వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం లోటస్ పాండ్లోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యింది.
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం లోటస్ పాండ్లోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల అధ్యక్షులతో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలపై జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ చర్చిస్తున్నారు. కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం గుంటూరు జిల్లా వెళ్లనున్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు జరిగే నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. రేపు ఉదయం 8.30 గంటలకు వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో గుంటూరు వెళ్తారు.