కొత్త జిల్లాలతో పార్టీ బలపడుతోంది
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలతో పార్టీ బలపడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీకి మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్ సమక్షంలో కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి లోకా లక్ష్మారెడ్డి తదితరులు పార్టీలో చేరారు. వారికి శ్రీకాంత్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ లీగల్ సెల్ అధ్యక్షుడి నియామకం
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా మందాడి సరోజ్‌రెడ్డి నియమితులయ్యారు. అలాగే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మునిగాల కల్యాణ్‌రాజ్‌ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆయా నియామకాలు చేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.