
నూడుల్స్‌ని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే వంటకం ఇది. భారతీయుల వంటకాల జాబితాలో ప్రస్తుతం ఇదే అగ్ర స్థానంలో నిలుస్తోంది. ఈజీగా అయిపోయే వంటకం కావడంతో అంతా దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా బిజీగా ఉండే వర్కింగ్ మహిళలకు ఇది ఎంతో తేలిగ్గా చేసే వంటకం. అయితే ఈ రెసిపీ తయారీని ఎవరు కనిపెట్టారు..? ఎలా ప్రజలకు ఇష్టమైన వంటకంగా మారింది తదితరాల గురించి చూద్దామా..!.
క్షణాల్లో తయారు చేసే వంటకం ఏదన్నా ఉందంటే అది మ్యాగీ నూడుల్సే. భారతీయ సంస్కృతిలో కూడా అంతర్భాగమైపోయింది. అంతలా ప్రజాదరణ చూరగొన్న ఈ వంటకం తయారీ ఎవరు కనుగొన్నారంటే..
ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని చూరగొన్న ఈ వంటకం విజయవంతమైన బ్రాండ్‌గా నిలిచి అందరి మన్ననలకు అందుకుంటోంది. ఈ మ్యాగీ వంటకం పుట్టింది 19వ శతాబ్దంలో స్విట్జర్లాండ్‌లోని కెంప్తాల్ అనే సుందరమైన పట్టణంలో జరిగింది. 1884లో యువ ఔత్సాహిక వ్యవస్థాపకుడు జూలియస్ మ్యాగీ అనే వ్యక్తి ఈ మ్యాగీ నూడుల్స్ ఒక బ్రాండ్‌లా తీసుకొచ్చాడు.
తక్కువ సమయంలో మంచి పోషకాలతో రుచికరమైన వంటకం చేయాలనే సంకల్పంతో జనించిన వంటకం ఇది. అయితే మొదట్లో ఇది ఉప్పు, మిరియాలతో తయారైంది. అనాతికాలంలోనే దీని ఉత్పత్తులకు తర్వగా ప్రపంవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దాంతో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, యూఎస్ వంటి ఇతర దేశాల్లో కూడా దాని శాఖలు తెరిచే స్థాయికి చేరుకుంది.
1900 సంవత్సరంలో, జూలియస్ ఉత్పత్తులు స్విట్జర్లాండ్ వంటి అనేక దేశాలకు విస్తరించాయి. ఇక జూలియస్ మొత్తం 18 రకాల వెరైటీ ఫ్లేవర్డ్ నూడిల్స్‌ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈమ్యాగీ ప్యాకేజ్ ఉత్పత్తులను ఈజీxe ఐడెంటిఫై చేయగలం. కానీ ఆకాలంలో ఇవి ఎరుపు, పసుపు, నలుపు రంగుల ప్యాకింగ్‌ల ద్వారా మాత్రమే గుర్తించేవారు. ప్రస్తుతం ఈ బ్రాండ్‌ని నెస్లే కొనుగులు చేసి చౌక ధరల్లో నాణ్యతతో కూడిన పోషకాహారాన్ని అందించాలనే ఆకాంక్షను నెరవేర్చుకుంది.
అలాగే నెస్లే నివేదిక ప్రకారం.. "ప్రతి సెకనుకు, ప్రపంచవ్యాప్తంగా 21000 కంటే ఎక్కువ ఆహారాలు మాగీ ఉత్పత్తులతో తయారైనవే." సంవత్సరాలుగా, ఈ బ్రాండ్ చాలా మంది హృదయాల్లో మంచి స్థానాన్ని ఏర్పరుచుకుంది. చకచక తయారై ఈ వంటకం ఆల్-టైమ్ సొల్యూషన్‌తో వచ్చిన రెసిపీ. ఎప్పటికీ మహిళలకు, బ్యాచిలర్‌లకు, నిమిషాల్లో ఎలాంటి శ్రమ లేకుండా క్షణాల్లో తయారై వంటకంగా పేరు తెచ్చుకుంది.
(చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్..! ఫిదా అవ్వాల్సిందే..)
Comments
Please login to add a commentAdd a comment