వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
హైదరాబాద్: హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మన్మధనామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాగ శ్రవణం చేశారు. అనంతరం వేడుకల్లో పాల్గొన్న వారికి ఉగాది పచ్చడిని అందజేశారు. పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిండెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.