noodle
-
కస్టమర్‌కు షాకింగ్ అనుభవం.. నూడుల్స్ ఆర్డర్ చేస్తే బతికున్న కప్ప!
జపాన్ దేశంలో ఒక పేరు మోసిన రెస్టారెంట్లో ఒకాయన నూడుల్స్ ఆర్డర్ చేస్తే పాపం అతడికి నూడుల్స్‌లో కప్ప ప్రతక్షమైంది. పైగా ఆ కప్ప బతికుండటంతో ఆ పెద్దమనిషి తిన్నది కక్కలేక, మిగిలింది మింగలేక దయనీయ స్థితిలో ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. జపాన్‌కు చెందిన కైటో అనే ఓ వ్యాపారస్తుడు శుస్తిగా భోజనం చేద్దామని ఒక పెద్ద రెస్టారెంట్లోకి వెళ్లి నోరూరే స్పెషల్ థిక్ నూడుల్స్‌ను ఆర్డర్ చేశాడు. ఆ రెస్టారెంట్ వాళ్ళు ఈ ఐటెంను ఒక కప్పులో వడ్డిస్తారట. కొద్దిసేపు తర్వాత రెస్టారెంట్ బేరర్ ఓ ప్లేటులో నూడుల్స్ కప్పును తీసుకొచ్చి కైటో ముందుంచాడు. అంతేకాదు ఆ బేరర్ కైటోకు తినే ముందు ఆ కప్పును బాగా షేక్ చేసి తింటే ఆ టేస్ట్ మరింత బాగుంటుందని మరీ మరీ చెప్పడంతో కైటో ముందుగా నూడుల్స్ కప్పును బాగా షేక్ చేశాడు. ఆ తర్వాత కప్పును ఓపెన్ చేసి మెల్లగా తినటం ప్రారంభించాడు. నూడుల్స్ మహారుచిగా ఉండడంతో ఆవురావురుమంటూ లాగించేశాడు. తినటం క్లైమామ్స్‌కు వచ్చాక కప్పులో నుంచి ఒక్క కప్ప తల పైకి పెట్టి మరీ కైటోను కోపంగా చూస్తోంది. దాంతో కైటోకు కడుపంతా దేవేసినట్టైంది. అప్పటికే దాదాపుగా నూడుల్స్ తినేయటంతో చేసేదేమీ లేక రెస్టారెంట్ యాజమాన్యాన్ని నిలదీశాడు. పరువు పోతుందన్న భయంతో సదరు రెస్టారెంట్ యాజమాన్యం కైటోకు క్షమాపణ చెప్పి నష్టపరిహారాన్ని చెల్లించింది. ఆ రెస్టారెంట్ వారు క్షమాపణలు చెప్పినా కూడా కైటో తనకు ఎదురైన పరిస్థితి మరెవరికీ ఎదురు కాకూడదనే ఉద్దేశ్యంతో తన పరిస్థితి మొత్తాన్నీ వీడియోతో సహా జపానీస్ భాషలో తన ట్విట్టర్ అకౌంట్లో పొందుపరిచాడు. చదవండి: మణిపూర్‌లో అమిత్ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం #シェイクうどん 自分が出張中に気に立っていたうどんを食べたら 何にカエル🐸 振った後に食べて最後の方まで気づかなかった お店は3時間の営業停止の後にその日の夜から営業再開、今もサラダや同じ商品を販売中 食べる前には気をつけて pic.twitter.com/pjbxuLy9F6 — 魁斗 (@kaito09061) May 22, 2023 -
Viral Video: ఇక ఆపండి ప్లీజ్! నూడుల్స్ తినాలనే ఉత్సాహం చచ్చిపోయింది
ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కడుపులో ఆకలి గంటకొట్టిన ప్రతిసారీ చూసేది దాని వంకే కదా. చాలామందికి తినడం నచ్చితే.. కొద్దిమందికి మాత్రమే వండటం ఇష్టం ఉంటుంది. ఫుడ్ మీద ఆసక్తితో నిత్యం కొత్త కొత్త వంటకాలను సృష్టిస్తుంటారు. ఏదో ఒకటి ఢిఫరెంట్‌గా తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు.అయితే అన్ని వంటకాలు అద్భుతంగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. కొన్నిసార్లు మనం చేసే వంటకం అట్టర్‌ప్లాప్ అవుతుంది. అచ్చం ఇలాగే ఓ ఫుడ్ బ్లాగర్ వెరైటీ వంటకంతో ముందుకొచ్చింది. అంజలి ధింగ్రా అనే యువతి దోశ, నూడుల్స్ కాంబినేషన్‌తో చేసిన ఫుడ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసింది. పాన్‌పై దోశ వేసి.. మరోపక్క కొరియన్ నూడుల్స్‌ను కుక్ చేసింది. తరువాత నూడుల్స్‌ను ముందుగా చేసిన ప్లెయిన్ దోశపై స్టఫ్ చేసింది. దాన్ని టేస్ట్ చేస్తూ వీడియోలో కనిపించింది. కొరియన్ ఫ్యూజన్ దోశ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకూ లక్ష మందికి పైగా వీక్షించారు. అయితే ఈ కాంబినేషన్ ఫుడ్ లవర్స్‌ను అంతగా ఆకట్టుకోలేదు. ‘దోశ సరిగ్గా రాలేదు..లోపల వెన్న అలాగే కనిపిస్తోందని, నూడుల్స్ తినాలనే ఉత్సాహం చచ్చిపోయిందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఈ వీడియోను ఇప్పటికైనా డిలీట్ చేయడం మంచిది, ఇలాంటి డిష్ ట్రై చేయవద్దని మరికొంతమంది చెబుతున్నారు. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: మహిళలతో ఆడిపాడిన మంత్రి మల్లారెడ్డి -
రాందేవ్ నూడుల్స్‌లో పురుగులు
హర్యానా: నూడుల్స్ వివాదం ఇప్పుడిప్పుడే తగ్గుతుండగా మరోసారి అది ముదిరే అవకాశం కనిపిస్తోంది. అందుకు తాజాగా రాందేవ్ బాబా తన ఆయుర్వేద సంస్థ పతంజలి ద్వారా విడుదల చేసిన నూడుల్స్ కారణమయ్యేలా కనిపిస్తోంది. హర్యానాలోని ఓ వినియోగ దారుడు తాను కొనుగోలు చేసిన పతంజలి నూడుల్స్‌లో పురుగులు ప్రత్యక్ష్యం అయ్యాయని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. జాతీయ ఆహార భద్రతా సంస్థ అనుమతి తీసుకోకుండానే రాందేవ్ నూడుల్స్ ఉత్పత్తిని ప్రారంభించారని ఇప్పటికే ఆయనపై ఆరోపణలు వస్తుండగా, తాజాగా ప్రారంభించిన నూడుల్స్ లో పురుగులు ఉన్నాయని ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయడం చూస్తుంటే ఈ నూడుల్స్ విషయంలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో అని ఆలోచిస్తే ఆందోళన తప్పకపోవచ్చేమో.