హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా జంతర్ మంతర్ దగ్గర తాము తలపెట్టిన నిరసన దీక్షకు మద్దతు ఇవ్వాల్సిందిగా సీమాంధ్ర సెక్రటేరియట్ ఉద్యోగుల ఫోరం... వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఢిల్లీకి రావాల్సిందిగా ఆయనను ఉద్యోగులు ఆహ్వానించారు. సంఘం ప్రతినిధులు బుధవారం ఉదయం లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.
తమకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగా అపాయింట్‌మెంట్ ఇవ్వడంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు అరగంట పాటు జరిగిన సమావేశంలో సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న తీరుతెన్నుల్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.... ఉద్యోగుల్ని అడిగి తెలుసుకున్నారు. ఉద్యమంలో స్వయంగా పాలుపంచుకోవాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జగన్‌ను కోరారు.
ఢిల్లీ నిరసన ప్రదర్శనకు వస్తే బాగుంటుందని పదేపదే అడిగారు. అయితే షరతులతో కూడిన బెయిల్ ఉన్నందున తాను రాలేనని... పార్టీ ప్రతినిధులను ఢిల్లీకి పంపిస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమకు తెలిపారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు
జగన్ను ఢిల్లీకి ఆహ్వానించిన సీమాంధ్ర ఉద్యోగులు
Published Wed, Sep 25 2013 11:34 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement