Open mind
-
‘మై హూ నా’ హామీ తీరేదెన్నడు?
సెగ ఎటు నుంచి తగిలితే నేమి, ఎనిమిదేళ్లుగా పిడచ కట్టుకుని ఉన్న ఘనీభవ స్థితి అయితే నెమ్మదిగా కరగడం మొదలయ్యినట్లుగా ఉంది. ఉన్నట్టుండి ‘ఢిల్లీ’ ఫోకస్ ఈ ఏడాది చివరి నాటికి ఆంధ్రప్రదేశ్‌పైన పడడంతో ఇక్కడి ప్రజలు, ఇటువంటి మార్పు పట్ల ఆనందంగా ఉన్నారు. కేంద్రం 2015 డిసెంబర్ 23న ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ ప్రకటన చేశాక, ఆ దిశలో తొలి అడుగులు ఆశాజనకంగా అనిపిస్తున్నాయి. అంతే కాదు ప్రధాని విశాఖ పర్యటనకు ముందు ఒక ‘పైలెట్ టీమ్ టూర్’ కూడా జరిగింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ‘సదరన్ క్యాంపస్’ ప్రారంభించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్; వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పోర్టు సిటీ కాకినాడ వచ్చి... విదేశీ వాణిజ్యం మా ప్రభుత్వ ప్రాధాన్యం అని చెప్పివెళ్లారు. మరి ఇది మీ ఆంతర్యం కనుక అయితే, మీరు మాకు చేస్తున్న మంచిని ‘ఓపెన్’గా మాతో పంచుకోవడానికి ఇబ్బంది ఎందుకన్నదే మాకు అర్థం కానిది. విశాఖ రైల్వే జోన్ విషయమే తీసుకుందాం. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, విశాఖ పట్టణంలోని వైర్ లెస్ కాలనీలోని 35 ఎకరాల రైల్వే భూమిలో రూ. 110 కోట్లతో జోనల్ కేంద్ర కార్యా లయాల భవన నిర్మాణానికి ఆర్కిటెక్టులు ఇచ్చిన డిజైన్లు రైల్వేబోర్డు వద్ద పెండింగ్‌లో ఉన్నాయని సీనియర్ రైల్వే అధికారి ఒకరు చెప్పినట్టు ఓ ఆంగ్ల పత్రిక రాసింది. ఇంతలో ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో– ‘సెంటర్–స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్’ అంటూ, అందులో రైల్వే జోన్ ఎజెండా మొదటి అంశమని చంద్రగ్రహణం రోజు తెలిపింది. జోన్ ప్రతిపాదన మీ వద్ద సజీవంగా ఉందనే సంగతి ఇంత డొంక తిరుగుడుగా అదీ ఒక ఆంగ్ల పత్రిక చేసిన వెతుకులాట వల్ల మాకు తెలియడం, అంత అవసరమా? ప్రజలు, ప్రాంతము రెండూ ఇక్కడివే అయినప్పుడు; మాకు జరిగే ఏ మేలైనా, అది మీరు అధినేతగా ఉన్న ఈ దేశంలోనిదే కదా? ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పటి నుంచి మీరు ఢిల్లీ పీఠంపై ఉంటూ, ఇంకా మా రాష్ట్రాన్ని ‘ఓన్’ చేసుకోలేక పోవడం ఏమిటి? మోదీజీ విశాఖ రాక వైపు చూస్తున్నప్పుడు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు కలుగుతున్న సహజ సందేహాలు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ఐల్యాండ్ నుంచి నంబర్ 10–11 మధ్య క్షిపణి ప్రయోగం జరగనుంది. క్షిపణి సముద్రం మీద శ్రీలంక, ఇండోనేషియాల మధ్యగా ప్రయాణించే దిశలో 2,200 కి.మీ. మేర ‘నో ఫ్లయ్ జోన్’ అని మనదేశం ఇప్పటికే ప్రకటించింది. అయితే, మన క్షిపణి అనుపానులు అంచనా వేయడానికి, ఇప్పటికే చైనా స్పై షిప్ ‘యువాన్ వాంగ్–6’ హిందూ మహాసముద్రం జలాల్లోకి ప్రవేశించి, బాలి దీవుల్లో బస చేసింది. మన తూర్పు సరిహద్దున చైనా చేస్తున్న రెండవ కవ్వింపు చర్య ఇది. ఆగస్టులో కమ్యూనికేషన్ – నిఘా చర్యల రీసెర్చ్ నౌక – ‘యువాన్ వాంగ్–5’ శ్రీలంక హంబన్ తోట పోర్టులో వారం రోజులు తిష్ట వేసింది. అది ఇక్కడకు వచ్చి వెళ్ళాక, మన సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ... చైనా నౌకలు శాటిలైట్ మోనిటరింగ్‌తో రాకెట్లు, ఇంటర్ కాంటి నెంటల్ మిస్సైల్స్ ఉపయోగించే అవకాశం ఉందనీ, మన న్యూక్లియర్ స్టేషన్లు, పోర్టుల భద్రతకు నిఘా, రక్షణ చర్యలు చేపట్టాలనీ తమిళనాడు రాష్ట్ర ఇంటి లిజెన్స్ ఏజెన్సీని ఆదేశించింది. (క్లిక్ చేయండి: ‘రాజనీతి’లో రేపటి చూపు!) ఈ నేపథ్యంలో ప్రధాని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ కేంద్రమైన విశాఖ వస్తున్నారు. భారత ప్రభుత్వ ప్రాదేశిక అవసరాల బాధ్యతతో, ‘ఫెడరల్’ స్పూర్తితో దేశం తూర్పు సరిహద్దుల్లో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో కొత్త సంస్కరణలు అమలు చేస్తున్నది. వాటిని గ్రేడింగ్ చేసి ర్యాంకులు వెల్లడించేది మీరే కనుక, మా పురోగతి ముందు మీకు తెలిశాకే, అవి మాకు తెలిసేది. కేరళలో– ఈ ఏడాది ఎం.ఏ. ‘డీసెంట్రలైజేషన్ అండ్ లోకల్ గవర్నెన్స్’ పీజీ కోర్సు మొదలుపెడితే, ఇక్కడది ఇప్పటికే అమలులో ఉంది. ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉండటం, ఇప్పుడు దేశం అవసరం. దీని పట్ల మీ ‘ఓపెన్ మైండ్’ మా అవసరం. (చదవండి: తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!) - జాన్సన్ చోరగుడి అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
బడ్జెట్ సమావేశాలను ఫలవంతం చేద్దాం
న్యూఢిల్లీ: ఎన్నికలు తరచుగా జరుగుతూనే ఉంటా యని, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మాత్రం చాలా కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఒక ఏడాది కాలానికి బ్లూప్రింట్‌ను ఖరారు చేసే బడ్జెట్ సమావేశాలను ఫలవంతం చేద్దామని పార్లమెంట్ సభ్యులకు పిలుపునిచ్చారు. ఓపెన్ మైండ్‌తో సభలో చర్చల్లో పాల్గొనాలని కోరారు. మోదీ సోమవారం మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏదో ఒకచోట తరచుగా జరుగుతున్న ఎన్నికల కారణంగా పార్లమెంట్ భేటీలకు, చర్చలకు అంతరాయం కలుగుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ పార్లమెంట్లో స్వేచ్ఛాయుతంగా, సదుద్దేశంతో ఆలోచనాత్మక చర్చలు జరగాలని ఆకాంక్షించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్ ముంగిట ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. (చదవండి Budget 2022 Updates in Telugu) దేశ ఆర్థిక ప్రగతి, కోవిడ్–19 వ్యాక్సినేషన్, స్వదేశంలో కరోనా టీకాల ఉత్పత్తి వంటి వాటితో అంతర్జాతీయంగా భారత్ పట్ల విశ్వాసం ఎంతగానో పెరిగిందన్నారు. ప్రపంచంలో మన దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఉపయోగించుకోవాలని, అర్థవంతమైన చర్చలు జరపాలని ఎంపీలకు సూ చించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి ఎంపీలందరితోపాటు అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తోడ్పాటునందిస్తాయన్న ఆశాభావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. చట్టసభల్లో ఓపెన్ మైండ్‌తో జరిపే నాణ్య మైన చర్చలు ఇందుకు దోహదం చేస్తాయని వెల్లడించారు. పూర్తి అంకితభావంతో ప్రస్తుత బడ్జెట్ సమావేశాలను ఫలవంతం చేస్తే రానున్న రోజుల్లో ఆర్థికంగా భారత్ ఉన్నత శిఖరాలకు చేరుకొనేం దుకు ఆస్కారం ఉంటుందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో రచ్చ తప్పదా? రైతుల సమస్యలు, దేశ సరిహద్దులో చైనా సైన్యం ఆగడాలు, పెగాసస్ స్పైవేర్ వంటి కీలక అంశాలపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఇజ్రాయెల్ నుంచి భారత్ 2017లో పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చిన కథనం ఇప్పటికే రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన అంశాలపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, నిరసనలతో బడ్జెట్ సమావేశాలు హోరెత్తిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మీడియా సమావేశంలో మోదీ -
మీరెంత ఉన్నతంగా ఆలోచిస్తారు?
