రాందేవ్ నూడుల్స్లో పురుగులు | insects in ram dev noodles | Sakshi
Sakshi News home page

రాందేవ్ నూడుల్స్లో పురుగులు

Published Sun, Dec 6 2015 12:27 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

రాందేవ్ నూడుల్స్లో పురుగులు

రాందేవ్ నూడుల్స్లో పురుగులు

హర్యానా: నూడుల్స్ వివాదం ఇప్పుడిప్పుడే తగ్గుతుండగా మరోసారి అది ముదిరే అవకాశం కనిపిస్తోంది. అందుకు తాజాగా రాందేవ్ బాబా తన ఆయుర్వేద సంస్థ పతంజలి ద్వారా విడుదల చేసిన నూడుల్స్ కారణమయ్యేలా కనిపిస్తోంది.

హర్యానాలోని ఓ వినియోగ దారుడు తాను కొనుగోలు చేసిన పతంజలి నూడుల్స్లో పురుగులు ప్రత్యక్ష్యం అయ్యాయని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. జాతీయ ఆహార భద్రతా సంస్థ అనుమతి తీసుకోకుండానే రాందేవ్ నూడుల్స్ ఉత్పత్తిని ప్రారంభించారని ఇప్పటికే ఆయనపై ఆరోపణలు వస్తుండగా, తాజాగా ప్రారంభించిన నూడుల్స్ లో పురుగులు ఉన్నాయని ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయడం చూస్తుంటే ఈ నూడుల్స్ విషయంలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో అని ఆలోచిస్తే ఆందోళన తప్పకపోవచ్చేమో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement