సాక్షి, గుంటూరు : ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ప్రముఖ సిద్ధాంతి విష్ణుభట్ల లక్ష్మీనారాయణ అన్నారు. వికారి నామ సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని శనివారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూజలు, పంచాంగ శ్రవణం చేశారు. పంచాంగం ప్రకారం వైఎస్సార్ సీపీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రహబలం బాగుందని, విశేష ప్రజాదరణ పొందుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షం, అధికారం పార్టీల మధ్య పోరు ఉన్నప్పటికీ ప్రతిపక్షానికే అధికార యోగం సిద్ధిస్తుందని చెప్పారు. వైస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పారు. గ్రహ గతుల ఆధారంగా తాను ఈ అంశాలు చెబుతున్నానన్నారు. ఆయన చెప్పిన పంచాంగంలోని ముఖ్యాంశాలు..
- వర్షాలు సకాలంలో బాగా కురుస్తాయి. రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుంది.
- ఆహార వ్యవహారాలు, వ్యవసాయం, వ్యాపారాలు సమృద్ధిగా ఉంటాయి.
- మూతపడ్డ చెరకు ఫ్యాక్టరీలు తెరుచుకునే అవకాశం ఉంది
- వైఎస్ జగన్ సీఎం అయ్యాక వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఉంటుంది
- దేశంలో శాంతి భద్రతలు పదిలంగా ఉంటాయి
- సిమెంట్, ఐరన్ ధరలు పెరుగుతాయి.
- రియల్ ఎస్టేట్ చాలా బాగుంటాయి.
- గాయనీగాయలకు అనుకూలంగా ఉంటుంది.
- ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తారు.
- వైఎస్ జగన్ సమర్ధవంతమైన పాలన సాగించగలుగుతారు.
Comments
Please login to add a commentAdd a comment