ugadi celebration
-
హాంకాంగ్ లో ఘనంగా ఉగాది వేడుకలు..
హాంగ్‌కాంగ్‌లో తెలుగు వారంతా కలిసి ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, కొత్త స్నేహితులతో ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, శ్రీ కే. వెంకట రమణ గారుకాన్సల్, కన్సుల్టే జనరల్ అఫ్ ఇండియా,హాంగ్ కాంగ్ మరియు మకావ్; మాస్.ఏమి యుంగ్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ (ఐలాండ్స్), హాంగ్ కాంగ్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్; శ్రీ. లాల్ హర్దసాని ప్రెసిడెంట్, ది హిందూ అసోసియేషన్; ఉస్తాద్ గులాం సిరాజ్, చైర్మన్, పుంహక మరియు శ్రీ. కె. వెంకట వంశీధర్, రీజినల్ హెడ్,స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా, ముఖ్య అతిధులుగా విచ్చేసారు. శ్రీ వెంకట రమణ గారు దీప ప్రజ్వలన చేయగా, ఇతర ముఖ్య అతిధులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తదనంతరం శ్రీ వెంకట రమణ గారు,హాంగ్ కాంగ్ లో తెలుగు వారు సమాఖ్య ద్వారా చేస్తున్న భాష సేవ సాంస్కృతిక పరిరక్షణను కొనియాడారు. తదనంతరం శంకరంబాడి సుందరాచారి గారి రచన ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ‘ గానంతో ప్రారంభైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి సాంప్రదాయ నృత్యాలు, ఫ్లూట్ మరియు యుకెలేలే వాయిద్యాలపై టాలీవుడ్ పాటలు, ఫ్యూజన్ డ్యాన్స్, పాత క్లాసిక్ మెడ్లీలకు నృత్యం వంటి విభిన్నమైన ఆట పాటలతో మరియు హాస్య నాటిక తో కార్యక్రమం ఆసాంతం ఆకట్టుకుంది. గౌరవనీయ అతిధులు కాన్సల్ శ్రీ వెంకట రమణ గారు మరియు మిస్ మాస్.ఏమి యుంగ్ సమాఖ్య లోని స్వచ్చంద సేవకులకు, తెలుగు బడి గురువులకు, స్థానికంగా జరిగే జాతీయ అంతర్జాతీయ మారథాన్లలో మరియు ఆక్స్‌ఫామ్ ట్రయిల్ వాకర్ లో పాల్గొని విజయవంతంగా పూర్తి చేసిన వారి ప్రతిభ గుర్తిస్తూ వారికి మొమెంటోలు అందించారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి కార్యక్రమ వివరాలిస్తూ, హాంగ్ కాంగ్ లో నివసిస్తున్న తెలుగు వారు సంప్రదాయ వస్త్రధారణతో హాజరైన సభ్యులతో తెలుగుతనం వెల్లివిరిసిన ఈ వేడుకలతో తెలుగు నేలను మరిపించిందని హర్షం తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరం కనుక ఇక్కడ తమకి ఇక్కడ పెద్ద హాల్ల్స్ అందుబాటులో ఉండవని, ప్రభుత్వ వసతులు లభ్యమైనప్పుడు వేడుకలు చేసుకుంటున్నామని, అందుకీ ఉగాది వేడుకలు చేసుకోవడం కొంత ఆలస్యంయ్యిందని వివరించారు .జూన్ లో తమ సంస్థ క్రీడా దినోత్సవానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. సమాఖ్య కార్యవర్గ సభ్యులు జయ పీసపాటి, రాజశేఖర్ మన్నే,రమేష్ రేణిగుంట్ల, హరీన్ తుమ్మల, రమాదేవి సారంగా, మాధురి కొండా మరియు ఇతర సభ్యులు అపర్ణ కంద, రాధికా సంబతూర్, ప్రత్యుష – రవికాంత్ గునిశెట్టి, కల్పన – జయసురేష్ మట్టపర్తి, ప్రియాంక – బాబీ సత్తినేని, కృష్ణ ప్రసాద్ రెడ్డి, భరత్ కోరాడ, ధర్మ రాజు దుంప, సుగుణ రవి, మానస గర్దాస్, శాంతి పలుకూరి తదితరులు ఉగాది వేడుకల నిర్వాహణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. -
గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం ఉగాది వేడుకలు!
గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం వారి ఉగాది వేడుకలు అంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ SplashBI వారి సహాయ సహకారంతో, ఏప్రిల్ 13న డేశానా మిడిల స్కూల్(Desana Middle School)లో వేడుకగా నిర్వహించారు. ఈ వేడుకకు దాదాపు 1800 మందికి పైగా విచ్చేశారు. తెలుగు వారి సాంప్రదాయా పద్ధతిలో గణనాథుని ఆరాధన, జ్యోతి ప్రజ్వలన శ్రీకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నోరూరించే షడ్రుచుల ఉగాది పచ్చడి..వినోదాత్మక రీతిలో యాంకరింగ్ చేసిన లావణ్య గూడూరు, లక్మీ మండవల్లిల అల్లరి ముచ్చటలతో మునగితేలారు. ఈ ఈవెంట్లో దాదాపు 200 మంది చిన్నారుల ఆట పాటల సందడి, అతిధుల సాంప్రదాయ వస్త్రదారణ, విభిన్న కళా ప్రదర్శనలు ఆద్యంతం ఆహుతులను మంత్ర ముగ్దుల్ని చేశాయి. ఈ వేడుకలో పాల్గొన్న వారికి ఫుడ్ స్పాన్సర్లు ప్రశాంత్, బిర్యాని హౌస్ మహేష్ స్టాప్ ఈట్ రిపీట్( Stop Eat Repeat) వారు నోరూరించే కమ్మని వంటకాలను అదించారు. ఈ కార్యక్రమంలో దుర్గ మ్యూజికల్ కన్సర్ట్‌తో అఖిల్ అందించిన డీజే మ్యూజిక్ దద్ధరిల్లగా, అందులో అద్భతమైన గాయని అంజనా సౌమ్యా తన గాన మాదుర్యంలో ఆహుతలను రంజిప చేసింది. అంతేగాదు ఈ వేడుకల్లో పెద్దా, చిన్నా, పిల్లలు చిందులేసి సంతోషంగా గడిపారు. చివరిగా శ్రీరాములోరి రథం తరలిరావడం, అక్షింతలు, ప్రసాదాలు, ఆశీర్వాదాలు అక్కడున్న వారందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేశాయి. ఇక గాటా ఈసీ బోర్డు(Gata EC బోర్డు) సభ్యులకు సహకారులకు, సంస్థ శ్రేయోభిలాషులకు, విశిష్ట అతిథులకు, విచ్చేసిన అతిథులందరికీ పేరుపేరునా కృతజ్క్షతలు తెలియజేశారు గాటా ప్రెసిడెంట్ స్వప్న కస్వా. (చదవండి: అమెరికలో కలవర పెడుతున్న భారత విద్యార్థుల మరణాలు..ఎఫ్ఐడీఎస్ సీరియస్!) -
ఉగాది కొత్త సంబురం
-
ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు (ఫొటోలు)
-
ఈ రాసి వారికి వచ్చేది తక్కువ.. పోయేది ఎక్కువ..
-
ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు బాగున్నాయి: స్వరూపానంద
సాక్షి, విశాఖపట్నం: తెలుగు ప్రజలందరూ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక విశాఖలోని శ్రీ శారదాపీఠంలో కూడా ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా శారదాపీఠం గంటల పంచాంగాన్ని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల సర్ప దోషం కారణంగా మూడేళ్లుగా దేశం ఇబ్బందులు పడింది. ఈ ఏడాది చతుర్గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీని వల్ల దేశానికి ఇబ్బందులు తప్పవు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటంతో కొంత వరకు ఇబ్బందులు తొలగుతాయి. ఈ ఏడాదిలో ఎండలు, వడదెబ్బలు ఎక్కువగా ఉంటాయి. జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతాయి అని స్పష్టం చేశారు. -
ఉగాది వేడుకల్లో జగ్గారెడ్డి సందడి
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి పట్టణంలోని రామ మందిరంలో శనివారం జరిగిన ఉగాది ఉత్సవాల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందడి చేశారు. ఉగాది సందర్భంగా ఈ మందిరంలో వినూత్న ఆచారం కొనసాగుతోంది. భక్తుల పైకి ప్యాలాల లడ్డూలు (ప్రసాదం) విసురుతూ వందలాది మంది భక్తులకు అందిస్తారు. 40 ఏళ్లుగా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ప్యాలాల లడ్డూలు విసిరే కార్యక్రమం కొనసాగుతోంది. మొదట లడ్డూలకు పూజ చేసిన అనంతరం భజన చేస్తూ లడ్డూలను ఊరేగించారు. ఈ ఊరేగింపులో ఎమ్మెల్యే డోలక్ వాయిస్తూ పాటలు పాడుతూ భక్తులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆలయంపై నుంచి ఆయన భక్తులపైకి లడ్డూలు విసిరారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ భద్రాచలంలో శ్రీరాముని కల్యాణం, తలంబ్రాలు అయ్యాక ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమవుతాయని తెలిపారు. -
తలొగ్గేది ప్రేమకే.. నేను అహంభావిని కాదు.. శక్తిమంతురాలిని: తమిళిసై
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది ఉత్సవాలు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మధ్య దూరాన్ని మరింత పెంచాయి. శుభకృత్ తెలుగు సంవత్సర ఉగాది ముందస్తు వేడుకల కోసం ఆహ్వానాలు వెళ్లినా.. సీఎం కేసీఆర్‌గానీ, మంత్రులుగానీ ఎవరూ రాలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ కూడా హాజరుకాలేదు. దీనికితోడు ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గవర్నర్ తమిళిసై వ్యక్తం చేసిన అభిప్రాయాలు, తర్వాత మీడియాతో నిర్మొహమాటంగా చేసిన వ్యాఖ్యలు వేడిని మరింతగా పెంచాయి. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్‌కు, రాజ్‌భవన్‌కు మధ్య పూడ్చలేని స్థాయికి విభేదాలు పెరిగాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో తమిళిసై దంపతులతో హరియాణా గవర్నర్ దత్తాత్రేయ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి నేతలు, ప్రముఖుల హాజరుతో.. రాజ్‌భవన్‌లో శుక్రవారం సాయంత్రం ముందస్తు ఉగాది వేడుకలను నిర్వహించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, మాజీఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, బీజేపీనేతలు సుధాకర్‌రెడ్డి, సి.అంజిరెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య, ఐఐటీ డైరెక్టర్ మూర్తి, పలు యూనివర్సిటీల వీసీలు, పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. అందరినీ గవర్నర్ పేరుపేరునా పలకరించి, మాట్లాడారు. పంచాంగ శ్రవణం నిర్వహించాక.. ఎనిమిది మందికి గవర్నర్ చేతుల మీదుగా ఆర్థికసాయం అందజేశారు. తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు. తమిళిసై ప్రసంగం ఆమె మాటల్లోనే.. పిలిస్తే.. ప్రొటోకాల్ పక్కనపెట్టి వెళ్లేదాన్ని.. ‘‘నేను రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించాను. కొందరు వచ్చారు. రానివారి గురించి నేనేమీ చెప్పేది లేదు. నా ఆహ్వానాన్ని గౌరవించనందుకు నేనేమీ బాధపడడం లేదు. ప్రగతిభవన్‌లో ఉగాది కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఉంటే ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి అయినా వెళ్లేదాన్ని. యాదాద్రికి వెళ్లాలని ఉన్నా నన్ను ఆహ్వానించలేదు. నేను వివాదాలను, గ్యాప్‌ను సృష్టించే వ్యక్తిని కాదు. కొన్ని అంశాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. నేను ఎన్నిసార్లు ఆహ్వానాలు పంపినా పట్టించుకోవడం లేదు. ఇగ్నోర్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ పిలిచాం. కానీ రాలేదు. సమ్మక్క సారలమ్మ జాతరకు ఎవరో పిలుస్తారని ఎదురుచూడకుండా వెళ్లాను. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజభవన్‌కు మధ్య దూరం (గ్యాప్) రావడానికి కారణం తెలియదు. నేను తెలంగాణ సోదరిని.. రాజ్‌భవన్‌లో ఉన్నది గవర్నర్ కాదు, తెలంగాణ సోదరి. నేను చాలా స్నేహశీలిని, నవ్వుతున్నంత మాత్రాన బలహీనంగా ఉన్నట్టు కాదు. నేను చాలా శక్తివంతురాలిని. ప్రేమాభినాలతో తప్ప నా తలను ఎవరూ వంచలేరు. నేను అహంభావిని కాదు. చురుకైన మహిళను. తెలంగాణ ప్రజలకు చేయి అందించేందుకు ఇక్కడ మీ సోదరి ఉంది. మీకు సాయం చేసేందుకు చేయూతనిస్తా.. ఇదే ప్రజలకు నా సందేశం. గత రెండున్నరేళ్లుగా తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు రాజ్‌భవన్ ఎంతో చొరవ తీసుకుంది. ఇది ప్రజాభవన్.. తెలంగాణ సోదర సోదరీమణులు, పెద్దల కోసం రాజ్‌భవన్ తలుపులు తెరిచే ఉన్నాయి. వచ్చే నెల నుంచి ప్రజా దర్బార్ విజ్ఞాపనల పెట్టె ద్వారా తెలంగాణ ప్రజల నుంచి అనేక సూచనలు వస్తున్నాయి. అందులో వచ్చే వినతులను పరిశీలించి నా బృందం ఎంపిక చేసిన వారికి అవసరమైన సాయం కూడా చేస్తున్నాం. ప్రస్తుతం రాజ్‌భవన్ నుంచి అందుతున్నది చిరుసాయం మాత్రమే. రాబోయే రోజుల్లో ఎక్కువ మందికి అందేలా చూస్తాం. ఉగాది నుంచి తెలంగాణ కొత్త శకాన్ని చూడబోతోంది. ఉమ్మడి ప్రయత్నాలతో ఓవైపు తెలంగాణను అభివృద్ది చేస్తూనే.. ప్రజాదర్బార్ ద్వారా ప్రజలను కలుస్తున్నా. వచ్చేనెల నుంచి ప్రజాదర్బార్ క్రమం తప్పకుండా ఉంటుంది. రాజ్‌భవన్ పరిమితులు ఏమిటో నాకు తెలుసు. అయినా తెలంగాణ ప్రజలను కలిసి వారి వినతులు స్వీకరించి పరిష్కరించడం ద్వారా మేలు చేసేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తా. పరస్పరం గౌరవించుకుందాం.. ఉగాది వేడుకలకు రావాలంటూ తెలంగాణలో అత్యున్నత స్థాయి వ్యక్తి నుంచి రాజ్‌భవన్ ఉద్యోగి వరకు ఆహ్వానాన్ని పంపించా. చాలా మంది నా ఆహ్వానానికి స్పందించి గౌరవించి వచ్చారు. కొత్త ఏడాది నుంచి తెలంగాణలో కొత్త శకాన్ని ప్రారంభిద్దాం. ప్రేమాభిమానాలతో ఒకరినొకరు అర్థం చేసుకుని, పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుదాం. ప్రస్తుతం కరోనా సమస్య ముగిసింది. వాక్సినేషన్, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు పాటించడం వల్లే ఈ రోజు తిరిగి సురక్షితంగా కలుసుకోగలుగుతున్నాం. సురక్షిత ప్రపంచంలోకి అడుగు పెడుతూ.. సమస్యలు పరిష్కరించుకుంటూ తెలంగాణ అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేద్దాం. నా ఆహ్వానం మేరకు పుదుచ్చేరి స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌తోపాటు పలువురు అధికారులు కూడా ఉగాది వేడుకలకు వచ్చారు. నేను తెలంగాణ ప్రజలు, సంస్కృతిని ప్రేమిస్తున్నా. ఇలాంటి పండుగలు పుదుచ్చేరి, తెలంగాణ మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాయి’’ అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. సంబంధిత వార్త: రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు.. సీఎం కేసీఆర్ దూరం -
ప్రతి ఇల్లు ఆయురారోగ్యాలు, సిరిసంపదలో ఉండాలి
-
Ugadi 2021: స్వస్థతనొసగవమ్మా ఓ ఉగాదీ...
