swarupananda saraswathi
-
రిషికేశ్కు బయలుదేరిన స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
-
ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు బాగున్నాయి: స్వరూపానంద
సాక్షి, విశాఖపట్నం: తెలుగు ప్రజలందరూ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక విశాఖలోని శ్రీ శారదాపీఠంలో కూడా ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా శారదాపీఠం గంటల పంచాంగాన్ని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల సర్ప దోషం కారణంగా మూడేళ్లుగా దేశం ఇబ్బందులు పడింది. ఈ ఏడాది చతుర్గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీని వల్ల దేశానికి ఇబ్బందులు తప్పవు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటంతో కొంత వరకు ఇబ్బందులు తొలగుతాయి. ఈ ఏడాదిలో ఎండలు, వడదెబ్బలు ఎక్కువగా ఉంటాయి. జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతాయి అని స్పష్టం చేశారు. -
CM YS Jagan: విశాఖ పర్యటనకు సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న విశాఖపట్నం రానున్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆహ్వానం మేరకు.. చినముషిడివాడలోని శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొంటారు. ఆ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకొని.. అక్కడి నుంచి నేరుగా శ్రీ శారదా పీఠానికి రోడ్డు మార్గంలో చేరుకోనున్నారు. వార్షికోత్సవంలో భాగంగా పీఠంలో నిర్వహించే రాజశ్యామల యాగం, అగ్నిహోత్ర సభ, రుద్రయాగంలో పాల్గొననున్నారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. చదవండి: (సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ముద్రగడ) -
స్వధర్మాన్ని వీడొద్దు
– జగద్గురు శంకచార్య స్వరూపనంద సరస్వతి అనంతపురం కల్చరల్ : స్వధరాన్ని వీడి పరధర్మాన్ని ఆశ్రయించడం కన్నతల్లిని వదులుకున్నట్టేనని ద్వారకా పీఠాధిపతులు జగద్గురు శంకచార్య స్వరూపనంద సరస్వతి ఉద్భోధించారు. దక్షిణ భారత దేశ విజయయాత్రలో భాగంగా అనంత పర్యటనకొచ్చిన స్వామీజీ స్థానిక మూడవరోడ్డులోని జీఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులనుద్దేశించి ఉపన్యసించారు. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన ధర్మం హిందూధర్మమన్నారు. కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞాన కాండ తదితర అంశాలను ఇతిహాసాల్లోని కథలతో, ఉపమానాలతో వర్ణించిన తీరు అందరిని ఆకట్టుకుంది. హిందూ మతంలో ఐక్యతను తేవడానికి బాల గంగాధర్ తిలక్ చేసిన కషిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంతకు ముందు స్వామీజీ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. నగర మేయర్ స్వరూప, జిల్లా జడ్జి హరిహరనాథశర్మ తదితరులు ప్రత్యేక దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులందుకున్నారు. పుట్టపర్తి నారాయణాచార్యుల మునిమనుమరాలు సాహితీ అయ్యంగార్ అన్నమాచార్య గీతంపై శాస్త్రీయ నత్యంతో స్వామీజీకి స్వాగతం పలికారు. కార్యక్రమంలో అమతానంద స్వామీజీ, రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్, ఎండోమెంట్ సహాయ కమిషనర్ ఆనంద్, ఈఓ నాగేంద్రరావు, శ్రీనిధి రఘు తదితరులు పాల్గొన్నారు. సాయి భక్తుల నిరసన∙: ఇదిలా ఉండగా జగద్గురు శంకరాచార్యస్వరూపానంద సరస్వతి షిర్డీసాయిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బాబా భక్తులు మండిపడ్డారు. సాయి సంఘం ప్రతినిధులు సాయినాథ్ మహరాజ్‌కీ జై అంటూ నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని పంపేయడంతో స్వామీజీ తన ఉపన్యాసం కొనసాగించారు.