![parliament budget session 2022 highlights: Elections keep happening but budget session very important - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/1/31011270-INDIA-PARLIAMENT--.jpg.webp?itok=GrL1APkJ)
న్యూఢిల్లీ: ఎన్నికలు తరచుగా జరుగుతూనే ఉంటా యని, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మాత్రం చాలా కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఒక ఏడాది కాలానికి బ్లూప్రింట్‌ను ఖరారు చేసే బడ్జెట్ సమావేశాలను ఫలవంతం చేద్దామని పార్లమెంట్ సభ్యులకు పిలుపునిచ్చారు. ఓపెన్ మైండ్‌తో సభలో చర్చల్లో పాల్గొనాలని కోరారు. మోదీ సోమవారం మీడియాతో మాట్లాడారు.
దేశంలో ఏదో ఒకచోట తరచుగా జరుగుతున్న ఎన్నికల కారణంగా పార్లమెంట్ భేటీలకు, చర్చలకు అంతరాయం కలుగుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ పార్లమెంట్‌లో స్వేచ్ఛాయుతంగా, సదుద్దేశంతో ఆలోచనాత్మక చర్చలు జరగాలని ఆకాంక్షించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్ ముంగిట ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. (చదవండి Budget 2022 Updates in Telugu)
దేశ ఆర్థిక ప్రగతి, కోవిడ్–19 వ్యాక్సినేషన్, స్వదేశంలో కరోనా టీకాల ఉత్పత్తి వంటి వాటితో అంతర్జాతీయంగా భారత్ పట్ల విశ్వాసం ఎంతగానో పెరిగిందన్నారు. ప్రపంచంలో మన దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఉపయోగించుకోవాలని, అర్థవంతమైన చర్చలు జరపాలని ఎంపీలకు సూ చించారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి ఎంపీలందరితోపాటు అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తోడ్పాటునందిస్తాయన్న ఆశాభావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. చట్టసభల్లో ఓపెన్ మైండ్‌తో జరిపే నాణ్య మైన చర్చలు ఇందుకు దోహదం చేస్తాయని వెల్లడించారు. పూర్తి అంకితభావంతో ప్రస్తుత బడ్జెట్ సమావేశాలను ఫలవంతం చేస్తే రానున్న రోజుల్లో ఆర్థికంగా భారత్ ఉన్నత శిఖరాలకు చేరుకొనేం దుకు ఆస్కారం ఉంటుందని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్‌లో రచ్చ తప్పదా?
రైతుల సమస్యలు, దేశ సరిహద్దులో చైనా సైన్యం ఆగడాలు, పెగాసస్ స్పైవేర్ వంటి కీలక అంశాలపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఇజ్రాయెల్ నుంచి భారత్ 2017లో పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చిన కథనం ఇప్పటికే రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన అంశాలపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, నిరసనలతో బడ్జెట్ సమావేశాలు హోరెత్తిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
మీడియా సమావేశంలో మోదీ
Comments
Please login to add a commentAdd a comment