సెల్ఫ్ చెక్ మీరు మీ తోటివారితో ఎలా ఉంటారు? అందరూ ఒక్కటేనన్న భావన మీలో ఉందా? మీరు ఉన్నతంగా ఆలోచించగలరా? లేదా మీ చుట్టూ ఒక వలయం గీసుకొని అందులోనే ఉండిపోతారా? మీది ఓపెన్మైండో లేక న్యారోమైండో తెలుసుకోవాలని ఉందా? 1. సాహిత్యం, విమర్శనా రచనలు చదవటం అంటే మీకు చాలా ఇష్టం. ఎ. అవును బి. కాదు 2. విదేశీ సంగీతమన్నా, విదేశీ వాద్యాలన్నా మీకు ఇష్టం ఉండదు. ఎ. కాదు బి. అవును 3. మానవ సంబంధాలపై మీకు వ్యతిరేకతాభావం ఉంది. ఎ. కాదు బి. అవును 4. స్నేహం చేసే ముందు కులం, మతం, జాతి లాంటి వాటిని చూస్తారు. ఎ. కాదు బి. అవును 5. మీ స్నేహాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎ. అవును బి. కాదు 6. జీవితభాగస్వామి మీ విలువులు, నమ్మకాలు, ఆలోచనలతో ఏకీభవించాలని గట్టిగా కోరుకుంటారు. ఎ. కాదు బి. అవును 7. మీ పనిని ఎవరైనా తప్పుగా భావిస్తే మీ ఆలోచనలను వారితో పంచుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. ఇతరుల గురించి మీకు ఎవరైనా చాడీలు చెబితే అవి నిజమో, కాదో కూడా సరిచూసుకోకుండా వాటిని నమ్మేస్తారు. ఎ. కాదు బి. అవును 9. ధనికుల పట్ల మీకెలాంటి భావన ఉందో, పేదలపట్ల కూడా అలాంటి భావనే ఉంది. అందరినీ ఒకేరకంగా మీరు ఆదరించగలరు. ఎ. అవును బి. కాదు 10. ఎవరెనా మీ మాటలను వ్యతిరేకిస్తే వెంటనే నొచ్చుకుంటారు. సాధ్యమైనంత వరకూ వాళ్లతో మీ సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలనుకుంటారు. ఎ. కాదు బి. అవును మీకు ‘ఎ’ సమాధానాలు 7 దాటితే మీరు ఉన్నతంగా ఆలోచించగలరు. మీ భావాలతో తోటివారి మనసును దోచుకుంటారు. జాతి, కుల, మత, వర్గభేదాలు మీలో ఉండవు. మీ దృష్టిలో ఎవరైనా, ఏదైనా సమానమే. మీకు ‘బి’ సమాధానాలు 7 కంటే ఎక్కువ వస్తే మీది సంకుచిత మనస్తత్త్వం కావచ్చు. మీరు విశాల భావనలను అలవర్చుకోవలసి ఉంటుంది. అలాంటప్పుడే ఇతరులతో కమ్యూనికేషన్ మెరుగవుతుంది.