గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం వారి ఉగాది వేడుకలు అంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ SplashBI వారి సహాయ సహకారంతో, ఏప్రిల్ 13న డేశానా మిడిల స్కూల్(Desana Middle School)లో వేడుకగా నిర్వహించారు. ఈ వేడుకకు దాదాపు 1800 మందికి పైగా విచ్చేశారు. తెలుగు వారి సాంప్రదాయా పద్ధతిలో గణనాథుని ఆరాధన, జ్యోతి ప్రజ్వలన శ్రీకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నోరూరించే షడ్రుచుల ఉగాది పచ్చడి..వినోదాత్మక రీతిలో యాంకరింగ్ చేసిన లావణ్య గూడూరు, లక్మీ మండవల్లిల అల్లరి ముచ్చటలతో మునగితేలారు.
ఈ ఈవెంట్‌లో దాదాపు 200 మంది చిన్నారుల ఆట పాటల సందడి, అతిధుల సాంప్రదాయ వస్త్రదారణ, విభిన్న కళా ప్రదర్శనలు ఆద్యంతం ఆహుతులను మంత్ర ముగ్దుల్ని చేశాయి. ఈ వేడుకలో పాల్గొన్న వారికి ఫుడ్ స్పాన్సర్లు ప్రశాంత్, బిర్యాని హౌస్ మహేష్ స్టాప్ ఈట్ రిపీట్( Stop Eat Repeat) వారు నోరూరించే కమ్మని వంటకాలను అదించారు. ఈ కార్యక్రమంలో దుర్గ మ్యూజికల్ కన్సర్ట్‌తో అఖిల్ అందించిన డీజే మ్యూజిక్ దద్ధరిల్లగా, అందులో అద్భతమైన గాయని అంజనా సౌమ్యా తన గాన మాదుర్యంలో ఆహుతలను రంజిప చేసింది.
అంతేగాదు ఈ వేడుకల్లో పెద్దా, చిన్నా, పిల్లలు చిందులేసి సంతోషంగా గడిపారు. చివరిగా శ్రీరాములోరి రథం తరలిరావడం, అక్షింతలు, ప్రసాదాలు, ఆశీర్వాదాలు అక్కడున్న వారందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేశాయి. ఇక గాటా ఈసీ బోర్డు(Gata EC బోర్డు) సభ్యులకు సహకారులకు, సంస్థ శ్రేయోభిలాషులకు, విశిష్ట అతిథులకు, విచ్చేసిన అతిథులందరికీ పేరుపేరునా కృతజ‍్క్షతలు తెలియజేశారు గాటా ప్రెసిడెంట్ స్వప్న కస్వా.
(చదవండి: అమెరికలో కలవర పెడుతున్న భారత విద్యార్థుల మరణాలు..ఎఫ్‌ఐడీఎస్ సీరియస్!)
Comments
Please login to add a commentAdd a comment