న్యూఢిల్లీ: ప్రధాని మోదీ లక్ష్యమైన గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ సాకారానికి.. సహజ వాయువును జీఎస్‌టీ కిందకు తీసుకురావాలని పరిశ్రమ డిమాండ్ చేసింది. దేశ ఇంధన బాస్కెట్‌లో సహజవాయవు వాటాను పెంచాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ (ఎఫ్‌ఐపీఐ) కోరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఈ సమాఖ్యలో భాగంగా ఉన్నాయి. పైపులైన్ల ద్వారా సరఫరా చేసే సహజవాయువు, దిగుమతి చేసుకునే ఎల్‌ఎన్‌జీ ఆధారిత రీగ్యాసిఫికేషన్‌పై జీఎస్‌టీని తగ్గించాలని కోరింది. అప్పుడు పర్యావరణ అనుకూల ఇంధన ధరలు తగ్గుతాయని బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించిన వినతిపత్రంలో కోరింది. 2030 నాటికి దేశ ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటా ప్రస్తుతం ఉన్న 6.2 శాతం నుంచి 15 శాతానికి చేర్చాలన్నది ప్రధాని లక్ష్యంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment