అట్లాంటా (అమెరికా): ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ (పీజీఏ) సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక టోర్నీ టూర్ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి అమెరికన్ గోల్ఫర్ తీగల సాహిత్ రెడ్డి ఆకట్టుకున్నాడు. –24 అండర్ స్కోరుతో సాహిత్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ప్రదర్శనకుగాను సాహిత్‌కు 75 లక్షల డాలర్లు (రూ. 62 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
విజేతకు రూ. 209 కోట్లు
సాహిత్ తల్లిదండ్రులు మురళీధర్, కరుణ 1980 దశకంలో హైదరాబాద్ నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. సాహిత్ కాలిఫోర్నియాలో జన్మించి అక్కడే పెరిగాడు. అమెరికాకే చెందిన స్కాటీ షెఫ్లర్ –30 అండర్ స్కోరుతో విజేతగా నిలిచి 2 కోట్ల 50 లక్షల డాలర్లు (రూ. 209 కోట్లు) ప్రైజ్‌మనీని దక్కించుకోగా... కొలిన్ మొరికావా –26 అండర్ స్కోరుతో రన్నరప్‌గా నిలిచి 1 కోటీ 25 లక్షల డాలర్ల (రూ. 104 కోట్లు) ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment