పన్ను చెల్లింపుదారులకు తొలి గుడ్‌న్యూస్ వెలువడింది. ట్యాక్స్ రిటర్న్ అప్‌డేట్ చేసుకునేందుకు రెండేళ్ల సమయం పెంచుతున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. ఐటీ రిటర్న్‌లో లోపాలను సవరించుకునేందుకు పన్ను చెల్లింపుదారులకు ఇది మంచి అవకాశమని మంత్రి అన్నారు. పన్నులు చెల్లింపులు మరింత సులభం చేసేందుకు ప్రభుత్వం ఈ ఫైలింగ్‌ను అమల్లోకి తేగా..టెక్నికల్ గ్లిచెస్‌తో అనేక మంది ఇబ్బందులు పడ్డారు.
వర్క్‌ఫ్రం హోం అమలవుతున్నందున స్టాండర్డ్ డిడక‌్షన్‌లో పలు సవరణలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. మరి ఈ బడ్జెట్‌లో దానికి సంబంధించిన అంశం ఎప్పుడు ప్రస్తావనకు వస్తుందా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇన్‌ట్యాక్స్ శ్లాబుల్లో కూడా మార్పులు తేవాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే కేంద్ర బడ్జెట్‌లో వీటికి అవకాశం కల్పించలేదు. పన్నులకు సంబంధించిన అనుబంధ సెక‌్షన్లలో సైతం ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు.
పన్ను గురించి బడ్జెట్‌లో పేర్కొన్న అంశాలు
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14 శాతం పన్ను ఆదా
- సహకార సంస్థలకు సంబంధించి ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ రేటుని 18.50 శాతం నుంచి 15 శాతానికి తగ్గింపు
- సహకార సంస్థలు చెల్లించే సర్ ఛార్జీలు 7 శాతం తగ్గింపు
- నేషనల్ పెన్షన్ స్కీంలో డిడక‌్షన్ 14 శాతం పెంచుకునే వెసులుబాటు
Comments
Please login to add a commentAdd a comment