బెర్న్: స్విట్జర్లాండ్ తన దేశంలోని రహస్య బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఇద్దరు భారతీయుల వివరాలను బహిర్గతం చేసింది. భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు.. సయ్యద్ మహమ్మద్ మసూద్, చాంద్ కౌసర్ మహమ్మద్ మసూద్‌ల ఖాతాలకు సంబంధించిన మరిన్ని వివరాలను గెజిట్‌లో వెల్లడించింది. గొలుసుకట్టు పెట్టుబడుల పథకం పేరుతో మోసం చేశారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న మసూద్‌ల ఖాతాలకు సంబంధించిన కొన్ని వివరాలను గతంలోనూ స్విస్.. భారత్‌కు అందజేసింది.
గతంలో వారి ఖాతాలనూ స్తంభింపజేసింది. ఈ గెజిట్‌లో పనామా, జర్మనీ, అమెరికాలకు చెందిన పలువురి పేర్లతో పాటు బహమాస్ కేంద్రంగా ఉన్న వార్ఫ్ లిమిటెడ్ సంస్థ వివరాలు ఉన్నాయి. మసూద్‌లకు, ఈ సంస్థకు సంబంధాలు ఉన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా వెల్లడించిన పేర్లతో కలిపి ఇప్పటివరకూ ఏడుగురు భారతీయు పేర్లను, వారి ఖాతాల వివరాలను స్విస్ బహిర్గతం చేసింది.
మరో ఇద్దరి ఖాతాల వివరాలు వెల్లడించిన స్విస్
Published Wed, Jun 3 2015 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM
Advertisement