కేంద్ర బడ్జెట్ 2022 ముందు అనూహ్యంగా డాక్టర్ వీ అనంత నాగేశ్వరన్‌ను చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (CEA)గా కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. కేవీ సుబ్రమణియన్ మూడేళ్ల పదవీకాలం గత డిసెంబర్‌లోనే ముగియగా.. ఇప్పుడు అనంత నాగేశ్వరన్‌ను ఆ స్థానంలో నియమించారు. ఈ నేపథ్యంలో ఈయన నేపథ్యంపై ఓ లుక్కేద్దాం.
అనంత నాగేశ్వరన్ ఆర్థిక మేధావి మాత్రమే కాదు.. రచయిత, టీచర్, ఎకనమిక్ కన్సల్టెంట్ కూడా. ప్రధాని నేతృత్వంలోని ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్‌లో 2019-2021 మధ్య పార్ట్‌టైం మెంబర్‌గా ఈయన ఉన్నారు. గతంలో క్రెడిట్ సుయిస్సె గ్రూప్ ఏజీ, జూలియస్ బాయిర్ గ్రూప్‌ల్లోనూ ఈయన ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. అంతకు ముందు బిజినెస్ స్కూల్స్, భారత్‌లోని కొన్ని మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్స్‌లో, సింగపూర్‌లో పని చేశారు. ఐఎఫ్‌ఎంఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌గా కూడా వ్యవహరించారు. ప్రస్తుత సీఈఏకు ఆంధ్రప్రదేశ్‌తోనూ అనుబంధం ఉంది. క్రి(క్రె)యా యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గానూ కొంతకాలం ఈయన పని చేశారు.
తమిళనాడు మధురైలో స్కూలింగ్, కాలేజీ చదువులు పూర్తి చేసుకున్న నాగేశ్వరన్.. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేసుకున్నారు. 1994లో మస్సాషుసెట్స్ యూనివర్సిటీ నుంచి ఫైనాన్స్‌లో(empirical behaviour of exchange rates మీద) డాక్టరేట్ అందుకున్నారు.
ఇదిలా ఉంటే ఎనకమిక్ సర్వే అనేది సాధారణంగా సీఈఏ ప్రిపేర్ చేస్తారు. కానీ, బడ్జెట్‌కు ముందు ఆ స్థానం ఖాళీగా ఉండడంతో ప్రిన్స్‌పల్ ఎకనమిక్ అడ్వైజర్, ఇతర అధికారులు సర్వే నివేదికను రూపొందించడం గమనార్హం. అంటే.. ఈ దఫా సర్వేలో సీఈఏ లేకుండానే రూపొందగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్రపతి ప్రసంగం అనంతరం దానిని ప్రవేశపెట్టారు.
సంబంధిత వార్త: బడ్జెట్‌కు ముందే నాగేశ్వరన్ ఎంపిక.. ఎందుకు?
Comments
Please login to add a commentAdd a comment