ఆ ఫీజు రద్దు చేసిన ఢిల్లీ ఎయిర్పోర్ట్
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు(ఐజీఐ) నుంచి విమానంలో ప్రయాణిస్తున్నారా? అయితే మీక శుభవార్త. ఇంతవరకు ఇప్పటివరకూ విమాన ప్రయాణీకుల నుంచి చేసిన డెవలప్ మెంట్ ఫీజును రద్దు చేసింది. ఇక విమానాశ్రయం నుంచి మిగతా ప్రదేశాలకు ఎగరడం ఇక చౌకే. అంతేకాదు ఇంతవరకూ ప్రయాణీకులకు గుదిబండలా మారిన ఈ చార్జిలను ఉపసంహరించుకోవడంతోపాటు, ఈ నెలకు ఇప్పటికే చెల్లించినవారికి తిరిగి చెల్లించనుంది.ఎన్నో ఏళ్లుగా విమాన ప్రయాణికులపై వేస్తున్నఅభివృద్ధి ఫీజులను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్(డీఐఏఎల్) ఉపసంహరించుకుంది. దీంతో ఆ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణించే వారికి అదనపు వసూళ్ల బాధ తగ్గింది. దేశీయ మార్గాలలో ప్రయాణించే ప్యాసింజర్లపై డెవలప్ మెంట్ చార్జీ కింద డీఐఏఎల్ రూ. 100 వసూలు చేయగా.. ఇంటర్నేషనల్ గమ్యస్థానాలకు వెళ్లేవారిపై రూ.600 వసూలు చేసింది.
ప్యాసెంజర్లపై వేసే అభివృద్ధి లెవీ ఫీజును మే 1 నుంచి వసూలు చేయడం మానేయాలని డీఐఏఎల్ కు ఎయిర్ పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ(ఏఈఆర్ఏ) ఫిబ్రవరిలో ఆదేశాలు జారీచేసింది. ఈ డీఎఫ్ లెవీని డీఐఏఎల్ 2012 డిసెంబర్ నుంచి వసూలు చేసింది. డీఎఫ్ కింద నెలకు రూ.30 కోట్ల మేర వసూలు జరిగింది. డీఎఫ్ కింద మంజూరుచేసిన రూ.3,415 కోట్లను 2016 ఏప్రిల్ 30 వరకూ డీఐఏఎల్ కు రికవరీ అవుతుందని, ఎయిర్ పోర్ట్ టారిఫ్ రెగ్యులేటరీ అథారిటీ ఫిబ్రవరిలో ఈ ఆదేశాలను జారీచేసింది. ఏప్రిల్ 30 తర్వాత ఐజీఐ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణించేందుకు టికెట్లు బుక్ చేసుకున్న ప్యాసెంజర్లకు డెవలప్ మెంట్ చార్జీలను రిఫండ్ చేయాలని అన్నీ ఎయిర్ లైన్ సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గత నెలే ఆదేశాలు కూడా జారీచేసింది.