకు తరలివచ్చిన జనసంద్రం
హైదరాబాద్ : ప్రియతమ నేత వైస్ రాజశేఖరరెడ్డి తనయుడు... జననేత జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు అభిమాన కెరటాలు ఎగిసిపడ్డాయి. యువనేత జనంలోకి రావటంతో అభిమానుల ఆనందం అవధులు దాటింది. బుధవారం లోటస్‌పాండ్ జన సంద్రమైంది. వైఎస్ జగన్‌ను చూసేందుకు రాష్ట్ర నలువైపుల నుంచి అశేష జనవాహిని కదలివచ్చింది.
అభిమాననేతకు కరచాలనం చేయాలని పోటీపడింది. జగన్ బయటకు రాగానే లోటస్‌పాండ్‌ను నినాదాలతో హోరెత్తించారు. జై జగన్ ... నినాదాలు మిన్నంటాయి. చప్పట్లు, ఈలలతో ఆ ప్రాంతం మొత్తం మారుమోగిపోయింది. తన కోసం వచ్చిన వారందరికీ జగన్ అభివాదం చేశారు. ఒక్కొక్కరిగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ఎలా ఉన్నారంటూ ప్రేమగా అడిగారు.
ఆప్యాయంగా పలకరించారు. సమస్యలు విన్నారు..విజ్ఞప్తులు స్వీకరించారు. ప్రతి ఒక్కరికీ ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని చూడటానికి విద్యార్ధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రాంతాలకు అతీతంగా తరలివచ్చిన అభిమానులతో లోటస్‌పాండ్ కోలాహలంగా మారింది. చేతులు పట్టుకుని బాగున్నారా అన్నా..బాగున్నావా తమ్ముడు... అంటూ పలకరిస్తూ.. అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అందరికీ కొండంత భరోసానిచ్చారు.