చిన్ని పాపాయి నవ్వుల్ని ఇంటికి తోరణంగా కట్టనీ. బుజ్జిగాడి అల్లరిని బంతిపూల మాలగా చుట్టనీ. అమ్మమ్మ, నానమ్మలు నిశ్చింతగా మెలగనీ. అమ్మ సంతోషంగా పాయసం వండనీ. నాన్న సురక్షితంగా పనులకు వెళ్లిరానీ. చంద్రుడు అందంగా కనిపించనీ. సూర్యుని ప్రతాపం వేసవి అని మాత్రమే తెలపనీ. పాత రొష్టులన్నీ తొలగిపోనీ. కోత సమయాలన్నీ చెదిరిపోనీ. ధన ధాన్యాలు తర్వాత. మణి మాణిక్యాలు అటు పిమ్మట. మొదలు స్వస్థత నొసగవమ్మా ఓ ఉగాది. మా అరిటాకుల్లో ఆయుష్షునీ, ఆనందాన్ని వడ్డించమ్మా మా ఉగాది. ప్లవ నామ ఉగాదికి పండగ విన్నపాలు ఇవి. సంవత్సరం గడిచిపోయింది తల్లీ. వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. శీతవేళలు కోత పెడుతూనే ఉన్నాయి. మనసారా నవ్వి చాలా కాలమయ్యిందమ్మా. మనిషిని హత్తుకొని యుగాలు దాటిందమ్మా. వాకిట్లో పూలకుండీలు కూడా బెంగ పెట్టుకున్నాయి. పెరటిలో అరటి చెట్లు ఆకులను ముడుచుకున్నాయి. ఏ ఇల్లూ వచ్చేపోయే ఇల్లుగా లేదు. ఏ వాకిలీ నిర్భయంగా గడిని తీయడం లేదు. కాసింత గాలి కావాలి తల్లీ. కాసింత వెలుగు కావాలి. మామాలుగా జీవితం గడిచే మహద్భాగ్యం కావాలి తల్లీ. శ్రీ ప్లవ నామ సంవత్సరమా... స్వస్థతనొసగమ్మా... శాంతిని పంచమ్మా. హుండీలు పగులగొట్టేశాం. పోపుల డబ్బా చిల్లర చివరకొచ్చింది. అకౌంట్లో సొమ్ము గీకీ గీకీ బేలెన్స్ జీరోకు చేరింది. ఉప్పుకు డబ్బు కావాలి. పప్పుకు డబ్బు కావాలి. పొయ్యిలో పిల్లిని తోలడానికి చేతికి సత్తువ కావాలి. పిల్లలకు మిఠాయిలు తెచ్చి ఎంత కాలమో. నాలుగు పండ్లు కొనాలన్నా ఎంత పిరిమో. ప్రతి ఇంటి జరుగుబాటును కాపు కాయి తల్లీ. ప్రతి ఇంట్లో అంట్లు పడే వేళను గతి తప్పనీకు తల్లీ. ప్లవ నామ సంవత్సరమా... ఆకలి ని బెత్తం దెబ్బలు కొట్టి తెలుగు ప్రాంతాల నుంచి తరిమికొట్టు. తెలుగువారి చేతి వేళ్లు ప్రతి పూటా నోట్లోకెళ్లే వరం ప్రసాదించు. సేవ చేసే వైద్యులకు సేవ చేసే శక్తినివ్వు. కాపు కాచే వ్యవస్థకు కాపు కాచే స్థయిర్యాన్ని ఇవ్వు. చెడు గాలులు, విష గాలుల బారిన అమాయకులు, నిరుపేదలు, నిస్సహాయులు, స్త్రీలు, పిల్లలు పడితే వారికి క్షణాలలో సాయం అందేలా చూడు. ఆశబోతు జలగలు, అత్యాశ పాములు, అబద్ధాల తేళ్లు వాళ్లను కుట్టకుండా చూడు. మెడలో పుస్తెలు, శరీరంలో అవయవాలు తప్ప వారి దగ్గర ఏ ఆస్తులూ ఉండవు. వారిని వారికి మిగిలేలా చూడు. వారి ఇళ్లల్లో ఏ కన్నూ చెమర్చకుండా చూడు. ఏ గొంతూ గద్గదం కాకుండా కాచుకో. ముంగిట్లో సన్నజాజుల మొక్క వేసుకుని, మూడుపూట్లా పచ్చడి నూరుకుని జీవితాంతం బతికేయగలరు వారు. ఆ పెన్నిధిని కూడా దగా చేసి దోచుకోకు. ఏ ఇంటి సంఖ్యా తక్కువ చేయకుండా చూడు. ఓ ప్లవ నామ ఉగాదీ... ఈసారి నీ వెంట ఏ మృత్యుభటుడూ రాకుండా ఉండనీ. వచ్చినా అతని వద్ద ఉండే సకల చిరునామాలు తప్పుగా ప్రింటయ్యి ఎల్లకాలమూ తికమకపడనీ. అతని గూగుల్ మేప్ పూర్తిగా మిస్‌గైడ్ చేయనీ. పిల్లలు చదువుకోనీ. యుక్త వయసు ఉన్నవారికి పెళ్లిళ్లు జరగనీ. ఉద్యోగాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగనీ. పగిలిన గోడ నుంచి ఒక మొలక మొలవనీ. బోసిపోయిన వీధులు తిరిగి కళకళలాడనీ. రహదారులు ప్రజల రాకపోకలతో అజీర్తి పడనీ. కూలి జీవులకు దిలాసా కలగనీ. మేలు చేసే బుద్ధి ప్రతి మనసుకూ కలగనీ. కాలానికి మంచికాలం తెచ్చే శక్తి ఉంటుంది. ప్లవ నామ పర్వదినమా... నీ గేలానికి సకల శుభాలన్నీ వచ్చి చిక్కుకోనీ. అవమానాలు పూజ్యం చేయి. సన్మానాలు భోజ్యం చేయి. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసాన్ని పొందనీ. ప్రతి ఒక్కరినీ మర్యాదగా బతకనీ. కుళ్లు, కపటాలను లంకె బిందెలుగా దాచి చూసుకున్నవారు వాటిని తెరిచి చూసినప్పుడు నిండా మండ్రగప్పలు కనపడనీ. సాయం, ఔదార్యాలను చేసంచిలో నింపుకున్నవారి పైకప్పు నుంచి మణిమాణిక్యాలు నట్టింట కురవనీ. ప్లవ నామ సంవత్సరమా... ప్రతి ఒక్కరూ పదుగురి బతుకు కోరనీ. పదుగురూ ప్రతి ఒక్కరి కోసం పాటు పడనీ. ఓ ఉగాది మాతా... ఎవరైనా బాగుపడితే చూసి ఓర్చుకునే శక్తిని ఇవ్వు లేనివాడికి. ఎవరైనా నవ్వుతుంటే నవ్వే హృదయం ఇవ్వు లేనివాడికి. ఎవరైనా అందలం ఎక్కితే లాగాలనుకునేవాడి చేతులను పూచిక పుల్లలుగా మార్చెయ్. ఎవరికైనా కీడు చేయాలనుకునేవాడి మాడును రిపేర్ చేయి. అమ్మా కొత్త సంవత్సరమా... మా రొటీన్‌ని మాకు ప్రసాదించు చాలు. మా ఆరోగ్యాలను మాతోపాటు కాపాడు చాలు. మేము చేసుకునే ఉగాది పచ్చడికి వేక్సిన్ కంటే ఎక్కువ ప్రతాపాన్ని ఇవ్వు. చేదు వగరు ఉప్పు కారాలను సాలిడ్‌గా అనుభవించింది చాలు. ఈ సంవత్సరం తీపిమయమే చేయి అంతా. నీకు దండాలు. నీకు దస్కాలు. ముల్లు తిప్పి ఎల్లరులకు మేలు చేద్దువు రా. స్వస్థత నిండిన అంబరాన్ని పరువు. రా నువ్వు. మా ఆశలను నిలబెట్టుతూ. – సాక్షి ఫ్యామిలీ -
గాంధీభవన్‌లో ఘనంగా ఉగాది
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో వికారినామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పండితులు శ్రీనివాసమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ.. ‘వికారినామ సంవత్సరానికి రాజు శని. ఈ ఏడాది తక్కువ వర్షాలు కురుస్తాయి. పాలకుల మధ్య వైరం ఉంటుంది. పాలకులు, ప్రజలు రోగాలతో బాధపడతారు. పంటలు స్వల్పంగా పండుతాయి. దేశం, రాష్ట్రంలో పాలకులు, ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ప్రజలకు మేలు జరగదు. దేశం, రాష్ట్రంలో అస్థిర రాజకీయ వాతావరణం ఉంటుంది. దేశ ఆదాయం 45 కాగా ఖర్చు 65గా ఉంటుంది. ఆర్థిక వనరులు తగ్గుతాయి. విదేశీ పెట్టుబడులు తగ్గుతాయి. స్వదేశీ పారిశ్రామిక కంపెనీల్లో నకిలీ ఔషధాలు బయటపడతాయి. సాంకేతిక, సమాచార రంగంలో నూతన పోకడలతో యువత ప్రమాదాలను ఎదుర్కొంటారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, కుమార్ రావు, కోదండరెడ్డి, వినోద్‌కుమార్, వినోద్ రెడ్డి, జి.నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
‘వైఎస్ జగన్‌కు అధికార యోగం ఖాయం’
సాక్షి, గుంటూరు : ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ప్రముఖ సిద్ధాంతి విష్ణుభట్ల లక్ష్మీనారాయణ అన్నారు. వికారి నామ సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని శనివారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూజలు, పంచాంగ శ్రవణం చేశారు. పంచాంగం ప్రకారం వైఎస్సార్ సీపీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రహబలం బాగుందని, విశేష ప్రజాదరణ పొందుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షం, అధికారం పార్టీల మధ్య పోరు ఉన్నప్పటికీ ప్రతిపక్షానికే అధికార యోగం సిద్ధిస్తుందని చెప్పారు. వైస్సార్సీపీ ప్రభుత్వ హయంలో ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పారు. గ్రహ గతుల ఆధారంగా తాను ఈ అంశాలు చెబుతున్నానన్నారు. ఆయన చెప్పిన పంచాంగంలోని ముఖ్యాంశాలు.. వర్షాలు సకాలంలో బాగా కురుస్తాయి. రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. ఆహార వ్యవహారాలు, వ్యవసాయం, వ్యాపారాలు సమృద్ధిగా ఉంటాయి. మూతపడ్డ చెరకు ఫ్యాక్టరీలు తెరుచుకునే అవకాశం ఉంది వైఎస్ జగన్ సీఎం అయ్యాక వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఉంటుంది దేశంలో శాంతి భద్రతలు పదిలంగా ఉంటాయి సిమెంట్, ఐరన్ ధరలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ చాలా బాగుంటాయి. గాయనీగాయలకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తారు. వైఎస్ జగన్ సమర్ధవంతమైన పాలన సాగించగలుగుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉత్తరప్రదేశ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
-
ఈ ఏడాది వైఎస్ఆర్ సీపీకి బ్రహ్మాండం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకల్లో వైఎస్ఆర్ సీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. 'ఆంధ్రప్రదేశ్ లో పాలకులు స్వార్థాన్ని వీడితేనే అభివృద్ధి. పాలకులకు గ్రహాలు అనుకూలించడం లేదు. అకాల వర్షాల వల్ల నష్టాలు, పరిపాలన ఇబ్బందులు తలెత్తుతాయి. వైఎస్ఆర్ సీపీకి ఈ ఏడాది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. పార్టీ ఫిరాయించినవారికి రాజకీయంగా భవిష్యత్ లేదు. అక్రమ కేసులు, కుట్రలు కుతంత్రాలు నుంచి వైఎస్ జగన్ కడిగిన ముత్యంలా బయపపడతారు. వైఎస్ఆర్ సీపీ మరింతగా ప్రజల మన్నన చూరగొంటుంది. రాబోయే రోజుల్లో యువ నాయకత్వానిదే భవిష్యత్' అని మారేపల్లి పంచాంగం చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఈ ఉగాది ప్రతిఒక్కరి జీవితాల్లో ఆనందం నింపాలన్నారు. అంతకు ముందు ఆయన 'శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ప్రతీ తెలుగు ఇంటికి శాంతి సౌభాగ్యం ఆనందం ఆరోగ్యం తీసుకురావాలని కోరుకుంటున్నాను' అని ట్విట్ చేశారు. అలాగే రెండు రాష్ట్రాల ప్రజలు, తెలుగువారికి శుభం కలగాలని వైఎస్ విజయమ్మ ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విజయ సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
2018 నాటికి రాజధాని తొలిదశ
మన్మథ నామ ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు ఏప్రిల్ 1 నుంచి కౌలు రైతులు, రైతుకూలీలకు రూ.2,500 ప్రతి పేద కుటుంబానికీ నెలకు రూ.2 వేల సాయం విజయవాడ, గుంటూరులను కలుపుతూ రాజధాని నగరం ఎన్నికల కోడ్‌ను ధిక్కరించి సీఎం రాజకీయ ప్రసంగం, విమర్శలు సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి సంబంధించి మొదటి దశ నిర్మాణం పనులను 2018 జూన్ 2వ తేదీ లోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతాంగాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రభుత్వం శనివారం అధికారికంగా నిర్వహించిన మన్మథ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐటీ,సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాజధాని గ్రామాల్లోని కౌలు రైతులు, రైతు కూలీలకు నెలకు రూ.2,500 చొప్పున ప్రభుత్వ సాయాన్ని అందజేస్తామన్నారు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికీ నెలకు రూ.2 వేల చొప్పున ప్రభుత్వ సాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తరహాలో నాలుగు పట్టణాలను అభివృద్ధి చే స్తామన్నారు. గుంటూరు-విజయవాడ నగరాలను కలుపుతూ నూతన రాజధాని నగరం అభివృద్ధి జరుగుతుందన్నారు. రాజధాని జోన్లో అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా మొదటి ప్రాధాన్యం రైతులకేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరువు ప్రసక్తే ఉండకూడదన్న ఆలోచనతో పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి వరద నీటిని కృష్ణాడెల్టాకు అందించాలని చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిపక్షం అర్థంలేని ఆటంకాలు కల్పిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో దారుణమైన మాటలతో ప్రభుత్వాన్ని నిందిస్తున్నారన్నారు. ‘రాజధానిని కొందరు అడవుల్లోకి, మరికొందరు సొంతూళ్లకు తీసుకెళ్లాలనుకున్నారు. రాజధాని అంటే ఎమ్మార్వో ఆఫీసనుకున్నారో ఏమో... ఎవరెన్ని చెప్పినా వినకుండా గుంటూరు, విజయవాడ ప్రాంతమే రాజధానికి అనుకూలమని ప్రకటన చేశాం. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా చూసేందుకే ల్యాండ్‌పూలింగ్‌ను అమలు చేశాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. గుడివాడ, సత్తెనపల్లి, నూజివీడులను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు కోర్ కేపిటల్ పనులకు సమాంతరంగా గుంటూరు, విజయవాడ నగరాలను కలుపుతూ నూతన నగర నిర్మాణం జరుగుతుందని చంద్రబాబు చెప్పారు. గుడివాడ, సత్తెనపల్లి, నూజివీడులను కలుపుతూ ఔటర్ రింగ్‌రోడ్ నిర్మించి రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. విశాఖ, తిరుపతిలను మహానగరాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కుల,మత రాజకీయాలకు అతీతంగా హంస, ఉగాది పురస్కార గ్రహీతలను ఎంపిక చేసినట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. అర్హత కలిగి, అవకాశం లభించని మిగతా వారికి వచ్చే ఏడాది పురస్కారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, హోంమంత్రి చినరాజప్ప, మంత్రులు మాణిక్యాలరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు, శిద్ధా రాఘవరావు, అచ్చెన్నాయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, కలెక్టర్ కాంతిలాల్‌దండే, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ తదితరులు పాల్గొన్నారు. సభికుల సహనాన్ని పరీక్షించిన బాబు ప్రసంగం ఉగాది వేడుకల్లో సుదీర్ఘంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎంతసేపటికీ ప్రసంగాన్ని ముగించకపోగా చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పడంతోపాటు మిమ్మల్ని వదలాలని లేదని చెబుతూ సభికులు, ఆహూతుల సహనాన్ని సీఎం పరీక్షించారు. గంటన్నర ఆలస్యంగా రావటంతోపాటు గంటన్నరకుపైగా సీఎం ప్రసంగం కొనసాగటంతో అవార్డులు తీసుకోవడానికి వచ్చిన వృద్ధ కళాకారులు ఇబ్బందులు పడ్డారు. సభ ఆలస్యంగా ప్రారంభమవడంతో సాంస్కృతిక కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. వేడుకలకు భారీ సంఖ్యలో జనం వస్తారని టీడీపీ నేతలు చెప్పినా చాలా కుర్చీలు ఖాళీగా మిగిలిపోయాయి. -
వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
హైదరాబాద్: హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మన్మధనామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాగ శ్రవణం చేశారు. అనంతరం వేడుకల్లో పాల్గొన్న వారికి ఉగాది పచ్చడిని అందజేశారు. పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిండెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. -
నేడు వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకులు శనివారం ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఉగాది వేడుకల్లో భాగంగా మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాగ శ్రవణం చేయనున్నారు.