![CM Jagan Met Mitsui OSK Lines CEO Takashi Hashimotoin Davos - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/23/cm-ys-jagan33.jpg.webp?itok=HiTGxEkm)
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌లో జపాన్‌కి చెందిన ప్రముఖ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈఓ తకీషి హషిమొటోతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ షిప్పింగ్ కంపెనీల్లో ఒకటిగా మిట్సుయి ఉంది. ఏపీలో అభివృద్ధి చేస్తున్న పోర్టులు ఇక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు.
స్విస్ పార్లమెంటు బృందం
మరోవైపు స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్ బృందం వరల్డ్ ఎకామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా దావోస్‌కు చేరుకున్న సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో వ్యాపార అవకాశాలపై ముఖ్యమంత్రితో స్విస్ పార్లమెంటు బృందం చర్చలు జరిపింది.
చదవండి: టెక్నాలజీ హబ్‌గా విశాఖపట్నం.. టెక్ మహీంద్రా సీఈవోతో సీఎం జగన్ చర్చలు
Comments
Please login to add a commentAdd a comment