ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 తుదిపోరులో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్,ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో అహ్మదాబాద్, నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ఐపీఎల్ పదహారవ సీజన్ విజేత ఎవరనే ఉత్కంఠకు తోడు భారీ వర్షం మరింత టెన్షన్ రేపింది..చివరికి టైటిల్‌ను సీఎస్‌కే ఎగురేసుకపోయింది. ఇది ఇలా ఉంటే ఐపీఎల్‌లో 2022లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఓనరు ఎవరు, ఆదాయం ఎంత అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. (ఐపీఎల్ ఫైనల్ విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్, వైరల్ ట్వీట్)
ఐపీఎల్ 2022 లక్నో ,అహ్మదాబాద్ టీమ్‌లు ఎంట్రీ ఇచ్చాయి. 25 అక్టోబర్ 2021 ఏర్పాటైన అహ్మదాబాద్ ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ (జీటీ)ని యూరప్‌కు చెందిన ఫ్రెంచ్ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్స్ రూ. 5625 కోట్లకు కొనుగోలు చేసింది. దీని చైర్మన్ స్టీవ్ కోల్ట్స్. స్టీవ్స్ స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంకర్. ఈ కంపెనీ క్రీడలతో పాటు పెట్టుబడి బ్యాంకింగ్ , బ్రోకరేజ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. (3 వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!)
సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ పెద్ద అమెరికన్-ఫ్రెంచ్ ఈక్విటీ సంస్థ, 133 బిలియన్ యూరోల విలువైన ఆస్తులున్నాయి. దీని భారత కరెన్సీలో రూ. 11.98 లక్షల కోట్లకు పైగా ఉంది, ఇది క్రికెట్ లీగ్‌లోని మెజారిటీ ఐపీఎల్ జట్టు యజమానుల నికర విలువ కంటే చాలా పెద్దది. ఐపీఎల్ బిడ్ గెలిచిన తర్వాత, ముంబై ఇండియన్స్ మాజీ స్టార్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంచుకుంది. అలాగే స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. (వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు)
కాగా ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిచి అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌తో టై చేసింది.. 2022 అరంగేట్రంలో అదరగొట్టి అన్ని అంచనాలను అధిగమించి మరీ టైటిల్ దక్కించుంది జీటీ.
Comments
Please login to add a commentAdd a comment