భారీ మొత్తంలో స్విస్ ఖాతాలు బయటికి | dormant Swiss account holders names revealed | Sakshi
Sakshi News home page

భారీ మొత్తంలో స్విస్ ఖాతాలు బయటికి

Published Wed, Dec 16 2015 10:28 PM | Last Updated on Wed, Apr 3 2019 8:09 PM

భారీ మొత్తంలో స్విస్ ఖాతాలు బయటికి - Sakshi

భారీ మొత్తంలో స్విస్ ఖాతాలు బయటికి

జెనీవా: ఎలాంటి లావాదేవీలు జరపకుండా అరవై ఏళ్లుగా మూలుగుతున్న ఖాతాలు, ఖాతాదారుల వివరాలను స్విస్ బ్యాంకు బుధవారం వెల్లడించింది. ఖాతాలకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపకుండా ఉండిపోయిన 2,600 మంది ఖాతాదారులు, సంస్థల పేర్లను తమ అధికారిక వెబ్‌సైట్ www.dormantaccounts.ch లో ప్రచురించింది.

ఆ ఖాతాదారుల వారసులు ముందుకు వచ్చి ఈ నిధులను సొంతం చేసుకోవాలని సూచించింది. ఈ ఖాతాల మొత్తం విలువ 44.5 మిలియన్ల అమెరికన్ డాలర్లు ఉంటుందని తెలిపింది. ఏడాదిలోగా ఖాతాదారుల వారసులు బ్యాంకు ముందుకు వచ్చి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సూచించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement