
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఎన్నికల సమయంలో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు, అమ్మకాలు మందకొడిగా సాగుతాయి. కానీ, ఈసారి రియల్టీ రంగం కట్టలు తెంచుకుంది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 2019 తొలి త్రైమాసికంలో (జనవరి– మార్చి) అమ్మకాల్లో 12 శాతం, కొత్త గృహాల ప్రారంభాల్లో 27 శాతం వృద్ధి నమోదైంది. మధ్యంతర బడ్జెట్, జీఎస్‌టీ రేట్ల తగ్గింపు, గృహ రుణాల వడ్డీ రేట్ల తగ్గింపు, తాజాగా ఆర్‌బీఐ రెపో రేట్ల తగ్గింపే ఇందుకు కారణాలని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నివేదిక తెలిపింది.
ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో హైదరాబాద్‌లో కొత్తగా 4850 గృహాలు ప్రారంభమయ్యాయి. 2018 చివరి త్రైమాసికంలో ఇవి 3940 గృహాలు ప్రారంభమయ్యాయి. అంటే 23 శాతం వృద్ధి. ఇక, అమ్మకాలు చూస్తే.. 2019 క్యూ1లో 5400 విక్రయం కాగా.. 2018 క్యూ4లో 4990 విక్రమమయ్యాయి. 8 శాతం వృద్ధి. 2019 క్యూ1లో హైదరాబాద్, ఎన్‌సీఆర్, ఎంఎంఆర్, బెంగళూరు, పుణె, చెన్నై, కోల్‌కత్తా నగరాల్లో కొత్తగా 70,490 గృహాలు ప్రారంభమయ్యాయి. 2018 క్యూ4లో ఇవి 55,600లుగా ఉన్నాయి. విక్రయాల సంఖ్యను చూస్తే.. 2019 క్యూ1లో 78520 గృహాలు అమ్ముడుపోగా.. 2018 క్యూ4లో 69850 గృహాలు అమ్ముడయ్యాయి. మొత్తం కొత్త గృహాల ప్రారంభాల్లో అఫడబుల్ హౌజింగ్ 44 శాతం వాటా ఉంది. జనవరి–మార్చి మధ్య కాలంలో అందుబాటు గృహాల సరఫరా 47 శాతం పెరిగింది. 2018 క్యూ4లో 20800 అఫడబుల్ హౌజింగ్స్ ప్రారంభం కాగా.. 2019 క్యూ1లో 30750కి పెరిగాయి. 2019 క్యూ1 నాటికి అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ 6.65 లక్షలుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment