హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ సంఘం సభ్యులు శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని లోటస్ పాండ్లోని తన నివాసంలో శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా వారు జగన్తో.. రాష్ట్రంలో 1.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 'చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 15 నెలలు గడచినా.. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. దీంతో పీజీ చేసిన విద్యార్థులు కూడా సెక్యూరిటీ గార్డులుగా పని చేసే దుస్థితి నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా నోటిఫికేషన్ ఇవ్వాలి. లేకపోతే అన్ని రాజకీయ పార్టీల మద్దుతతో అసెంబ్లీని ముట్టడిస్తాం' అని చెప్పారు.