
రేపు వైఎస్సార్‌సీపీ 3 జిల్లాల విస్తృత భేటీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల విస్తృత సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆయా జిల్లాల నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ప్రకటనలో తెలిపారు.