ప్రతీకాత్మక చిత్రం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన కేంద్ర మంత్రులకు రాష్ట్రంలో పర్యటించే హక్కులేదని వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి కిషన్‌రావ్ కరాడే విజయవాడ పర్యటనను నిరనిస్తూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు లెనిన్‌సెంటర్‌లో ఆదివారం నల్ల జెండాలతో నిరసన తెలిపాయి. కేంద్ర మంత్రి గో బ్యాక్ అంటూ ఆ పార్టీల నాయకులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు దోనేపూడి శంకర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్.బాబూరావు మాట్లాడుతూ బడ్జెట్‌పై బీజీపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన సమావేశాన్ని మేధావులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే బీజేపీ నాయకులు ఏమొహం పెట్టుకుని బడ్జెట్‌పై సభలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. రామానుజ విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని మోదీని శ్రీరాముడి అవతారంగా పోల్చడాన్ని ఆక్షేపించారు. వామపక్ష నాయకులు లంక దుర్గారావు, తాడి పైడయ్య, ఆనందరావు, శ్రీదేవి, కె.దుర్గారావు, టి.ప్రవీణ్, ఝాన్సీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment