అధికార తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని లోటస్పాండ్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశంలో ఆయన నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీనేతలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ సూచించారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడి వారి సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగేలా ప్రభుత్వాన్ని నిలదీయాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన చెప్పారు. వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Published Wed, Jul 30 2014 7:37 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement