ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు బాగున్నాయి: స్వరూపానంద | Swarupanandendra Saraswati Told Shubhakruth Nama Ugadi PanchangaM | Sakshi
Sakshi News home page

ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు బాగున్నాయి: స్వరూపానందేంద్ర సరస్వతి

Published Wed, Mar 22 2023 2:25 PM | Last Updated on Wed, Mar 22 2023 2:39 PM

Swarupanandendra Saraswati Told Shubhakruth Nama Ugadi PanchangaM - Sakshi

సాక్షి, విశాఖపట్నం: తెలుగు ప్రజలందరూ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక విశాఖలోని శ్రీ శారదాపీఠంలో కూడా ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా శారదాపీఠం గంటల పంచాంగాన్ని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల సర్ప దోషం కారణంగా మూడేళ్లుగా దేశం ఇబ్బందులు పడింది. ఈ ఏడాది చతుర్‌గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీని వల్ల దేశానికి ఇబ్బందులు తప్పవు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటంతో కొంత వరకు ఇబ్బందులు తొలగుతాయి. ఈ ఏడాదిలో ఎండలు, వడదెబ్బలు ఎక్కువగా ఉంటాయి. జూలై-సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతాయి అని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement