Swiss
-
ఇక చౌకగా స్విట్జర్లాండ్ చాక్లెట్లు, వాచీలు
స్విస్ చీజ్, చాక్లెట్, వైన్, వాచీలు, ఇతర ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు మరింత చౌకగా లభించనున్నాయి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ) ఎగుమతుల్లో 95.3 శాతం వాటా కలిగిన 82.7 శాతం టారిఫ్ లైన్లపై కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.అదనంగా, ఈఎఫ్టీఏ దేశాలకు తన సేవల ఎగుమతులను పెంచడానికి ఐటీ, హెల్త్‌కేర్, అకౌంటింగ్ వంటి 105 ఉప రంగాలలో భారతదేశం రాయితీలను అందించింది. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో భారత్ మార్చి 10న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా స్విట్జర్లాండ్ నుంచి 128, నార్వే నుంచి 114, లైచెన్టెయిన్ నుంచి 107, ఐస్లాండ్ నుంచి 110 సబ్ సెక్టార్లను భారత్ ఈఎఫ్టీఏకు అనుమతించింది.1960లో ఏర్పాటు చేసిన ఈఎఫ్టీఏ అనేది ఐస్లాండ్, లైచెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్లతో కూడిన ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. ఇది ఐరోపా అంతటా ఆర్థిక సహకారం, స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మొత్తం 13 మిలియన్ల జనాభాతో, ఈఎఫ్టీఏ దేశాలు ప్రపంచంలోని పదో అతిపెద్ద వాణిజ్య వ్యాపారులు, వాణిజ్య సేవల ఎనిమిదో అతిపెద్ద సరఫరాదారులుగా ఉన్నాయి. -
IPL 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్‌వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 తుదిపోరులో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్,ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో అహ్మదాబాద్, నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ఐపీఎల్ పదహారవ సీజన్ విజేత ఎవరనే ఉత్కంఠకు తోడు భారీ వర్షం మరింత టెన్షన్ రేపింది..చివరికి టైటిల్‌ను సీఎస్కే ఎగురేసుకపోయింది. ఇది ఇలా ఉంటే ఐపీఎల్లో 2022లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఓనరు ఎవరు, ఆదాయం ఎంత అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. (ఐపీఎల్ ఫైనల్ విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్, వైరల్ ట్వీట్) ఐపీఎల్ 2022 లక్నో ,అహ్మదాబాద్ టీమ్‌లు ఎంట్రీ ఇచ్చాయి. 25 అక్టోబర్ 2021 ఏర్పాటైన అహ్మదాబాద్ ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ (జీటీ)ని యూరప్‌కు చెందిన ఫ్రెంచ్ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్స్ రూ. 5625 కోట్లకు కొనుగోలు చేసింది. దీని చైర్మన్ స్టీవ్ కోల్ట్స్. స్టీవ్స్ స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంకర్. ఈ కంపెనీ క్రీడలతో పాటు పెట్టుబడి బ్యాంకింగ్ , బ్రోకరేజ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. (3 వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!) సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ పెద్ద అమెరికన్-ఫ్రెంచ్ ఈక్విటీ సంస్థ, 133 బిలియన్ యూరోల విలువైన ఆస్తులున్నాయి. దీని భారత కరెన్సీలో రూ. 11.98 లక్షల కోట్లకు పైగా ఉంది, ఇది క్రికెట్ లీగ్‌లోని మెజారిటీ ఐపీఎల్ జట్టు యజమానుల నికర విలువ కంటే చాలా పెద్దది. ఐపీఎల్ బిడ్ గెలిచిన తర్వాత, ముంబై ఇండియన్స్ మాజీ స్టార్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంచుకుంది. అలాగే స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. (వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు) కాగా ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే గెలిచి అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌తో టై చేసింది.. 2022 అరంగేట్రంలో అదరగొట్టి అన్ని అంచనాలను అధిగమించి మరీ టైటిల్ దక్కించుంది జీటీ. -
స్విస్ సెంట్రల్ బ్యాంక్‌పై ఇన్వెస్టర్ల దావా
లండన్: క్రెడిట్‌సూసే ఇన్వెస్టర్ల బృందం స్విస్ స్విట్జర్లాండ్ ఫైనాన్షియల్ మార్కెట్ సూపర్ వైజరీ అథారిటీ (ఎఫ్‌ఐఎన్‌ఎంఏ/స్విస్ సెంట్రల్ బ్యాంక్)కి వ్యతిరేకంగా ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. గత నెలలో సంక్షోభంలో పడ్డ క్రెడిట్ సూసేని కాపాడేందుకు తీసుకున్న నిర్ణయం ఫలితంగా 16 బిలియన్ స్విస్ఫ్రాంకోలు (17.3 బిలియన్ డాలర్లు) విలువైన బాండ్ల విలువ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారు సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేశారు. క్రెడిట్ సూసేని యూబీఎస్ 3.25 బిలియన్ డాలర్లకు కొనడం తెలిసిందే. ఇదంతా కేంద్ర బ్యాంకు మార్గదర్శకంలోనే జరిగింది. దీంతో స్విట్జర్లాండ్‌లోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌గా ఉన్న క్రెడిట్‌సూసే మునిగిపోకుండా కాపాడినట్టయింది. ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను వెనక్కి తీసుకోవడంతో క్రెడిట్‌సూసే సంక్షోభం పాలైంది. ఎఫ్‌ఐఎన్‌ఎంఏ తీసుకున్న నిర్ణయం స్విస్ ఆర్థిక వ్యవస్థపై ఉన్న విశ్వసనీయత, కచ్చితత్వాన్ని దెబ్బతీసిందని లా సంస్థ క్విన్ ఎమాన్యుయేల్ అర్కుహర్ట్ మేనేజింగ్ పార్ట్నర్ థామస్ వెర్లెన్ తెలిపారు. ఇన్వెస్టర్ల తరఫున ఈ సంస్థే వ్యాజ్యం దాఖలు చేసింది. కోర్టును ఆశ్రయించిన ఇన్వెస్టర్లు సంయుక్తంగా 5 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను బాండ్లలో కలిగి ఉన్నారు. -
ఏపీ విద్యా వ్యవస్థ భేష్.. స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని, ప్రత్యేకించి విద్యా వ్యవస్థ అద్భుతమని స్విట్జర్లాండ్ మాజీ దేశాధ్యక్షుడు ఇగ్నా జియో క్యాసిస్ కొనియాడారు. జెనీవా నగరంలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విద్యా వ్యవస్థ పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. అయితే ఇండియాలోని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఆ రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయని కొనియాడారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేశారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఉన్నాయన్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చుతోందని, ఇది గర్వించదగ్గ విషయం అని అన్నారు. కొంత కాలం తర్వాత ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులుగా నిలుస్తారని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ అందరి వల్లా కాదని, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి ఉన్న వారికే సాధ్యమవుతుందని చెప్పారు. ఆకట్టుకున్న ఏపీ స్టాల్ ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల స్టాల్ పలువురిని ఆకట్టుకుంది. స్వయంగా దేశాధ్యక్షుడే ఏపీ విద్యా విధానాలపై ప్రశంసలు వ్యక్తం చేయడంతో స్విట్జర్లాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ పాట్రిసియా దన్జీ స్టాల్‌ను సందర్శించారు. ప్రభుత్వ పథకాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఏపీలో ఎడ్యుకేషన్ కోసం నాడు–నేడులో తీసుకున్న నిర్ణయాలు, అమలవుతున్న తీరు, విద్యా ప్రమాణాలు మెరుగుదల.. తదితర విషయాలపై ఆయన ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. డిజిటల్ లెర్నింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్‌లో భాగంగా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌ల పంపిణీ, పాఠశాలల ఆధునికీకరణ, డిజిటల్ బోర్డుల ఏర్పాటు, ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధన తదితర కార్యక్రమాలన్నీ పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయని కొనియాడారు. ఇలాంటి సౌకర్యాలు కల్పించడంతో సమాజంలో అన్ని వర్గాల వారు విద్యనభ్యసిస్తారని చెప్పారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో న్యూట్రిషన్ ఫుడ్ అందించడం మంచి పరిణామం అన్నారు. చదవండి: టీడీపీకి పుట్టగతులుండవని ‘ఈనాడు’ భయం లైబ్రరీ, ప్లేగ్రౌండ్స్, హైజెనిక్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్, యూనిఫాం, స్టేషనరీ కిట్స్, బుక్స్ అందిస్తున్న విధానం చాలా బాగుందన్నారు. ‘ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు ఆల్’ విధానం చాలా నచ్చిందన్నారు. ఏపీ స్టాల్‌ను ఇంటర్నేషనల్ యూనిసెఫ్ ప్రోగ్రామ్స్ స్పెషలిస్ట్ అతెనా లౌబాచెర్ సందర్శించారు. గరŠల్స్ ఎడ్యుకేషన్ విధానంతో అసమానతలను రూపుమాపవచ్చని అభినందించారు. డిజిటల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా బైజూస్ ద్వారా అందిస్తున్న విద్యా విధానం నూతన పద్ధతుల్లో గొప్పగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇండియా నుండి ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యుడు వున్నవ షకిన్ కుమార్ పాల్గొన్నారు. -
హెచ్‌సీఎల్ టెక్కు స్విస్ సంస్థ నుంచి భారీ ఆర్డర్
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ కంపెనీ ఎస్ఆర్ టెక్నిక్స్ నుంచి కొన్నేళ్లపాటు అమల్లో ఉండే(మల్టీ ఇయర్) కాంట్రాక్టును కుదుర్చుకున్నట్లు దేశీ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ తాజాగా పేర్కొంది. ఆర్డర్లో భాగంగా టెక్నిక్స్ కార్యకలాపాలను డిజిటల్ రూపేణా మార్పు చేసేందుకు అనుగుణమైన సర్వీసులు అందించనున్నట్లు తెలియజేసింది. వైమానిక నిర్వహణ, రిపేర్, ఓవర్‌హాల్(ఎంఆర్వో) సర్వీసులందించే టెక్నిక్స్ కొన్ని భాగస్వామ్య సంస్థలతో కలసి పనిచేస్తోంది. యూరప్, అమెరికా, ఆసియా, మధ్యప్రాచ్యంలో బిజినెస్ డెవలప్మెంట్ కార్యలయాలను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 500 కస్టమర్లకు విమానాల ఇంజిన్లు, ఎయిర్‌ఫ్రేమ్, విడిభాగాలు, సాంకేతిక మద్దతుసహా అవసరమైన(కస్టమైజ్డ్) సేవలు సమకూరుస్తోంది. కాగా.. హెచ్‌సీఎల్ టెక్ డీల్ విలువను వెల్లడించలేదు. -
2022–23లో భారత్ వృద్ధి 6.9 శాతం
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 6.9 శాతంగా నమోదవుతుందని యూబీఎస్ ఆర్థికవేత్తలు అంచనావేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) ఈ రేటు మరింతగా 5.5 శాతానికి పడిపోతుందని స్విస్ బ్రోకరేజ్ సంస్థ ఎకనమిస్టులు ఒక నివేదికలో విశ్లేషించారు. 2024–25లో 6 శాతం వృద్ధి అంచనా వేసిన సంస్థ, దీర్ఘకాలిక సగటు ఇదే స్థాయిలో కొనసాగుతుందని పేర్కొంది. ప్రపంచ వృద్ధి మందగమనం, కఠిన ద్రవ్య విధానాలు భారత్ వృద్ధి మందగమనానికి కారణమని నివేదిక పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ప్రపంచ ఆర్థిక పరిణామాల ప్రభావం తక్కువగా ఉండే దేశాల్లో భారత్ కూడా ఒకటైనప్పటికీ, ఈ ప్రతికూలతల నుంచి భారత్ ఎకానమీ తప్పించుకోలేదు. ► భారత్ వ్యవస్థీకృత వృద్ధి ధోరణి చెక్కుచెదరకుండా ఉంది. అయితే ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) వంటి స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వంపై సమీప కాలంలో భారత్ దృష్టి సారించాలి. లేదంటే తీవ్ర ప్రతికూల పరిస్థితులకు అవకాశం ఉంది. ► ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా 4 శాతం కనిష్టం నుంచి 1.90 శాతం పెరిగి 5.9 శాతానికి ఎగసిన రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది వృద్ధికి విఘాతం కలిగించే అంశం. ► కోవిడ్ ప్రభావం తగ్గిన వెంటనే వినియోగదారుల వ్యయంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. గృహాల కొనుగోలు శక్తి పెరిగింది. అయితే ఈ సానుకూల ప్రభావాలు వడ్డీరేట్ల పెంపు పరిణామాలతో ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. పొదుపుల్లో క్షీణత నమోదుకావచ్చు. అలాగే అసంపూర్తిగా మిగిలిఉన్న లేబర్ మార్కెట్ పునరుద్ధరణ... గృహాల కొనుగోలు శక్తి, డిమాండ్‌పై ప్రభావం చూపుతుంది. ► ఈ పరిస్థితి కంపెనీలు తమ పెట్టుబడి ప్రణాళికల అమలును వాయిదే వేసే అవకాశం ఉంది. ► కొన్ని క్లిష్టతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెట్టుబడులు పెరిగే అవకాశాలే ఉన్నాయి. ప్రతికూల ఫలితాల తగ్గింపు, ప్రైవేటు మూలధనానికి ప్రోత్సాహం వంటి అవకాశాలు దీనివల్ల ఒనగూరతాయి. ► ఇక ఎగుమతుల విషయానికి వస్తే, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం ఉంటుంది. 450 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన కొంత క్లిష్టంగా మారవచ్చు. ► రూపాయి తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి సెంట్రల్ బ్యాంక్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తగిన చర్యలు తీసుకుంటోంది. ఇతర సెంట్రల్ బ్యాంకులతో సమన్వయాన్ని సాధిస్తోంది. ► 2024లో సాధారణ ఎన్నికలను ఎదుర్కొననున్న కేంద్ర ప్రభుత్వం, వృద్ధికి మద్దతుగా ద్రవ్య స్థిరీకరణ విధానాలను కొంత నెమ్మది చేయచ్చు. ఇది ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే వీలుంది. -
ఏపీకి ‘స్విస్’ సిమెంట్ టెక్నాలజీ!
సాక్షి, అమరావతి: వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, విద్యుత్‌ను పొదుపు చేయగలిగే సామర్థ్యం గల కొత్తరకం సిమెంట్ మిక్స్ సాంకేతికతను రాష్ట్రానికి అందించేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన స్విస్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ అండ్ కో–ఆపరేషన్ (ఎస్డీసీ) ముందుకొచ్చింది. లైంస్టోన్ కాల్సిన్డ్ క్లే సిమెంట్ (ఎల్సీ–3) అనే ఈ కొత్త సాంకేతికత సిమెంట్ పరిశ్రమలకు లాభాలను కూడా తెచ్చిపెడుతుందని వివరించింది. ఈ మేరకు స్విట్జర్లాండ్ ఎంబసీ కో–ఆపరేషన్, డెవలప్మెంట్ హెడ్ జోనాథన్ డెమింగే ప్రతిపాదించినట్లు ఇంధన శాఖ గురువారం వెల్లడించింది. చదవండి: ‘సంక్షేమం’ ఖర్చులో ఏపీదే అగ్రస్థానం సిమెంట్ తయారీ రంగంలో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. క్లింకర్ అనే ముడి పదార్థాన్ని సిమెంట్ తయారీలో ఎక్కువ మోతాదులో ఉపయోగించటంవల్ల అది వాతావరణ కాలుష్యానికి దారితీస్తోందని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాధారణంగా సిమెంట్ తయారీలో ఉపయోగించే ముడిపదార్థాల్లో 95 శాతం క్లింకర్, 5 శాతం జిప్సం వాడతారు. కానీ, ఎస్డీసీ ప్రతిపాదిస్తున్న లైంస్టోన్ కాల్సిన్డ్ క్లే సిమెంట్ మిక్స్‌ను వాడటంవల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు 40 శాతం తగ్గుతాయని, 20 శాతం ఇంధనాన్ని ఆదా చెయ్యొచ్చని ఇంధన శాఖ వెల్లడించింది. పరిశ్రమల దృష్టికి తీసుకెళ్తాం.. ఇండో స్విస్ బీప్ ద్వారా ఏపీ గృహ నిర్మాణ పథకంలో ఇంటి లోపలి ఉష్ణోగ్రతలు తగ్గించే సాంకేతికతను కొన్ని రోజుల ముందే ప్రవేశపెట్టగా, ఇప్పుడు సిమెంట్ పరిశ్రమలకు ఎల్సీ–3 సాంకేతికతను అందించేందుకు స్విస్ ఏజెన్సీ ముందుకొచ్చింది. ఎస్డీసీ ప్రతిపాదించిన నూతన సిమెంట్ మిక్స్ సాంకేతికత గురించి ప్రభుత్వానికి వివరించి, పరిశ్రమల శాఖ సహకారంతో ఈ అంశాన్ని సిమెంట్ పరిశ్రమల దృష్టికి తీసుకెళ్తాం. – కె.విజయానంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ -
జపాన్ షిప్పింగ్ కంపెనీ సీఈవోతో సీఎం జగన్ భేటీ
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌లో జపాన్‌కి చెందిన ప్రముఖ ట్రాన్స్పోర్ట్ సంస్థ మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈఓ తకీషి హషిమొటోతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ షిప్పింగ్ కంపెనీల్లో ఒకటిగా మిట్సుయి ఉంది. ఏపీలో అభివృద్ధి చేస్తున్న పోర్టులు ఇక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. స్విస్ పార్లమెంటు బృందం మరోవైపు స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్ బృందం వరల్డ్ ఎకామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా దావోస్‌కు చేరుకున్న సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో వ్యాపార అవకాశాలపై ముఖ్యమంత్రితో స్విస్ పార్లమెంటు బృందం చర్చలు జరిపింది. చదవండి: టెక్నాలజీ హబ్‌గా విశాఖపట్నం.. టెక్ మహీంద్రా సీఈవోతో సీఎం జగన్ చర్చలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గోడలు లేని హోటల్.. రోజుకు రూ.23 వేలు
బెర్న్(స్విడ్జర్లాండ్) : సకల సదుపాయాలతో ప్రకృతి అందాల నడుమ జీవించాలనుకునే వారిని స్విడ్జర్లాండ్లోని ఓపెన్ ఎయిర్ హోటళ్లు ఆకర్షిస్తున్నాయి. తివాచి పరిచినట్టు ఉండే పచ్చని పచ్చిక బయళ్లు. చల్లని గాలులు వీచే చెట్లు. ఎటుచూసినా రమనీయమైన పర్వతాలు. ఆలపిస్తూ, ఆకృతినిచ్చే అందమైన నదుల మధ్య ఒక్క రోజు గడిపితే ఆ కిక్కే వేరు. ఇలాంటి వారి కోసమే స్విడ్జర్లాండ్‌కు చెందిన సోదరులు ఫ్రాంక్, పాట్రిక్‌లు డేనియల్ చార్బోన్నీర్తో కలిసి ఆల్ఫ్స్ పర్వతాల్లో ‘జీరో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు’ను ప్రారంభించారు. మొత్తం ఏడు ఓపెన్ ఎయిర్ హోటళ్లను రూపొందించారు. ఈ హోటళ్లలో ఒక్కరోజు బసకుగానూ 308 డాలర్లు(దాదాపు రూ.23వేలు)గా నిర్ణయించారు. గోడలు, టాప్లేకుండానే ఉండే ఈ హోటళ్లలో స్థానికంగా ఉండే రైతులే పర్యటకులకు రూమ్ సర్వీస్ చేస్తారు. ఇంత మంచి వెంటిలేషన్ ఉన్న ప్రదేశం బహుశా ఎక్కడా ఉండకపోవచ్చని ఫ్రాంక్, పాట్రిక్ సోదరులు అంటున్నారు. ముఖ్యంగా వేసవి విడిది కోసం ఈ హోటళ్లను రూపొందించామన్నారు. అయితే ఒకవేళ వర్షం గనుక పడితే బదులుగా మరో చోట బసకు ముందే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. చదవండి : ఇటలీపై కరోనా పంజా.. మెడికల్ చీఫ్ కీలక వ్యాఖ్యలు అమెరికా: పోలీసుల చర్యతో తల పగిలింది! -
హిటాచీ చేతికి ఏబీబీ ‘పవర్’
న్యూఢిల్లీ: స్విస్ ఇంజనీరింగ్ దిగ్గజం ఏబీబీకి చెందిన పవర్ గ్రిడ్స్ వ్యాపార విభాగాన్ని జపాన్ సంస్థ హిటాచీ కొనుగోలు చేయనుంది. ఈ విభాగంలో 80.1 శాతం వాటాలను హిటాచీ కొనుగోలు చేస్తున్నట్లు ఏబీబీ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం పవర్ గ్రిడ్స్ వ్యాపార పరిమాణాన్ని 11 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.79,200 కోట్లు) లెక్క కట్టినట్లు, డీల్ విలువ సుమారు 6.4 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 46,080 కోట్లు) ఉండనున్నట్లు తెలిపింది. నియంత్రణ సంస్థల అనుమతుల మేరకు 2020 ప్రథమార్ధంలో డీల్ పూర్తి కావొచ్చని అంచనా. డీల్ ప్రాథమిక స్వరూపం ప్రకారం... ఈ జాయింట్ వెంచర్లో ఏబీబీ 19.9 శాతం వాటాలను అట్టే పెట్టుకోనుంది. ఒప్పందం ముగిసిన మూడేళ్ల తర్వాత సముచిత మార్కెట్ రేటుకు విక్రయించేసి వైదొలిగేందుకు అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా పవర్ గ్రిడ్ పరిశ్రమలో స్థానం పటిష్టం చేసుకునేందుకు హిటాచీకి ఈ డీల్ లాభించనుంది. ప్రధానంగా పారిశ్రామిక రోబోల తయారీలో ఉన్న ఏబీబీ... ఆటోమేషన్ వంటి విభాగాలపై దృష్టి పెట్టే క్రమంలో అంతగా లాభదాయకత లేని వ్యాపార విభాగాన్ని వదిలించుకునేందుకు తాజా డీల్ తోడ్పడనుంది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కార్యకలాపాలపై 500 మిలియన్ డాలర్లు వెచ్చించనుండగా, ఏటా 500 మిలియన్ డాలర్ల మేర వ్యయాలు తగ్గుతాయని ఏబీబీ వివరించింది. జాయింట్ వెంచర్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో ఉంటుందని, ప్రస్తుత మేనేజ్మెంట్ టీమ్‌నే హిటాచీ కొనసాగిస్తుందని పేర్కొంది. మరోవైపు, పవర్ గ్రిడ్ బిజినెస్‌ను ఏబీబీ ప్రత్యేక వ్యాపార సంస్థగా విడగొడుతోందని, దీని విలువ నుంచి రుణభారం మొదలైనవన్నీ తీసేయగా.. 80.1% వాటాలను సుమారు 6.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నామని హిటాచీ తెలిపింది. 10 బిలియన్ డాలర్ల టర్నోవర్.. ఏబీబీకి చెందిన పవర్ గ్రిడ్ విభాగానికి .. వివిధ దేశాల్లో విద్యుత్ సరఫరా పరికరాలు, కంట్రోల్ వ్యవస్థల ఉత్పత్తి, నిర్వహణ కార్యకలాపాలు ఉన్నాయి. ఇందులో 36,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. గతేడాది 10.4 బిలియన్ డాలర్ల అమ్మకాలు సాధించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో నిర్వహణ లాభాల మార్జిన్ స్వల్పంగా 60 బేసిస్ పాయింట్లు క్షీణించి 10.0 శాతానికి పరిమితమైంది. రెండేళ్ల క్రితమే పవర్ గ్రిడ్స్ విభాగాన్ని విక్రయించేయాలంటూ కొందరు షేర్‌హోల్డర్ల నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ.. ఏబీబీ సీఈవో ఉల్రిచ్ స్పైస్హోఫర్ అంగీకరించలేదు. కానీ తాజాగా యూ–టర్న్ తీసుకుని విక్రయ ప్రతిపాదనకు అంగీకరించారు. ఏబీబీ సంస్థ భారత్‌లో ఏబీబీ ఇండియా పేరిట కార్యకలాపాలు సాగిస్తోంది. తాజా డీల్ నేపథ్యంలో సోమవారం ఎన్ఎస్ఈలో సంస్థ షేరు 2 శాతం క్షీణించి రూ. 1,400 వద్ద క్లోజయ్యింది. -
వింటేజ్ విమానం కూలి 20 మంది మృతి
జెనీవా: రెండో ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన వింటేజ్ విమానం స్విట్జర్లాండ్‌లో కూలిపోవడంతో 20 మంది దుర్మరణం చెందారు. 1939లో జర్మనీలో తయారైన జేయూ52 హెబీ–హెచ్‌వోటీ విమానం.. 3 వేల మీటర్ల ఎత్తయిన పిజ్ సెగ్నాస్ పర్వతంపై శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) కూలిపోయింది. పర్వతం పశ్చిమ వైపున 2,540 మీటర్ల (సుమారు 8333 అడుగులు) ఎత్తులో ప్రమాదం సంభవించిందని.. మృతుల్లో 11 మంది పురుషులు, 9 మంది మహిళలు ఉన్నట్లు పోలీసు శాఖ అధికార ప్రతినిధి అనిటా సెంటీ తెలిపారు. స్విట్జర్లాండ్‌లోని టిసినో నుంచి బయలుదేరిన విమానం జూరిచ్‌లోని డ్యూబెండోర్ఫ్ మిలటరీ ఎయిర్‌ఫీల్డ్‌కు చేరాల్సి ఉందని జర్మన్ పత్రిక బ్లింక్ తెలిపింది. సహాయక చర్యలు చేపట్టేందుకు ఐదు హెలికాప్టర్లను పంపినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన ఎయిర్ స్పేస్‌లో విమానాల రాకపోకలను ఆదివారం రాత్రి వరకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. ‘180 డిగ్రీలకు దక్షిణంగా విమానం మళ్లింది. అంతలోనే ఓ రాయిలాగా నేలపై కుప్పకూలింది’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. -
సూపర్ ‘స్విస్’
మొదట్లోనే ప్రత్యర్థికి ఆధిక్యం సమర్పించుకున్నా... తర్వాత పట్టు జారకుండా చూసుకుంటూ... అవకాశాలు సృష్టించుకున్న స్విట్జర్లాండ్... సెర్బియాను బోల్తా కొట్టిస్తూ విజయాన్ని ఒడిసిపట్టింది! గ్రానిట్ జాకా, జెర్డాన్ షకీరి రెండు అద్భుత గోల్స్‌తో తమ జట్టును గట్టెక్కించగా... చివరి నిమిషంలో మ్యాచ్‌ను చేజార్చుకుని సెర్బియా నిస్సహాయంగా మిగిలింది! కలినిన్‌గ్రాడ్: మొదటి మ్యాచ్‌లో బ్రెజిల్‌ను నిలువరించిన స్విట్జర్లాండ్... కీలకమైన రెండో మ్యాచ్‌లో సెర్బియాను ఓడించి నాకౌట్‌కు మార్గం సిద్ధం చేసుకుంది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన పోరులో ఆ జట్టు 2–1తో సెర్బియాను కంగుతినిపించింది. స్విట్జర్లాండ్ తరఫున జాకా (53వ నిమిషం), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షకీరి (90వ నిమిషం) ఒక్కో గోల్ చేశారు. అద్భుతం అనదగిన రీతిలో చాలా దూరం నుంచే బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపిన వీరు... తమ జట్టు ఆశలు నిలిపారు. అంతకు ముందు సెర్బియా తరఫున మిట్రోవిక్ (5వ నిమిషం) గోల్ కొట్టాడు. ప్రస్తుతం 4 పాయింట్లతో ఉన్న స్విస్ జట్టు... ఈ నెల 27న కోస్టారికాతో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇదే రోజున బ్రెజిల్‌తో జరగనున్న పోరులో గెలిస్తేనే సెర్బియా తదుపరి దశకు వెళ్తుంది. మొదట్లోనే సెర్బియా షాక్... స్విస్‌కు మ్యాచ్ ఆరంభంలోనే సెర్బియా షాకిచ్చింది. డాసన్ టాడిక్ నుంచి అందిన క్రాస్‌ను చక్కగా సమన్వయం చేసుకున్న అలెగ్జాండర్ మిట్రోవిక్ 5వ నిమిషంలో తలతో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపి ఖాతా తెరిచాడు. దీంతో మొదటి భాగంలో 1–0తో సెర్బియాదే పైచేయి అయింది. రెండో భాగంలో స్విస్ జోరు... మొదటి భాగంలో కోల్పోయిన ఆధిక్యాన్ని స్విట్జర్లాండ్ రెండో భాగం ప్రారంభంలోనే సమం చేసింది. ఈ ఘనత షకీరి, జాకా ఇద్దరికీ చెందుతుంది. 53వ నిమిషంలో షకీరి కొట్టిన బలమైన షాట్‌కు బంతి సెర్బియా ఆటగాడికి తగిలి వెనక్కు వెళ్లింది. దీనిని దొరకబుచ్చుకున్న జాకా అంతే వేగంగా స్పందించాడు. ‘డి’ బాక్స్ ముందు ఉన్న అతడు... ఐదుగురు ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పిస్తూ నేరుగా గోల్ కొట్టాడు. మరోవైపు సెర్బియా పోటీగా ఆడటంతో మ్యాచ్ ‘డ్రా’వైపు సాగేలా కనిపించింది. అయితే... 90వ నిమిషంలో షకీరి అద్భుతం చేశాడు. దాదాపు మైదానం మధ్యలో బంతిని అందుకున్న అతడు ప్రత్యర్థి ఆటగాడికి చిక్కకుండా వేగంగా పరిగెడుతూ గోల్‌పోస్ట్ ముందు కీపర్‌ను ఏమారుస్తూ స్కోరు చేశాడు. ఈ ఆనందంలో అతడు చొక్కా విప్పి ఎల్లో కార్డుకు గురయ్యాడు. ఇంజ్యూరీ సమయం పెద్దగా మెరుపులేమీ లేకుండానే సాగిపోవడంతో స్విస్ జట్టునే విజయం వరించింది. ఈ ప్రపంచకప్‌లో తొలిగా గోల్ ఇచ్చి... మ్యాచ్‌లో గెలిచిన జట్టుగా స్విట్జర్లాండ్ నిలిచింది. గోల్ సంబరాలపై అభ్యంతరం మ్యాచ్‌లో గోల్స్ అనంతరం జాకా, షకీరి చేసిన ‘డబుల్ ఈగల్’ సంకేతాలు చర్చకు తావిచ్చాయి. వీరిద్దరితో పాటు మరో ఆటగాడు బెల్రామి సెర్బియాలోని ఒకప్పటి రాష్ట్రమైన కొసావో మూలాలున్న వారు. స్వయంప్రతిపత్తి అంశమై సెర్బియాతో కొసావో గతంలో పెద్ద ఎత్తున ఘర్షణ పడింది. ఇదే అంశమై పోరాడినందుకు 1980ల్లో షకీరి తండ్రిని సెర్బియా జైల్లో పెట్టింది. ప్రపంచ కప్‌లో అదే దేశానికి ప్రత్యర్థిగా ఆడే సందర్భం రావడంతో నాటి శత్రుత్వాన్ని దృష్టిలో పెట్టుకున్న షకీరి... కొసావో గుర్తు ఉన్న బూట్లతో మ్యాచ్ ఆడేందుకు ఫిఫా అనుమతి కోరాడు. అయితే, దీనికి అంగీకారం రాలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లో అతడిని సెర్బియా అభి మానులు పలుసార్లు ఎగతాళి చేశారు. అయితే, గోల్ చేసిన అనంతరం జాకా, షకీరి వీటికి సమాధానంగా... సెర్బియా పతాకంలో ఉండే రెండు గద్దల గుర్తును ఎద్దేవా చేస్తున్నట్లు సంకేతాలు చేశారు. షకీరి ఏకంగా చొక్కానే విప్పేశాడు. వీటిపై స్విస్ కోచ్ పెట్కోవిక్ మ్యాచ్ తర్వాత స్పందించాడు. ఫుట్‌బాల్–రాజకీయాలు వేర్వేరని, రెండింటినీ ముడి పెట్టవద్దని వ్యాఖ్యానించి వాతావరణాన్ని శాంతింపజేశాడు. అటువైపు షకీరి కూడా ఇందులో వేరే ఉద్దేశం లేదన్నాడు. -
స్విస్‌తో కలిసి పనిచేస్తాం: మోదీ
బీజింగ్: నల్లధనం కట్టడికి స్విట్జర్లాండ్‌తో కలిసి పనిచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నల్లధనం, హవాలా, ఆయుధ అక్రమ రవాణా, డ్రగ్స్ ఇలా ఏ ఆర్థిక లావాదేవీలో అయినా పారదర్శకత ప్రధాన సవాల్‌గా ముందుకొస్తున్నదన్నారు. గురువారం స్విస్ ప్రెసిడెంట్ డొరిస్ లూథర్డ్‌తో భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ తరహా అంతర్జాతీయ సమస్యలపై స్విట్జర్లాండ్‌తో కలిసి భారత్ ముందుకు సాగుతుందన్నారు. ఇరు దేశాల ఆర్థిక సహకారానికి ఎఫ్‌డీఐ కీలక చోదక శక్తిగా ఉంటుందన్నారు. భారత్‌లో స్విట్జర్లాండ్ పెట్టుబడిదారులను తాము సాదరంగా స్వాగతిస్తామన్నారు. భారత్ అభివృద్ధిలో స్విస్ కంపెనీల నైపుణ్యం ఉపయోగపడుతుందని అన్నారు. తమ చర్చల్లో ఐరోపా యూనియన్, భారత్ మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణజ్య ఒప్పందం అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని మోదీ చెప్పారు. మరోవైపు తమ దేశంలో మనీలాండరింగ్‌కు వ్యతిరేకంగా పటిష్ట చట్టాలున్నాయని లూథర్డ్ తెలిపారు. -
ఖాతాలపై స్విస్‌తో ఒప్పందం
-
ఖాతాలపై స్విస్‌తో ఒప్పందం
2018 తర్వాత వివరాలు పొందే అవకాశం న్యూఢిల్లీ: 2018 సెప్టెంబర్ నుంచి స్విట్జర్లాండ్‌లోని భారతీయుల బ్యాంకు ఖాతాల వివరాలను పొందేందుకు ఆ దేశంతో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. ఒప్పందం మేరకు 2019 సెప్టెంబర్ నుంచి ‘ఆటోమేటిక్ షేరింగ్’కింద భారతీయుల ఖాతాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనే వీలుంటుంది. ఈ సమయానికి ముందున్న సమాచారాన్ని ఇచ్చేందుకు స్విస్ నిరాకరించింది. దీని అమలుకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమాచారాన్ని పంచుకొనే ‘సంయుక్త ప్రకటన’ఒప్పందంపై సీబీడీటీ చైర్మన్ సుశీల్‌చంద్ర, స్విస్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోడిట్ మంగళవారం ఇక్కడ సంతకాలు చేశారు. సమాచార గోప్యతకు భంగం కలగనీయమని స్విస్‌కు భారత్ హామీ ఇచ్చింది. ‘ఏఈఓఐ (ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్) ఒప్పందం వల్ల 2019 సెప్టెంబర్ నుంచి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల సమాచారాన్ని పొందొచ్చు’అని ఆర్థిక శాఖ పేర్కొంది. బహుపాక్షిక సమర్థ సంస్థ ఒప్పందం (ఎంసీఏఏ: మల్టీలేటరల్ కంపీటెంట్ అథారిటీ అగ్రిమెంట్) కింద భారత్‌తో ఏఈఓఐ కుదుర్చుకున్నాం’అని స్విస్ ఆర్థిక శాఖ తెలిపింది. అరుుతే ఖాతాల సమాచారమివ్వాలంటూ భారత్ నుంచి పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనలపై ఒప్పందం సందర్భంగా చర్చకు రాలేదు. గత జూన్‌లో స్విస్ అధ్యక్షుడు జోహాన్ ష్నెడర్ అమ్మన్‌తో జనీవాలో భేటీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్విస్ ఖాతాల సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంపై చర్చించారు. -
ఆదేశం.. భారత్ ను మించిపోయింది!
న్యూఢిల్లీః ప్రతివిషయంలో భారత్ తో పోల్చుకొని, అన్నింటా తానే ముందుండాలని ప్రయత్నించే పాకిస్తాన్.. నల్లడబ్బు విషయంలో ఇండియాను మించిపోయిందట. స్విస్ బ్యాంకుల్లో పదివేల కోట్ల వరకూ ఆదేశం నల్లధనం దాచినట్లు తాజా నివేదికలను బట్టి తెలుస్తోంది. ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్ నల్లధనం దాచడంలో ముందు స్థానంలో ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. 2014 లెక్కలతో పోలిస్తే పాకిస్తాన్ స్విస్ బ్యాంకుల్లో దాచిన బ్లాక్ మనీ 16 శాతం పెరిగినట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ తాజా నివేదికల్లో వెల్లడించింది. పాకిస్తాన్ నల్లధనం విలువ పెరగడం వరుసగా ఇది రెండోసారని నివేదికలో తెలిపింది. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ ఎన్ బి) వెల్లడించిన వివరాలను బట్టి, 2014 లో పాకిస్తాన్ కరెన్సీ సీహెచ్ఎఫ్ 1,301 మిలియన్లుగా ఉన్న నల్లధనం, 2015 పూర్తయ్యేనాటికి 16 శాతం పెరిగి సిహెచ్ ఎఫ్ 1,513 మిలియన్లకు చేరినట్లు తెలిపింది. అయితే భారత్ విషయంలో ఆ విలువలు 33 శాతం పడిపోయి, 2015 చివరికి రూ. 8,392 కోట్ల రూపాయలకు చేరినట్లు ఎస్ ఎన్ బి వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది. -
నెలకు రూ.1.70లక్షలు ఇస్తుందట!
స్విట్లర్లాండ్ ప్రజలకు ఆ దేశ ప్రభుత్వం భారీ ఆఫర్ ను ప్రకటించనుంది. తన పౌరులకు నెలకు కచ్చితమైన ఆదాయాన్ని సమకూర్చేలా ప్రణాళికలు రచిస్తోందిట. స్విట్జర్లాండ్ ప్రభుత్వం తీసుకు వస్తున్న ఈ కొత్త చట్టం ప్రకారం పౌరులు అందరికి బేషరతుగా 2,500 ఫ్రాంక్‌లు (ఒక స్విస్ ఫ్రాంక్ ఒక డాలర్ ప్రస్తుతం సమానం) చెల్లించే ప్రతిపాదనను పరిశీలిస్తోందట. అంటే ఏ పనీ చేయకపోయినా నెలకు సుమారు లక్షా 70 వేల రూపాయలు ఒక్కో కుటుంబానికి కచ్చితమైన వేతనం లభించనుంది. అంతేకాదు పిల్లలకు కూడా 625 డాలర్లను చెల్లించేందుకు యోచిస్తోందట. కళాకారులు, రచయితలు, ఇతర మేధావులు ఈ పథకాన్ని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదన పట్ల స్థానిక రాజకీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ చర్య వల్ల ప్రజల్లో పనిచేయాలనే కాంక్ష తగ్గుతుందని ఆరోపిస్తున్నాయి. అటు ఈ స్టయిఫండ్ వల్ల యువతలో సోమరితనం పెరిగి, నైపుణ్యత తగ్గుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని వాదిస్తున్నారు. ఇదే సమయంలో ఓ ధనిక దేశంలో ఈ తరహా అవకాశాన్ని ప్రజలకు దగ్గర చేయడం గొప్ప ప్రయోగం అవుతుందని యూనివర్శిటీ ఆఫ్ లుసానే పొలిటికల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ ఆండ్రియాస్ లాడ్నర్ వివరించారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ పథకానికి గాను సంవత్సరానికి రెండువందల బిలియన్ డాలర్లు ఖర్చుకానుంది. దీనిపై దేశవ్యాప్తంగా జూన్ 5 న ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. మరోవైపు ఆర్థిక వేతన హామీ పథకంపై ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తున్న మొట్టమొదటి దేశంగా స్విస్ అవతరించింది. కాగా ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం2014 లో స్విట్లర్లాండ్ వ్యక్తి సగటు ఆదాయంలో అయిదవ స్థానాన్ని అక్రమించింది. -
భారీ మొత్తంలో స్విస్ ఖాతాలు బయటికి
జెనీవా: ఎలాంటి లావాదేవీలు జరపకుండా అరవై ఏళ్లుగా మూలుగుతున్న ఖాతాలు, ఖాతాదారుల వివరాలను స్విస్ బ్యాంకు బుధవారం వెల్లడించింది. ఖాతాలకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపకుండా ఉండిపోయిన 2,600 మంది ఖాతాదారులు, సంస్థల పేర్లను తమ అధికారిక వెబ్సైట్ www.dormantaccounts.ch లో ప్రచురించింది. ఆ ఖాతాదారుల వారసులు ముందుకు వచ్చి ఈ నిధులను సొంతం చేసుకోవాలని సూచించింది. ఈ ఖాతాల మొత్తం విలువ 44.5 మిలియన్ల అమెరికన్ డాలర్లు ఉంటుందని తెలిపింది. ఏడాదిలోగా ఖాతాదారుల వారసులు బ్యాంకు ముందుకు వచ్చి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. -
అసెండాస్ చేతిలో అమరావతి
మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక.. తొలి దశలో 3వేల ఎకరాలు * ఐకానిక్ కాంప్లెక్స్‌కు ఉచితంగా 250 ఎకరాలు * 375 ఎకరాల్లో గవర్నమెంట్ కాంప్లెక్స్‌లు... * సింగపూర్ కంపెనీతో సర్కారు బేరసారాలు, మంతనాలు * సింగపూర్... ఏపీ ప్రభుత్వాల మధ్య జాయింట్ వెంచర్ కుదరదు సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని అమరావతి అభివృద్ధికి స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్‌కు చెందిన అసెండాస్ కంపెనీని ఎంపిక చేసేందుకు ప్రభుత్వ పెద్దలు మంతనాలు, బేరసారాలను కొనసాగిస్తున్నారు. ఆ కంపెనీ ఎండీతో రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి(సీఆర్డీఏ) చర్చలు జరుపుతోంది. పూర్తి వాణిజ్య విధానంలోనే మాస్టర్ డెవలపర్ సంస్థ ఎంపికను చేపట్టాలని రాష్ట్రప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. అసెండాస్ కంపెనీ ఇష్టాయిష్టాలను తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా విధానాలను రూపొందించే పనిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. తొలిదశలో 3వేల ఎకరాలను కంపెనీకి అప్పగించనున్నారు. ఇందులో 375 ఎకరాల్లో ప్రభుత్వ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. వీటి నిర్మాణ బాధ్యతలనూ అసెండాస్‌కే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. పూర్తి హక్కుల కోసం కంపెనీ షరతులు తొలిదశలో ఇచ్చే 3వేల ఎకరాల భూములపై పూర్తి హక్కులు ఇవ్వాల్సిందిగా అసెండాస్ కంపెనీ షరతు విధించింది. ఐకానిక్ కాంప్లెక్స్(భారీ వాణిజ్య సముదాయం) నిర్మాణం కోసం 250 ఎకరాలను కంపెనీకి ఉచితంగా ఇవ్వనున్నారు. ఇందులో ఐకానిక్ కాంప్లెక్స్ నిర్మించిన తర్వాత కంపెనీ విక్రయించుకోనుంది. అందుకు అనుగుణంగా ఈ 250 ఎకరాలపై హక్కులు ఇవ్వాల్సిందిగా షరతు విధించింది. రాష్ట్రప్రభుత్వం 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తామని, అభివృద్ధి చేసిన తర్వాత హక్కులు కల్పిస్తామని చెబుతున్నట్టు తెలిసింది. ఈ 250 ఎకరాల్లో కనీసం 20 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకు కంపెనీ అంగీకరించింది. స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ ఎంపికను అక్టోబర్ 22వ తేదీ కన్నా ముందుగానే పూర్తి చేయాల్సిందిగా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సింగపూర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఎటువంటి జాయింట్‌వెంచర్ ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అలాగే నూతన రాజధానిలో భూముల విక్రయం ద్వారా వచ్చే నిధుల్లో వాటా ఇవ్వాలని షరతు విధించింది. తొలిదశ రాజధాని అభివృద్ధి అక్టోబర్ 2018 నాటికి పూర్తి చేయడానికి కంపెనీ అంగీకరించింది. తొలిదశలో 3వేల ఎకరాల అభివృద్ధితోపాటు మిగతా రాజధాని అభివృద్ధిని 20 నుంచి 30 ఏళ్లల్లో అభివృద్ధి చేసే హక్కు కల్పించాలని అసెండాస్ పేర్కొంది. ఐదేళ్లలో 3వేల ఎకరాలను అభివృద్ధి చేయని పక్షంలో సమాంతర అభివృద్ధికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం పేర్కొంటోంది. 70 శాతం అభివృద్ధి పూర్తి అయిన పిదప, తర్వాత దశ అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరుతోంది. అయితే, తర్వాత దశపైన ఒత్తిడి తేవద్దని ప్రభుత్వం పేర్కొంటోంది. భూమి ధరల నిర్ధారణ కమిటీ చైర్మన్‌గా కంపెనీ ఎండీయే ఉంటారని, సభ్యులుగా ప్రభుత్వానికి చెందిన వారితో సమానంగా కంపెనీకి చెందిన వారు ఉంటారని అసెండాస్ స్పష్టం చేసింది. ఐకానిక్ కాంప్లెక్స్‌కు 250 ఎకరాలు ఉచితంగా ఇవ్వడంతోపాటు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని, రాజధానిలో మౌలికవసతుల కల్పనకు వెచ్చించిన ఖర్చుపోగా మిగిలిన మొత్తాన్ని మాత్రమే పంచుకోవాలని కంపెనీ పేర్కొంది. రాజధాని నిర్మాణంలో ఇతరత్రా భారాలకు బాధ్యత వహించడానికి అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. సంయుక్త అమలు కమిటీకి, బృహత్తర ప్రణాళికపై ఏపీ, సింగపూర్ల మధ్య అవగాహన ఒప్పందానికి అంగీకరిస్తామని అసెండాస్ తెలిపింది. మధ్యలో బాధ్యతల నుంచి తప్పుకునే క్లాజును చేర్చేందుకు కంపెనీ అంగీకరించడం లేదు. నూతన రాజధాని నిర్మాణం శంకుస్థాపనకోసం అక్టోబర్ 22న సింగపూర్ ప్రధానమంత్రి రావడానికి ముందుగానే స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ ఖరారు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నూతన రాజధానిలో రహదారులు, నీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి మౌలికవసతుల కల్పన పనులన్నింటికీ అయ్యే వ్యయాన్ని పూర్తిగా మాస్టర్ డెవలపర్‌గా ఎంపికయ్యే సంస్థనే తొలుత భరిస్తుంది. నూతన రాజధానిలో పరిశ్రమలకు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు భూములను 99 ఏళ్లపాటు లీజుకు ఇవ్వనున్నారు. ఆ భూములపై లీజు ద్వారా వచ్చిన డబ్బులను, అలాగే సీఆర్డీఏకు వచ్చిన నిధులను మాస్టర్ డెవలపర్‌కు ప్రభుత్వం చెల్లించనుంది. ‘రాజధాని’ పరిధిలో సవివరమైన ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: రాజధానిలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో సవివరమైన మాస్టర్ ప్రణాళిక రూపకల్పన, ల్యాండ్‌పూలింగ్ స్కీములో భూములిచ్చిన వారికి ఎక్కడ ప్లాట్లు ఇవ్వాలనే ప్రణాళికను రూపొందించే బాధ్యతలను సింగపూర్‌కు చెందిన సుర్బానా కంపెనీకి నామినేషన్‌పై అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జాప్యం అయిందని, కొత్తగా కంపెనీలను ఆహ్వానించినా వారికి అవగాహన ఉండదని, సుర్బానా కంపెనీకి రాజధాని మాస్టర్ ప్రణాళిక రూపొందించిన అనుభవం ఉన్నందున సవివరమైన మాస్టర్ ప్రణాళిక రూపకల్పన, ల్యాండ్‌పూలింగ్ స్కీము ఖరారు బాధ్యతలను సుర్బానాకే అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో సీఆర్డీఏ సమావేశంలో సుర్బానాకు రూ.11.92కోట్లకు నామినేషన్‌పై అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సంస్థ 217చ.కి.మీ. పరిధిలో గల 6వేల హెక్టార్లలో సర్వే, ఎక్కడ ఏది రావాలో క్షేత్రస్థాయిలో మార్కింగ్, ల్యాండ్‌పూలింగ్ విధానంలో భూములిచ్చిన రైతులకు తిరిగి ప్లాట్లు ఎక్కడ ఇవ్వాలో నిర్ధారిస్తుంది. 29 గ్రామాల్లోని వారికి పాట్లు ఎక్కడెక్కడ వస్తాయో మార్కింగ్ చేయడంతో పాటు 217 చ.కి.మీ. పరిధిలో భూమి వినియోగం, రవాణా, ఇతర మౌలికవసతుల ప్రణాళికను సుర్బానా రూపొందించనుంది. 45 రోజుల్లోగా అంటే సెప్టెంబర్ 15కల్లా సవివరమైన ప్రణాళికను ప్రభుత్వానికి అందజేయాలి. అప్పటి నుంచి మూడునెలల్లోగా ల్యాండ్‌పూలింగ్ స్కీము ప్రణాళికను, మొత్తం ప్రణాళికను ఆరునెలల్లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. సుర్బానా సమర్పించిన ప్రతి పాదనలను యథాతథంగా ముఖ్యమంత్రి ఆమోదించారు. మాస్టర్ ప్రణాళిక ఖరారు కోసం ఒక హెక్టార్‌కు రూ.1,646 చొప్పున రూ.3.57కోట్ల వ్యయం అవుతుందన్న ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ల్యాండ్‌పూలింగ్ స్కీము ఖరారు కోసం హెక్టార్‌కు రూ.3,292 చొప్పున రూ.7.15 కోట్ల వ్యయం, ఇతర మార్కింగ్‌ల కోసం హెక్టార్‌కు రూ.549 చొప్పున రూ.1.19 కోట్ల వ్యయం అవుతుందని సుర్బానా చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. -
మరో ఇద్దరి ఖాతాల వివరాలు వెల్లడించిన స్విస్
బెర్న్: స్విట్జర్లాండ్ తన దేశంలోని రహస్య బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఇద్దరు భారతీయుల వివరాలను బహిర్గతం చేసింది. భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు.. సయ్యద్ మహమ్మద్ మసూద్, చాంద్ కౌసర్ మహమ్మద్ మసూద్‌ల ఖాతాలకు సంబంధించిన మరిన్ని వివరాలను గెజిట్‌లో వెల్లడించింది. గొలుసుకట్టు పెట్టుబడుల పథకం పేరుతో మోసం చేశారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న మసూద్‌ల ఖాతాలకు సంబంధించిన కొన్ని వివరాలను గతంలోనూ స్విస్.. భారత్‌కు అందజేసింది. గతంలో వారి ఖాతాలనూ స్తంభింపజేసింది. ఈ గెజిట్‌లో పనామా, జర్మనీ, అమెరికాలకు చెందిన పలువురి పేర్లతో పాటు బహమాస్ కేంద్రంగా ఉన్న వార్ఫ్ లిమిటెడ్ సంస్థ వివరాలు ఉన్నాయి. మసూద్‌లకు, ఈ సంస్థకు సంబంధాలు ఉన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా వెల్లడించిన పేర్లతో కలిపి ఇప్పటివరకూ ఏడుగురు భారతీయు పేర్లను, వారి ఖాతాల వివరాలను స్విస్ బహిర్గతం చేసింది.