Viral Video: ఇక ఆపండి ప్లీజ్‌! నూడుల్స్‌ తినాలనే ఉత్సాహం చచ్చిపోయింది | Korean Fusion Dosa With Cheese In Viral Video Internet Has Divided | Sakshi
Sakshi News home page

ఇక ఆపండి ప్లీజ్‌! దయచేసి ఇలాంటి వంటకం ట్రై చేయొద్దు.. ఇప్పటికైనా డిలీట్‌ చేయడం మంచిది

Published Mon, Oct 17 2022 8:41 PM | Last Updated on Tue, Oct 18 2022 5:39 PM

 Korean Fusion Dosa With Cheese In Viral Video Internet Has Divided - Sakshi

ఫుడ్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కడుపులో ఆకలి గంటకొట్టిన ప్రతిసారీ చూసేది దాని వంకే కదా. చాలామందికి తినడం నచ్చితే.. కొద్దిమందికి మాత్రమే వండటం ఇష్టం ఉంటుంది. ఫుడ్‌ మీద ఆసక్తితో నిత్యం కొత్త కొత్త వంటకాలను సృష్టిస్తుంటారు. ఏదో ఒకటి ఢిఫరెంట్‌గా తయారు చేసి వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటారు.అయితే అన్ని వంటకాలు అద్భుతంగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. కొన్నిసార్లు మనం చేసే వంటకం అట్టర్‌ప్లాప్‌ అవుతుంది.

అచ్చం ఇలాగే ఓ ఫుడ్‌ బ్లాగర్‌ వెరైటీ వంటకంతో ముందుకొచ్చింది. అంజలి ధింగ్రా అనే యువతి దోశ, నూడుల్స్‌ కాంబినేషన్‌తో చేసిన ఫుడ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసింది. పాన్‌పై దోశ వేసి.. మరోపక్క కొరియన్‌ నూడుల్స్‌ను కుక్‌ చేసింది. తరువాత నూడుల్స్‌ను ముందుగా చేసిన ప్లెయిన్‌ దోశపై స్టఫ్‌ చేసింది. దాన్ని టేస్ట్ చేస్తూ వీడియోలో కనిపించింది. 

కొరియన్‌ ఫ్యూజన్‌ దోశ క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకూ లక్ష మందికి పైగా వీక్షించారు. అయితే ఈ కాంబినేషన్‌ ఫుడ్‌ లవర్స్‌ను అంతగా ఆకట్టుకోలేదు. ‘దోశ సరిగ్గా రాలేదు..లోపల వెన్న అలాగే కనిపిస్తోందని, నూడుల్స్‌ తినాలనే ఉత్సాహం చచ్చిపోయిందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ఈ వీడియోను ఇప్పటికైనా డిలీట్‌ చేయడం మంచిది, ఇలాంటి డిష్‌ ట్రై చేయవద్దని మరికొంతమంది చెబుతున్నారు. 
చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: మహిళలతో ఆడిపాడిన మంత్రి మల్లారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement