వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అభిమానులు, ఆప్తులు, కుటుంబీకులు, శ్రేయోభిలాషులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల ఆశీస్సుల మధ్య జననేత ఇంటికి చేరుకున్నారు.
హైదరాబాద్: వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అభిమానులు, ఆప్తులు, కుటుంబీకులు, శ్రేయోభిలాషులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల ఆశీస్సుల మధ్య జననేత ఇంటికి చేరుకున్నారు. జగన్ కోసం బారులు తీరిన అభిమానులతో చంచల్‌గూడ నుంచి లోటస్‌పాండ్ వరకూ రహదారి జనగోదారిని తలపించింది. దీంతో కేవలం 11 కిలోమీటర్లు ప్రయాణించడానికి జగన్‌కు ఆరు గంటల సమయం పట్టింది.
దారిపొడవునా ఘనస్వాగతం పలికిన అభిమానులకు అభివాదం చేసుకుంటూ జగన్ ముందుకు కదిలారు. చెరగని చిరునవ్వుతో ఆత్మీయులను పలకరిస్తూ కదిలారు. మధ్యమధ్యలో వాహనం నుంచి కిందికి దిగి అభిమానులను జగన్ పలకరించారు. మొత్తానికి ఆయన రాకకోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని 16 నెలలుగా ఎదురుచూస్తున్న కుటుంబీకుల కళ్లల్లో ఆనందం వెల్లువెత్తింది. అభిమానుల్లో ఆనందం అంబరాన్నంటింది. లోటస్‌పాండ్ పరిసరాలన్నీ జై జగన్‌నినాదాలతో హోరెత్తిపోయాయి. బాణాసంచా పేలుళ్లు అంబరాన్నంటాయి.
ర్రాతి 9.20 గంటల ప్రాంతంలో లోటస్ పాండ్ లోని తన నివాసానికి జగన్ చేరుకున్నారు. కుటుంబీకులు జగన్‌కు హారతిచ్చి స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులను ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆయనపై పూలవర్షం కురిపించారు. తన నివాసంలోని తన తండ్రికి జగన్ నివాళులు అర్పించారు. సన్నిహితులను, అభిమానులను జగన్ అప్యాయంగా పలకరించారు.