వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యా లయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉన్న కేంద్ర కార్యాలయానికి ముఖ్య నాయకులు చేరుకొని వేడుకలను నిర్వహించారు. నూతన సంవత్సర కేక్‌ను రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కట్ చేసి అందరికీ పంచారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్‌రాజు, కార్య దర్శులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, నాయకులు బుర్రా సురేష్‌గౌడ్, బి.మోహన్ కుమార్, రమాభాస్కర్ పాల్గొన్నారు.