భారత్‌ను గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు పురోగతిని సాధించేందుకుగాను నేచురల్ గ్యాస్‌ను వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని పెట్రోలియం ఇండస్ట్రీ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నేచురల్ గ్యాస్ జీఎస్టీ పరిధికి వెలుపల ఉంది. ఈ ఇంధనంపై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ వంటి పన్నులు వర్తిస్తాయి.
జీఎస్టీ పరిధిలోకి..!
ఆర్థిక మంత్రిత్వ శాఖకు తన ప్రీ-బడ్జెట్ మెమోరాండంలో, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ (FIPI), పర్యావరణ వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడటానికి పైప్‌లైన్ ద్వారా సహజ వాయువు రవాణాపై అలాగే దిగుమతి చేసుకున్న ఎల్‌ఎన్‌జీ తిరిగి గ్యాసిఫికేషన్‌పై జీఎస్టీని హేతుబద్ధీకరించాలని డిమాండ్ చేసింది. దేశంలో ప్రాథమిక ఆయిల్ వ్యవస్థలో సహజవాయువు వాటాను కేంద్ర ప్రభుత్వం పెంచాలనుకున్న లక్ష్యాలు నేరవేరాలంటే కచ్చితంగా నేచురల్ గ్యాస్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆశించింది. నేచురల్ గ్యాస్‌పై పలు రాష్ట్రాలు 24.5 శాతం నుంచి 14 శాతం వరకు వ్యాట్‌ను విధిస్తోన్నాయి. నేచురల్ గ్యాస్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ధరలు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి.
COP-26 లక్ష్యాలే ..!
2030 నాటికి నేచురల్ గ్యాస్ వాటాను 6.2 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. సహజ వాయువును ఎక్కువగా ఉపయోగించడంతో ఇంధన ధర భారీగా తగ్గే అవకాశం ఉంది. దాంతో పాటుగా భారీ ఎత్తున కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. COP-26 కట్టుబాట్లను చేరుకోవడంలో ఇది సహాయపడుతుంది.
చదవండి: 69 ఏళ్ల తర్వాత టాటా గూటికి ఎయిర్ ఇండియా..!
Comments
Please login to add a commentAdd a comment