Natural gas (gas)
-
జీఎస్టీలోకి గ్యాస్..
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ లక్ష్యమైన గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ సాకారానికి.. సహజ వాయువును జీఎస్టీ కిందకు తీసుకురావాలని పరిశ్రమ డిమాండ్ చేసింది. దేశ ఇంధన బాస్కెట్లో సహజవాయవు వాటాను పెంచాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ (ఎఫ్‌ఐపీఐ) కోరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఈ సమాఖ్యలో భాగంగా ఉన్నాయి. పైపులైన్ల ద్వారా సరఫరా చేసే సహజవాయువు, దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీ ఆధారిత రీగ్యాసిఫికేషన్పై జీఎస్టీని తగ్గించాలని కోరింది. అప్పుడు పర్యావరణ అనుకూల ఇంధన ధరలు తగ్గుతాయని బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించిన వినతిపత్రంలో కోరింది. 2030 నాటికి దేశ ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటా ప్రస్తుతం ఉన్న 6.2 శాతం నుంచి 15 శాతానికి చేర్చాలన్నది ప్రధాని లక్ష్యంగా ఉంది. -
భారత్‌లో బీపీ గ్రూప్ విస్తరణ
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో ఉన్న యూకే దిగ్గజం బీపీ గ్రూప్.. భారత్‌లో ఇంధన రిటైల్, మొబిలిటీ సొల్యూషన్స్‌లో విస్తరించనుంది. భారత్‌ను అసాధారణ మార్కెట్‌గా అభివర్ణించడమేగాక, నమ్మశక్యం కాని రీతిలో అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించింది. అయితే సహజ వాయువును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బీపీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ లూనీ కోరారు. సెరావీక్ నిర్వహించిన ఇండియా ఎనర్జీ ఫోరంలో ఆయన మాట్లాడారు. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో వచ్చే ఐదేళ్లలో 5,500 రిటైల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. పెట్రోల్, డీజిల్ విక్రయంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సౌకర్యం కూడా వీటిలో ఉంటుంది. ఆర్ఐఎల్ భాగస్వామ్యంతో..: నెట్వర్క్ విస్తరణలో భాగంగా 80,000 ఉద్యోగాలను సృష్టిస్తాం అని లూనీ వివరించారు. ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీతో బీపీకి లోతైన, విశ్వసనీయ బంధం ఉందన్నారు. కాగా, ప్రస్తుతం ఆర్ఐఎల్కు 1,400 పెట్రోల్ బంకులు, 31 విమాన ఇంధన కేంద్రాలు ఉన్నాయి. ఆర్ఐఎల్–బీపీల సంయుక్త భాగస్వామ్య కంపెనీ వీటిని చేజిక్కించుకుని విస్తరించనుంది. ఐదేళ్లలో విమాన ఇంధన కేంద్రాలు మరో 14 రానున్నాయి. జేవీలో ఆర్ఐఎల్కు 51% వాటా ఉంది. 49% వాటాకు బీపీ గ్రూప్ రూ.7,000 కోట్లదాకా వెచ్చించింది. కేజీ బేసిన్ డీ6 బ్లాక్‌లో చమురు వెలికితీతకై ఇరు సంస్థలు రూ.37,000 కోట్లు పెట్టుబడి చేయనున్నాయి. ఇదిలావుంటే టోటల్ సీఈవో పాట్రిక్ పౌయన్నె మాట్లాడుతూ ఇంధన వినియోగంలో ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో 30 శాతమే ఉందన్నారు. ఇక్కడ అపార అవకాశాలున్నాయని చెప్పారు. ఎల్ఎన్జీ ఇంపోర్ట్ టెర్మినల్, సిటీ గ్యాస్, రెనివేబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు చేస్తున్నట్టు వెల్లడించారు. -
సహజవాయువు ధర పెంపుపై మళ్లీ మోడీ భేటీ
న్యూఢిల్లీ: త్వరలో ప్రకటించనున్న సహజవాయువు(గ్యాస్) ధర పెంపుపై ప్రధాని నరేంద్ర మోడీ ఆయిల్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మరోసారి సమావేశమయ్యారు. మూడు రోజుల్లో ఇది రెండోసారికాగా, ఆమోదయోగ్యకరమైన విధానంలో గ్యాస్ ధర పెంపును చేపట్టాలని మోడీ భావిస్తున్నారు. ప్రధాన్‌తో ప్రధాని శుక్రవారం ఈ అంశంపై దాదాపు ఐదు గంటలపాటు సమావేశమైన సంగతి తెలిసిందే. ఇంధన రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించగా, ఆదివారంనాటి తాజా సమావేశానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం హాజరుకావడం విశేషం. ఆయిల్, గ్యాస్ రంగంలో పెట్టుబడులను ఆకట్టుకునేందుకు వెంటనే గ్యాస్ ధర పెంపును చేపట్టాల్సిన అవసరమున్నదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, గత ప్రభుత్వం ఒక ఎంబీటీయూ గ్యాస్ ధరను ప్రస్తుత 4.2 డాలర్ల నుంచి 8.4 డాలర్లకు పెంచేందుకు గతంలోనే నిర్ణయించింది. ఈ ధరను సవరించాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.