YS Jagan Davos Tour
-
స్వదేశం చేరుకున్న సీఎం వైఎస్ జగన్
దావోస్ వేదికగా వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు. కాగా, దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని సీఎం జగన్, మంత్రుల బృందం మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు గన్నవరం విమానాశ్రయంలో ప్రజా ప్రతినిధులు, ఉన్నాతాధికారులు స్వాగతం పలికారు. ఇక, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. అభివృద్ధిని, పర్యావరణ హితాన్ని సమతుల్యం చేసుకుంటూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శక్తివంతంగా నిలిపేందుకు సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం దావోస్ వేదికగా చక్కటి ఫలితాలు సాధించింది. రేపటి ప్రపంచంతో పోటీపడుతూ, సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ వేదికను చక్కగా వినియోగించుకుంది. విఖ్యాత సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంతో అవగాహన కుదుర్చుకున్నారు. విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి రాష్ట్రానికి చేరుకున్న సీఎం శ్రీ వైయస్.జగన్ కు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారు లు. pic.twitter.com/fL2yYdzIfz— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 31, 2022 ఇది కూడా చదవండి: దావోస్‌లో ఏపీ ధగధగ -
CM YS Jagan Davos Tour: రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. అభివృద్ధిని, పర్యావరణ హితాన్ని సమతుల్యం చేసుకుంటూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శక్తివంతంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం దావోస్ వేదికగా చక్కటి ఫలితాలు సాధించింది. రేపటి ప్రపంచంతో పోటీపడుతూ, సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ వేదికను చక్కగా వినియోగించుకుంది. విఖ్యాత సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంతో అవగాహన కుదుర్చుకున్నారు. 27,700 మెగావాట్ల క్లీన్ గ్రీన్ ఎనర్జీ నాలుగోతరం పారిశ్రామికీకరణకు ప్రధాన కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చాలన్న లక్ష్యంతో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్కో, అరబిందోలతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. పంప్డ్ స్టోరేజీ లాంటి వినూత్న విధానాలతో మొత్తంగా 27,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంలోకి రాబోతోంది. గ్రీన్ కోతో కలిసి తాము ప్రపంచంలోనే తొలిసారిగా గ్రీన్ ఎనర్జీపై ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు, ఈ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ ఆర్సిలర్ మిట్టల్ ప్రకటించింది. ముఖ్యమంత్రి.. సంస్థ సీఈఓ ఆదిత్య మిట్టల్ ఈ ప్రకటన చేశారు. ఏపీలో పారిశ్రామిక విధానాలు చాలా సానుకూలంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. స్టీల్‌తోపాటు, ఎనర్జీ, నిర్మాణ, మైనింగ్, రవాణా, ప్యాకేజింగ్ తదితర రంగాల్లో ఉన్న 76.571 బిలియన్ డాలర్ల ఆర్సిలర్ మిట్టల్ గ్రూపు తొలిసారిగా గ్రీన్ ఎనర్జీకి వేదికగా రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంది. కర్బన రహిత పారిశ్రామికీకరణపై దృష్టి కొత్త తరం ఇంధనాలు హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తులపైనా దావోస్‌లో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిపెట్టారు. కర్బన రహిత పారిశ్రామికీకరణకు ఏపీ కేంద్రంగా నిలుస్తోందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కితాబిచ్చారు. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకుని పారిశ్రామిక ఉత్పత్తులు దిశగా మచిలీపట్నంలో ఒక ఎస్ఈజెడ్ను తీసుకురానుండడం దావోస్ ఫలితాల్లో ఒకటి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటు, అత్యాధునిక పద్ధతుల్లో ఉత్పత్తులు సాధించేందుకు వీలుగా ఈ జోన్‌ను అభివృద్ధి చేస్తారు. పారిశ్రామిక రంగానికి డబ్ల్యూఈఎఫ్ సహకారం కాలుష్యాన్ని తగ్గించడం.. పర్యావరణ సమతుల్యతకు, నాణ్యతకు పెద్దపీట వేయడం, గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడం, టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ప్రపంచస్థాయి ఉత్పత్తులు సాధించేలా పరిశ్రమలకు తోడుగా నిలవడానికి అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దావోస్‌లో అడుగులు వేసింది. దీనికి సంబంధించి డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్ తగిన సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రంలోకి కొత్తగా నాలుగు పోర్టులు వస్తున్న దృష్ట్యా పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణపైనా కూడా దావోస్ సభలో సీఎం దృష్టిపెట్టారు. దస్సాల్ట్ సిస్టమ్స్, మిట్సుయి ఓఎస్‌కే లైన్స్‌తోనూ జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి జగన్ ఇవే అంశాలపై దృష్టిపెట్టారు. సముద్ర మార్గం ద్వారా రవాణాను మూడు రెట్లు పెంచే ఉద్దేశ్యంతో ఇదివరకే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. దీనికి సంబంధించిన వివరాలను వీరి ముందు ఉంచింది. తాము త్వరలో కాకినాడలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు మిట్సుయి ఓఎస్‌కే లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈఓ తకీషి హషిమొటో ప్రకటించారు. సీఎం విజ్ఞప్తి మేరకు, లాజిస్టిక్ రంగాలపైనా దృష్టిపెడుతున్నామన్నారు. ప్రపంచంలోనే ఓడల ద్వారా అత్యధిక మొత్తంలో సరుకు రవాణా చేస్తున్న కంపెనీ ఇది. బైజూస్ పరిశోధన కేంద్రం ఏర్పాటు ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని.. పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని బైజూస్ ప్రకటించింది. పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామని సీఎంతో జరిగిన సమావేశంలో సంస్థ సీఈఓ రవీంద్రన్ వెల్లడించారు. సమగ్ర భూ సర్వే రికార్డులను నిక్షిప్తం చేయడంలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని కాయిన్‌స్విచ్ క్యూబర్ ప్రకటించింది. విశాఖకు ప్రత్యేక గుర్తింపు ఇక రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం, కార్యనిర్వాహక రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకున్న విశాఖపట్నానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ వేదికగా విశేష కృషిచేశారు. ► హైఎండ్ టెక్నాలజీకి వేదికగా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. ఈ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి హైఎండ్ టెక్నాలజీపై పాఠ్యప్రణాళిక రూపకల్పనలో భాగస్వామ్యానికి టెక్ మహీంద్ర అంగీకారం తెలిపింది. కంపెనీ కార్యకలాపాలను విస్తరించడంపైనా చర్చించారు. ► మేజర్ టెక్నాలజీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దాలని సీఎం సంకల్పంతో ఉన్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా ఆయన విశాఖను తీర్చిదిద్దాలనుకుంటున్నారని టెక్ మహీంద్ర సీఈఓ గుర్నాని ముఖ్యమంత్రితో భేటీ అనంతరం వెల్లడించారు. ► ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతోనూ ఇవే అంశాలను సీఎం జగన్ చర్చించారు. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఆవిష్కరణలకు, ఆ అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అంశాలపై వీరితో ప్రధానంగా చర్చలు జరిగాయి. ► అలాగే, యూనికార్న్ స్టార్టప్స్‌కూ వేదికగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడానికి సీఎం దావోస్ వేదికగా గట్టి ప్రయత్నాలు చేశారు. వివిధ యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్‌లో సీఎం భేటీ అయ్యారు. ► ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి తమవంతు చేయూతనిస్తామని, రవాణా రంగానికి తోడుగా నిలుస్తామని ఈజ్‌మై ట్రిప్ వెల్లడించింది. విశాఖ వేదికగా కార్యకలాపాలపైనా ప్రణాళికలను వారు సీఎంతో పంచుకున్నారు. -
దావోస్ పర్యటనలో ఐదో రోజు సీఎం జగన్ (ఫొటోలు)
-
షిండ్లర్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించిన సీఎం జగన్
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా దావోస్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిజీబిజీగా గడుపుతున్నారు. వివిధ కంపెనీల సీఈవోలు, ఫౌండర్లు, ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో నిర్విరామంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా విశాఖ, మచిలీపట్నాలకు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలిగారు. ముఖ్యంగా ఐటీ, విద్య, భూరికార్డుల సర్వే, డీకార్బనైజ్డ్ సెక్టార్లో ఇన్వెస్టర్లను ఆకర్షించ గలిగారు. కాగా 2022 మే 26న సీఎం జగన్ దావోస్‌లో ఉన్న షిండ్లర్ ట్రైనింగ్ సెంటర్‌ను పరిశీలించారు. ట్రైనింగ్ సెంటర్ అంతా కలియదిరుగుతూ అక్కడ శిక్షణ జరుగుతున్న తీరును షిండ్లర్ ప్రతినిధులు సీఎం జగన్‌కు వివరించారు. చదవండి: CM YS Jagan Davos Tour: ‘యూనికార్న్’ విశాఖ -
CM YS Jagan Davos Tour: ‘యూనికార్న్’ విశాఖ
సాక్షి, అమరావతి: నూతన ఆవిష్కరణలు, స్టార్టప్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖను యూనికార్న్ స్టార్టప్ (సుమారు రూ.7,700 కోట్ల విలువ చేరుకున్నవి) హబ్‌గా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు నాలుగో రోజు సమావేశాల సందర్భంగా యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, సీఈవోలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. షిండ్లర్ శిక్షణ కేంద్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి షిండ్లర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ ఖండ్పూర్ తదితరులు ఆన్లైన్ షాపింగ్ సంస్థ మీషో వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రేయ, ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ బైజూస్ వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) సుష్మిత్ సర్కార్, ఇండియాలో క్రిప్టో కరెన్సీ లాంటి సేవలు అందిస్తున్న కాయిన్‌స్విచ్ కుబేర్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో ఆశిష్ సింఘాల్, పర్యాటక బుకింగ్ పోర్టల్ ఈజ్‌మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌పిట్టి, వీహివ్.ఏఐ వ్యవస్థాపకుడు.. సతీష్ జయకుమార్, ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ కొర్సెరా వైస్ ప్రెసిడెంట్ కెవిన్ మిల్స్‌తో ముఖ్యమంత్రి జగన్ సమావేశమై రాష్ట్రంలో స్టార్టప్స్ కంపెనీల ఏర్పాటు, అభివృద్ధిపై చర్చించారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన స్విట్జర్లాండ్‌లోని ప్రవాసాంధ్రులు విశాఖకు స్వాగతం.. విశాఖపట్నం కేంద్రంగా స్టార్టప్స్ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, మీ అందరికీ నగరం ఆహ్వానం పలుకుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. వనరులు సమకూర్చడం, విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సీఎం వారితో చర్చించారు. బైజూస్ ఫౌండర్ అండ్ సీఈవో రవీంద్రన్తో సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంతో కలసి పనిచేస్తాం ఆంధ్రప్రదేశ్‌లో విద్యకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పి బైజూస్ పాఠ్యప్రణాళికను రాష్ట్ర విద్యార్థులకు అందిస్తామని బైజూస్ వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) సుష్మిత్ సర్కార్ వెల్లడించారు. రాష్ట్ర విద్యారంగానికి తోడ్పాటు అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వే, రికార్డులను భద్రపరచేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై కాయిన్‌స్విచ్ క్యూబర్ కంపెనీ వ్యవస్థాపకుడు, గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్ సింఘాల్‌తో సీఎం జగన్ చర్చించారు. సర్వే రికార్డులు నిక్షిప్తం చేయడంపై సహకారం అందిస్తామని సింఘాల్ తెలిపారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి చేయూత అందించి పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించేలా సహకారం అందిస్తామని ఈజ్‌మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టి సీఎంతో సమావేశం సందర్భంగా పేర్కొన్నారు. -
దావోస్ పర్యటనలో నాలుగో రోజు సీఎం జగన్ (ఫొటోలు)
-
దావోస్: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ప్రవాసాంధ్రులు
-
సీఎం జగన్‌ను కలిసిన స్విట్జర్లాండ్ ప్రవాసాంధ్రులు
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు హాజరై దావోస్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు స్విట్జర్లాండ్‌లోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు. ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని వారు కితాబునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, విద్యా, వైద్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం చక్కటి కృషి చేస్తోందంటూ తమ అభిప్రాయాలను సీఎం జగన్‌కి తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారంటూ వారు ఏపీ ప్రభుత్వాన్ని కొనియాడారు. చదవండి: CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు -
యూనికార్న్ స్టార్టప్స్ హబ్‌గా విశాఖ
దావోస్: యూనికార్న్ స్టార్టప్స్ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వివిధ స్టార్టప్స్‌కు చెందిన వ్యవస్థాపకులు, సీఓలు, వీటికి సంబంధించిన ముఖ్య అధికారులతో దావోస్‌లో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఏపీలో స్టార్టప్స్ కంపెనీల ఏర్పాటు, వాటి అభివృద్ధిపై చర్చించారు. విశాఖపట్నం కేంద్రంగా స్టార్టప్స్ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం జగన్ తెలిపారు. ఇక్కడ పెట్టుబడులకు మీ అందరికీ ఏపీ ఆహ్వానం పలుకుతోందని ఆయన వెల్లడించారు. విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై వారితో సీఎం చర్చించారు. స్టార్టప్‌లు అభివృద్ధిచెందడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. విద్యారంగం ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని బైజూస్ వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్‌పాలసీ సుష్మిత్ సర్కార్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యకు సంబంధించి పరిశోధక, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా బైజూస్ పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామన్నారు. భూ సర్వే ఏపీలో సమగ్ర భూసర్వే, రికార్డులు భద్రపరచడం.. ఈ అంశాలతో ముడిపడిన సాంకేతిక పరిజ్ఞానం తదితర విషయాలపై కాయిన్‌స్విచ్ క్యూబర్ కంపెనీ వ్యవస్థాపకుడు, గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్ సింఘాల్‌తో సీఎం జగన్ చర్చించారు. అనంతరం సింఘాల్ మాట్లాడుతూ.. సమగ్ర భూ సర్వే రికార్డులు నిక్షిప్తం చేయడంతో ఏపీ సర్కారుకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. టూరిజం ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టితో సీఎం సమావేశమయ్యారు. ఇందులో ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధి, తీసుకోవాల్సిన చర్యలపై వారి మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రశాంత్ పిట్టి మట్లాడుతూ.. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి అభివృద్ధికి తమవంతు చేయూత అందిస్తామన్నారు. అంతేకాదు ఏపీలోని పర్యాటక స్థలాలకు మరింత గుర్తింపు తీసుకువస్తామని వెల్లడించారు. మరింత మంది దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రేయ, వీహివ్.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్ జయకుమార్, కొర్సెరా వైస్ ప్రెసిడెంట్ కెవిన్ మిల్స్ ఉన్నారు. చదవండి: CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు -
మచిలీపట్నంలో ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే లక్ష కోట్లకు పైచిలుకు పెట్టుబడులు వచ్చాయి. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ స్వయంగా వివరిస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుపై ఏంఓయూ కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, కంపెనీ తరఫున అనిల్ చలమలశెట్టిలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుపై ఏంఓయూ. రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, కంపెనీ తరఫున అనిల్ చలమలశెట్టి సంతకాలు.#CMYSJaganInDavos #APatWEF22 pic.twitter.com/udMl4MhSQH — ITE&C Department Government of Andhra Pradesh (@apit_ec) May 25, 2022 చదవండి: CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు -
‘దావోస్’ ఒప్పందం చరిత్రాత్మకం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా భారీ పెట్టుబడులు పెట్టేలా అదానీ గ్రీన్ ఎనర్జీతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం చరిత్రాత్మకమని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో గతంలో ఎన్నడూ జరగని విధంగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకోవడం రాష్ట్ర విద్యుత్ రంగంలోనే కీలకమైన పరిణామమని అన్నారు. చదవండి: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు మంత్రి పెద్దిరెడ్డి ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చిందని, 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. తద్వారా రైతులకు శాశ్వతంగా నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను భవిష్యత్‌లో కూడా అందించేందుకు సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో బాటలు వేశారన్నారు. -
గ్రీన్ ఎనర్జీతో గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణ, ఉజ్వల భవిష్యత్తు కోసం కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తూ ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో 5,230 మెగావాట్లతో భారీ ఇంటిగ్రేడెట్ పంప్డ్ స్టోరేజ్ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టు పనులను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో దాదాపు 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తికి అవకాశాలున్నాయని, వీటిని వినియోగించుకోవాలని కోరారు. ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) సందర్భంగా దావోస్‌లో మూడో రోజు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాన్సిషన్ టు డీకార్బనైజ్డ్ ఎకానమీ సదస్సులో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్, ఆర్సిలర్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్, గ్రీన్కో గ్రూప్ ఎండీ, సీఈవో అనిల్ చలమలశెట్టి, దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కేపీఎంజీ గ్లోబల్ హెడ్ రిచర్డ్ సెషన్ మోడరేటర్‌గా వ్యవహరించారు. డీ కార్బనైజ్డ్ ఎకానమిలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని అమితాబ్‌కాంత్ ప్రశంసించగా రాష్ట్ర ప్రాజెక్టుల్లో భాగస్వామి కానున్నట్లు ఆర్సలర్ మిట్టల్ గ్రూపు ప్రకటించింది. డీ కార్బనైజ్డ్ ఆర్థిక వ్యవస్థ దిశగా ఇంధన, పారిశ్రామిక రంగాల పరివర్తన, జీరో కార్బన్ కోసం అనుసరించాల్సిన విధానాలు, గ్రీన్ ఎనర్జీలో భాగంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... సీకోయ్ క్యాపిటల్ ఎండీ రాజన్‌తో సీఎం జగన్ బ్యాటరీ తరహాలో పంప్డ్ స్టోరేజీ పర్యావరణ పరిరక్షణకు కర్బన రహిత యంత్రాంగం ఏర్పాటు చాలా కీలకం. ఈ ప్రయత్నానికి మనం మద్దతు ఇవ్వకుంటే భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా మారుతుంది. పర్యావరణ, సామాజికాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం మన బాధ్యత. కర్బన రహిత ఆర్థిక వ్యవస్థ విషయంలో ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలవనుంది. ఇక్కడకు (దావోస్) రావడానికి కొద్ది రోజుల క్రితమే కర్నూలు జిల్లాలో 5,230 మెగావాట్లతో ఇంటిగ్రేటెడ్ పంప్డ్ స్టోరేజ్ రెన్యువబుల్ ప్రాజెక్టు పనులను ప్రారంభించాం. పంప్డ్ స్టోరేజీ ఒక బ్యాటరీ తరహాలో పనిచేస్తుంది. దీనికి అనుసంధానంగా సౌరవిద్యుత్, పవన విద్యుత్ ప్రాజెక్టులు కూడా అక్కడ రానున్నాయి. జుబిలియంట్ గ్రూప్ చైర్మన్ కాళీదాస్తో సీఎం జగన్ నిరంతర విద్యుత్తు ఈ విధానంలో ఒక డ్యామ్ నిర్మిస్తాం. అందులో కేవలం 1 టీఎంసీ నీటిని వినియోగిస్తాం. దీన్ని ఉపయోగించి విద్యుత్ వినియోగం అత్యధికంగా ఉన్నప్పుడు (పీక్ అవర్స్‌లో) నీటిని వదిలి విద్యుదుత్పత్తి చేస్తాం. వినియోగం తక్కువగా ఉన్నప్పుడు (నాన్ పీక్ అవర్స్‌లో) మళ్లీ నీటిని రిజర్వాయర్‌లోకి వెనక్కి లిఫ్ట్ చేస్తాం. అప్పుడు పవన, సౌర విద్యుత్ వాడుకుంటాం. దీనివల్ల 24 గంటలపాటు పగలు, రాత్రి కూడా పవర్ అందుబాటులోకి వస్తుంది. చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది స్ధిరమైనది, ఆర్థికంగా బలమైనది. వినియోగం తక్కువగా ఉన్న సమయంలో (నాన్ పీక్ అవర్స్‌లో) పవన, సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఈ కరెంట్‌ను ఉపయోగించుకుని నీటిని మళ్లీ రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేస్తాం. ఇది చాలా సులువైన మెకానిజమ్. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలతో ఏస్ అర్బన్ డెవలపర్స్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు గ్రీన్ పరిశ్రమలు.. డీశాలినైజేషన్ 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి చేయగల సామర్ధ్యం ఏపీకి ఉంది. ఏపీలో అవకాశాలను విస్తృతంగా వినియోగించుకోవచ్చు. సంప్రదాయ పరిశ్రమల నుంచి సంప్రదాయేతర పరిశ్రమలకు కూడా మార్పు చెందవచ్చు. సంప్రదాయ పరిశ్రమ నుంచి గ్రీన్ పరిశ్రమగా మారడంతో పాటు ఈ పవర్‌ను ఉపయోగించుకుని హైడ్రోజన్,అమ్మోనియా కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఎలక్ట్రాలసిస్ పద్ధతిలో నీటి డీశాలినైజేషన్ (నిర్లవణీకరణ) ప్రక్రియ కూడా చేయవచ్చు. వీటన్నింటికీ ఏపీ మీకు స్వాగతం పలుకుతోంది. పర్యావరణ పరిరక్షణపై సానుకూల దృక్పథంతో ముందుకొస్తే స్వాగతం పలుకుతాం. ష్నైడర్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్రెమంట్తో సీఎం జగన్ ప్రపంచానికి ఆదర్శంగా ఏపీ ప్రపంచంలో కర్బన కాలుష్యానికి భారత్ కారణం కాదు. గ్రీన్ ఎనర్జీ దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చూపిన చొరవ యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలవనుంది. రాష్ట్రంలో ఒకేచోట సౌర, పవన, జల విద్యుత్ ప్లాంట్ ద్వారా చౌకగా కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి చేపట్టనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఏకీకృత పునరుత్పాదక ఇంధన పవర్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటవుతోంది. ఏపీలో 23 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయగలిగితే భారత్‌లో ముఖ్యమైన కర్బన రహిత కేంద్రంగా నిలుస్తుంది. తద్వారా కర్బన రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా పరివర్తనలో యావత్ ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుంది. నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో సీఎం జగన్ ఇప్పుడు ప్రపంచం ముందున్న సవాల్ హరిత ఉదజని. ఫెర్టిలైజర్లు, స్టీల్, రిఫైనరీ, షిప్పింగ్ రంగాలు కూడా గ్రీన్ హైడ్రోజన్ వినియోగం దిశగా మారాల్సి ఉంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ సీఎం చూపిన చొరవ ఆదర్శంగా నిలవనుంది. భారత్‌లో కర్బన ఉద్గార కారకాల తలసరి వినియోగం చాలా తక్కువ. అయితే కర్బన రహిత పారిశ్రామికీకరణ ప్రక్రియలో ప్రపంచంలోనే భారత్ తొలి దేశంగా నిలవాల్సి ఉంది. ఇది ఒక సవాల్ కాదు. అందివచ్చిన అవకాశంగా చూడాలి. – అమితాబ్‌కాంత్, నీతి ఆయోగ్ సీఈవో ఏపీ.. ఎంతో అనుకూలం ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి పెట్టాం. గ్లోబల్ రెన్యువబుల్ ప్రాజెక్టు కోసం గ్రీన్కో కంపెనీతో కలసి పని చేస్తున్నాం. ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ 27 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ రెన్యువబుల్ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. అందుకు ఎన్నో కారణాలున్నాయి. అక్కడి ప్రభుత్వ విధానాలు పెట్టుబడికి ఎంతో సానుకూలంగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతున్న ప్లాంట్‌ను నేను స్వయంగా సందర్శించా. అక్కడ జరుగుతున్న పనులు, ఒకేచోట మూడు రకాల విద్యుత్ ఉత్పత్తి కానుండడం, తక్కువ నీటి వినియోగం నిజంగా ఎంతో ఆకట్టుకున్నాయి. అక్కడ 650 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5,000 కోట్లకు పైగా) పెట్టుబడి సమకూర్చాం. రోజంతా 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుండడం అద్భుతం. భవిష్యత్తులో పెట్టుబడిని రెట్టింపు చేయనున్నాం. పునరుత్పాదకాలు, హరిత ఉదజని కోసం మా వంతుగా పూర్తి చొరవ చూపుతాం. అన్ని రకాలుగా అనుకూల విధానాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇక ముందు కూడా కలిసి పని చేస్తాం. – ఆదిత్య మిట్టల్, ఆర్సిలర్ మిట్టల్ సీఈవో -
CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు
సాక్షి, అమరావతి: కర్బన ఉద్గారాలు లేని విద్యుదుత్పత్తి (గ్రీన్ ఎనర్జీ) లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థికసదస్సు (డబ్ల్యూఈఎఫ్) వేదికగా గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి. ఆ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు, ఆయా సంస్థల అధిపతులు సంతకాలు చేశారు. రూ.65 వేల కోట్ల పెట్టుబడితో 14 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ విద్యుదుత్పత్తి చేసి 18 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం తాజా ఒప్పందాలను కుదుర్చుకుంది. మచిలీపట్నంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా ఎస్ఈజెడ్ ఏర్పాటుపై కూడా ఒప్పందం కుదిరింది. ఇప్పటికే రూ.60 వేల కోట్ల పెట్టుబడితో 13,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం అదానీ సంస్థతో ప్రభుత్వం సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 వేలమందికిపైగా ఉద్యోగాలు రానున్నాయి. దీంతో ఒక్క గ్రీన్ ఎనర్జీ విభాగంలోనే దావోస్ వేదికగా రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేలా అవగాహన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకున్నట్లైంది. గ్రీన్ కో గ్రీన్‌సిగ్నల్.. కర్బన రహిత విద్యుదుత్పత్తికి గ్రీన్కో – ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. 8 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం ఒప్పందం జరిగింది. ఇందులో వెయ్యి మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జలవిద్యుత్ ప్రాజెక్టు, 5 వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, 2 వేల మెగావాట్ల విండ్(పవన విద్యుత్) ప్రాజెక్టు ఉన్నాయి. దీని కోసం రూ.37 వేల కోట్ల పెట్టుబడిని ఆ సంస్థ పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. 6 వేల మెగావాట్లతో అరబిందో రాష్ట్రంలో 6 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వంతో అరబిందో రియాల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 2 వేల మెగావాట్ల పంప్డ్ హైడ్రో ప్రాజెక్టు, మరో 4వేల మెగావాట్ల సోలార్, విండ్ ప్రాజెక్టులు ఉంటాయి. ప్రస్తుతం కాకినాడ ఎస్ఈజెడ్లో సదుపాయాలను వినియోగించుకుని ఈ ప్రాజెక్టులను అరబిందో రియాల్టీ చేపట్టనుంది. ప్రాజెక్టు కోసం దాదాపు రూ.28 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. బందరులో ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్.. మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదర్చుకుంది. గ్రీన్ ఎనర్జీతో సహాయంతో ఈ జోన్లో పారిశ్రామిక ఉత్పత్తి చేపట్టనుంది. ఈ జోన్లో ప్రపంచస్థాయి కంపెనీలకు అవసరమైన వసతులు కల్పిస్తారు. బహ్రెయిన్‌కు ఏపీ ఎగుమతులు దావోస్‌లో మూడో రోజు మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బహ్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్ అల్ ఖలీపాతోపాటు పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, గ్రీన్ ఎనర్జీ, హై ఎండ్ టెక్నాలజీ విభాగాల్లో అవకాశాలను ప్రధానంగా తెలియచేశారు. రాష్ట్రం నుంచి బహ్రెయిన్‌కు విరివిగా ఎగుమతులపై చర్చించారు. విద్యారంగంలో పెట్టబడులపై సల్మాన్ అల్ ఖలీపాతో చర్చలు జరిపారు. అనంతరం సెకోయ క్యాపిటల్ ఎండీ రంజన్ ఆనందన్‌తో సీఎం జగన్ సమావేశమై స్టార్టప్ ఎకో సిస్టం అభివృద్ధిపై చర్చించారు. సెకోయా క్యాపిటల్ ఏపీలో కార్యకలాపాల ప్రారంభం అంశంపైనా చర్చించారు. అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా ఏపీ ► డబ్ల్యూఈఎఫ్ వేదికగా ష్నైడర్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్ రెమంట్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. దేశీయ, అంతర్జాతీయ అవసరాలను తీర్చే విధంగా ఉత్పత్తి కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దడంపై చర్చించారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్రంలో భారీగా రానుండటంతో ఆ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ► వ్యవసాయం, ఆహారం, ఫార్మా రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జుబిలియంట్ గ్రూపు సంస్థల వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కాళీదాస్ హరి భర్తియాతో ఏపీ పెవిలియన్‌లో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెసింగ్‌పై విస్తృతంగా చర్చించారు. విశాఖలో ఐఐఎం క్యాంపస్ నిర్మాణం వచ్చే ఆగస్టు నాటికి పూర్తి కానుందని, దీనికి సీఎం జగన్‌ను ఆహ్వానించనున్నట్లు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కాళీదాస్ హరి భర్తియా తెలిపారు. ► ప్రఖ్యాత స్టీల్ దిగ్గజ కంపెనీ ఆర్సెల్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్‌తో ఏపీ పెవిలియన్‌లో సీఎం వైఎస్ జగన్ సమావేశమై గ్రీన్ ఎనర్జీ విద్యుదుత్పత్తిపై విస్తృతంగా చర్చించారు. గ్రీన్కో భాగస్వామ్యంతో ఏపీలోకి అడుగుపెడుతున్నామని ఆదిత్య మిట్టల్ ప్రకటించారు. ప్రపంచంలోనే తొలి హైడ్రో పంప్డ్ ప్రాజెక్టులో భాగస్వామి అవుతున్నట్లు వెల్లడించారు. తమ కంపెనీ తరఫున 600 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పారు. ► గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై ఐఎసీఎల్, ఎల్ అండ్ టీలతో జాయింట్ వెంచర్ రెన్యూ పవర్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏపీ పెవిలియన్‌లో సీఎం జగన్‌తో రెన్యూ పవర్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సుమంత్ సిన్హా సమావేశమయ్యారు. రాష్ట్రంలో హైడ్రోజన్ తయారీ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం ఐబీఎం ఛైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణతో సీఎం జగన్ సమావేశమై టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధిపై చర్చించారు. విశాఖను హై ఎండ్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం జగన్ వివరించారు. -
దావోస్ పర్యటనలో మూడోరోజు సీఎం జగన్ (ఫొటోలు)
-
డీకార్బనైజ్డ్ మెకానిజంలో ఏపీ కొత్త ట్రెండ్ సెట్ చేసింది: సీఎం జగన్
డీకార్బనైజ్డ్ మెకానిజంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగిన సదస్సులో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇటీవల కర్నూలులో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ పంప్డ్ స్టోరేజ్ రెన్యువబుల్ ప్రాజెక్ట్ గురించిన వివరాలను సీఎం జగన్ తెలియజేశారు. ఏపీలో ఏర్పాటు చేసిన కర్బన రహిత పవర్ ప్రాజెక్టు ద్వారా విండ్, హైడల్, సోలార్ విద్యుత్‌ను నిరంతరాయంగా ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. ఈ విధానంలో తక్కువ ఖర్చుతో ఎటువంటి కాలుష్యం లేకుండా సుస్థిరమైన విద్యుత్‌ను సాధించవచ్చన్నారు. అంతేకాకుండా హైడ్రోజన్, అమ్మోనియంలను కూడా పొందవచ్చని సీఎం వెల్లడించారు. షోకేస్‌గా కర్నూలు ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దదైన కర్బన రహిత పవర్ ప్రాజెక్టు పనులు ఇటీవలే కర్నూలులో మొదలయ్యాయని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. మరి కొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి విషయంలో ఏపీ కొత్త ట్రెండ్‌ను నెలకొల్పిందన్నారు. అంతేకాదు గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్‌కు సంబంధించి షోకేస్‌గా కర్నూలు ప్రాజెక్టు నిలుస్తుందన్నారు. కేవలం పంప్డ్ స్టోరేజీ ద్వారానే 1650 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం సాధారణ విషయం కాదన్నారు. ఏపీ ఆహ్వానిస్తోంది కర్నూలులో నిర్మిస్తోన్న విండ్, హైడల్, సోలార్ పవర్ ప్రాజెక్టులో అనుసరిస్తున్న టెక్నాలజీతో 33,000 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఏపీలో ఉందన్నారు. ఈ మహాత్తర కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ఏపీ తరఫున పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. పర్యావరణం పట్ల ప్రేమ ఉన్నవారు, బిగ్ థింకింగ్ ఉన్న వారికి ఏపీలో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం జగన్ మరోసారి తెలిపారు. ఏపీ ఆదర్శం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతి అయోగ్ చైర్మన్ అమితాబ్‌కాంత్ మాట్లాడుతూ... కర్బణ రహిత పవర్ ఉత్పత్తికి ఇండియాలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాటిని ఏపీ ఒడిసిపట్టుకుందని ఆయన అన్నారు. కర్నూలు ప్రాజెక్టులో పంప్డ్ స్టోరేజీ ద్వారానే 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం గొప్ప విషయం అన్నారు. ఈ రోజు ఏపీ అమలు చేస్తున్న టెక్నాలజీ రేపు ప్రపంచం అంతా అనుసరించక తప్పదన్నారు. ఏపీ అమలు చేస్తోన్న కర్బన రహిత పారిశ్రామిక విధానంపై ప్రశంసలు కురిపించారు. గ్రీన్ ఎనర్జీ కోసం ఏపీ సీఎం అమలు చేస్తున్న పాలసీ బాగుందని ఆయన అన్నారు. ఏపీ అనుసరిస్తున్న విధానాన్నే ఇతర దేశాలు కూడా కొనసాగించాలని సూచించారు. ఏపీలో పెట్టుబడులు 27 దేశాలను పరిశీలించిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్టు ఆర్సెల్లార్ తరఫున ఆదిత్య మిట్టల్ తెలిపారు. రాబోయే రోజుల్లో తమ పెట్టుబడులు రెట్టింపు చేస్తామన్నారు. స్టీల్ ఉత్పత్తి సెక్టార్ నుంచి 8 శాతం కార్బన్ విడుదల అవుతోంది. కానీ ఏపీలో ఉత్పత్తి చేయబోతున్న హైడ్రోజన్‌ను స్టీలు పరిశ్రమలో ఉపయోగించడం ద్వారా స్టీల్ సెక్టార్లో కర్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తామన్నారు. త్వరలో ఏపీలో తొలి పునరుత్పాదక పవర్ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. విదేశాలకు ఎగుమతి కర్నూలు ప్రాజెక్టు ద్వారా విద్యుత్‌తో పాటు భారీ ఎత్తున అమ్మోనియం ఉత్పత్తి అవుతుందన్నారు గ్రీన్కో సీఈవో అనిల్ చలమల శెట్టి. దేశీ అవసరాలకు పోను మిగిలిన అమ్మోనియాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. కర్బన రహిత పవర్ ఉత్పత్తి సమర్థంగా చేయాలంటే డిజిటలేజేషన్ తప్పనిసరి. అందుకోసం ప్రపంచ స్థాయి టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు దస్సాల్ట్ సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నీతి అయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్, ఆదిత్యమిట్టల్, గ్రీన్కో సీఈవో అనిల్ చలమల శెట్టి, డస్సెల్ట్ సిస్టమ్స్ ఈవీవీ ఫ్లోరెన్స్‌లు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Integrated Renewable Energy Project: ప్రపంచంలోనే మొదటి ప్రాజెక్టు.. శంకుస్థాపనకు సీఎం జగన్ -
బహ్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్ అల్ ఖలీఫాతో సీఎం జగన్ భేటీ
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు మూడో రోజు కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ సెంటర్లో బహ్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్ అల్ ఖలీఫాతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై ఇరువురు చర్చించుకున్నారు. చదవండి: దావోస్‌లో ఏపీ ధగధగ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నా సోదరుడితో గొప్ప సమావేశం జరిగింది: సీఎం జగన్‌తో కేటీఆర్
హైదరాబాద్: విదేశీ గడ్డపై అరుదైన కలయిక జరిగింది. దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌గారితో గొప్ప సమావేశం జరిగింది అంటూ మంత్రి కేటీఆర్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. వీళ్లిద్దరూ ఎంతసేపు భేటీ అయ్యారు, ఏయే అంశాలపై చర్చించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్ వరుసగా సమావేశం అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఇంకోవైపు మంత్రి కేటీఆర్ కూడా తెలంగాణ పెట్టుబడుల ఆహ్వాన విషయంలో దూసుకుపోతున్నారు. Had a great meeting with my brother AP CM @ysjagan Garu pic.twitter.com/I32iSJj05k — KTR (@KTRTRS) May 23, 2022 -
ప్రతి ఒక్కరికీ అందుబాటులో.. సమగ్ర ఆరోగ్యవ్యవస్థ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరికీ సమగ్ర ఆరోగ్య వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కోవిడ్ లాంటి విపత్తులు మరోసారి వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా బలమైన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలో 2 వేల జనాభా దాటిన ప్రతి గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున ఇప్పుడున్న 11 కాలేజీలకు అదనంగా మరో 16 వైద్య కళాశాలలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. వచ్చే మూడేళ్లలో వైద్య ఆరోగ్య రంగంపై రూ.16,000 కోట్లు వ్యయం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండో రోజు సమావేశాల సందర్భంగా సోమవారం ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్‌పై సీఎం జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. సీఎం జగన్‌తో స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి సంజయ్ భట్టాచార్య తదితరులు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్.. కోవిడ్ లాంటి విపత్తును ఎవరూ ఊహించలేదు. మన తరం మునుపెన్నడూ చూడని విపత్తు ఇది. వైద్య రంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కోవిడ్ లాంటి విపత్తు మరోసారి తలెత్తితే సమర్థంగా నివారించేందుకు బలీయమైన వ్యవస్థ కావాలి. కోవిడ్ విపత్తు నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. నివారణ, నియంత్రణ చికిత్స విధానాల ప్రాముఖ్యత తెలుసుకోవాలి. సమగ్ర ఆరోగ్య వ్యవస్ధ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి. కోవిడ్, తదనంతర పరిణామాలన్నీ మనకు కనువిప్పు లాంటివి. ఒక దేశం, ఒక రాష్ట్రం పరిధిలో ఎంతవరకు చేయగలమో అంతా చేశాం. కోవిడ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌పై దృష్టి పెట్టింది. మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ అత్యాధునిక ఆస్పత్రులు లేకున్నా.. అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ వైద్య సేవల విషయంలో రాష్ట్రం వెనుకబడి ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడమే దీనికి ప్రధాన కారణం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి టైర్–1 నగరాలు ఏపీలో లేనందున ప్రైవేట్ రంగంలో అత్యాధునిక వైద్య సేవల లభ్యత తక్కువగా ఉంది. కోవిడ్ సమయంలో ప్రధానమైన ఈ లోపాన్ని ముందే గుర్తించి అప్రమత్తమయ్యాం. కోవిడ్ నియంత్రణలో భాగంగా 44 దఫాలు ఇంటింటి సర్వే నిర్వహించాం. రాష్ట్రంలో ఇందుకోసం బలమైన వ్యవస్థ ఉంది. ప్రతి గ్రామంలోనూ సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌తో పాటు 42 వేల మంది ఆశావర్కర్లు వైద్య, ఆరోగ్య రంగంలో చురుగ్గా పనిచేస్తున్నారు. వీరందరూ సమష్టిగా ఇంటింటి సర్వే చేపట్టడంతో తగిన చర్యలు తీసుకుంటూ కోవిడ్‌ను సమర్ధంగా ఎదుర్కోగలిగాం. ఫలితంగా మరణాల రేటును తగ్గించగలిగాం. భారత్‌లో నమోదైన సగటు మరణాల శాతం 1.21 కాగా ఏపీలో దేశంలోనే అత్యల్పంగా 0.63% నమోదైంది. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో సమావేశమైన సీఎం వైఎస్ జగన్ కొత్తగా 16 మెడికల్ కాలేజీలు ఇక నియంత్రణ చర్యల విషయానికొస్తే జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, బోధనాసుపత్రులు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. పార్లమెంట్ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపడుతున్నాం. అన్ని ప్రాంతాలకు బోధనాసుపత్రుల సేవలను సమానంగా అందించాలన్నదే లక్ష్యం. మెడికల్ కాలేజీలు ఏర్పాటైనప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు. అప్పుడే ఆ మెడికల్ కాలేజీలను అనుసంధానం చేయడం సాధ్యమవుతుంది. అప్పుడే మేం ఎదురుచూస్తున్న అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వస్తుంది. దీనికి మూడేళ్ల కాలపరిమితి విధించుకున్నాం. మొత్తం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మూడేళ్లలో రూ.16 వేల కోట్లు సమీకరణ చేయాలని నిర్దేశించుకున్నాం. 25 లక్షల మందికి ఉచిత వైద్యం హెల్త్ ఇన్సూరెన్స్ రంగానికి వస్తే ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ పథకం ప్రవేశపెట్టారు. దాదాపు వెయ్యి చికిత్సా విధానాలు ఇందులో కవర్ అవుతున్నాయి. ఏపీలో ప్రత్యేకంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి 2,446 చికిత్స విధానాలకు వర్తింప చేస్తున్నాం. 1.44 కోట్ల ఇళ్లకి ఆరోగ్యశ్రీ కార్డులు అందచేసి లబ్ధిదారుల ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాం. రాష్ట్రంలో దాదాపు 1.53 కోట్ల కుటుంబాలు ఉండగా 1.44 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చాం. గత మూడేళ్లుగా 25 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందచేశాం. స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ కోవిడ్ లాంటి మహమ్మారులు చెలరేగినప్పుడు ప్రధానంగా నివారణ, నియంత్రణ, చికిత్సపై దృష్టి పెట్టాలి. వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలంటే అవైలబులిటీ, యాక్సెస్‌బులిటీ, ఎఫర్ట్‌బులిటీ.. ఈ మూడూ సమాంతరంగా అందుబాటులోకి రావాలి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో 2 వేల జనాభా ఉన్న ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి 30 వేల జనాభా ఉన్న మండలాన్ని యూనిట్‌గా తీసుకుని రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్లు నెలకొల్పుతున్నాం. తద్వారా ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు చొప్పున నలుగురు వైద్యులు ఉంటారు. ప్రతి వైద్యుడికి 104 వాహనాన్ని కేటాయిస్తారు. ఒక్కో వైద్యుడికి మండలంలో 4–5 గ్రామాలను కేటాయిస్తారు. వారు రోజు విడిచి రోజు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. ఫ్యామిలీ డాక్టర్లుగా గ్రామాల్లో ప్రజలను పేరుపేరునా పలకరిస్తూ సేవలు అందించడంతో పాటు విలేజ్ క్లినిక్‌ను మెడికల్ హబ్‌గా వినియోగించుకుంటారు. ఇందులో ఏఎన్‌యమ్, నర్సింగ్ గ్రాడ్యుయేట్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీస్నర్, ఆశా వర్కర్లు ఉంటారు. దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్‌తో ముఖ్యమంత్రి -
దావోస్‌లో ఏపీ ధగధగ
సాక్షి, అమరావతి: దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా రెండో రోజైన సోమవారం పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. విద్యారంగంలో ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ దస్సాల్ట్ సిస్టమ్స్ ప్రకటించింది. విశాఖను హైఎండ్ టెక్నాలజీ హబ్‌గా మార్చేలా సహకారం అందించేందుకు టెక్ మహీంద్రా ముందుకొచ్చింది. జపాన్‌కు చెందిన ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ మిట్సుయి కాకినాడలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సంసిద్ధత తెలిపింది. స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హై ఎండ్ టెక్నాలజీ హబ్‌గా విశాఖ విశాఖను హైఎండ్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలో భాగస్వామి కానున్నట్లు టెక్ మహీంద్రా ప్రకటించింది. దావోస్‌లోని ఏపీ పెవిలియన్‌లో టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమై నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు లాంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ యూనివర్సిటీతోపాటు 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, 175 స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరిస్తూ వీటిని ఐటీ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించాలని కోరారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేలా ఇంటర్న్‌షిప్, అప్రెంటిషిప్ కార్యకలాపాల్లో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గుర్నానీ స్పందిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీ లాంటి అత్యాధునిక పరిజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్‌తో కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. యువత నైపుణ్యాలకు పదును పెట్టేందుకు హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్సిటీతో కలసి ప్రత్యేకంగా పాఠ్యప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్‌తో ముఖ్యమంత్రి రూ.250 కోట్లతో అసాగో ఇథనాల్ ప్లాంట్ మహీంద్రా గ్రూపు అనుబంధ కంపెనీ అసాగో ఇండస్ట్రీస్ రాష్ట్రంలో రూ.250 కోట్లతో ఇథనాల్ తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనను సీఎం దృష్టికి తెచ్చింది. ఇథనాల్ యూనిట్ ఏర్పాటుకు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. విద్యారంగంలో ‘దస్సాల్’ పెట్టుబడులు విద్య, నైపుణ్యాభివృద్ధి లాంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ దస్సాల్ట్ సిస్టమ్స్ ప్రకటించింది. దావోస్‌లో దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు పోర్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సహకారం అందించాలని సీఎం కోరారు. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో సమావేశమైన సీఎం వైఎస్ జగన్ ఏపీలో నైపుణ్యాభివృద్ధి అవకాశాలను మెరుగుపరచడంపై ప్రధానంగా చర్చించినట్లు అనంతరం ఫ్లోరెన్స్ వెర్జలెన్ తెలిపారు. ఏపీతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని, విద్యారంగంలో పెట్టుబడులు పెట్టడానికి దస్సాల్ సిస్టమ్స్ ఆసక్తిగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త తరహా ఇంధనాలపై కూడా చర్చించామని, త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ఫ్లోరెన్స్ తెలిపారు. కాకినాడకు జపాన్ లాజిస్టిక్ దిగ్గజం సుదీర్ఘ తీర ప్రాంతం కలిగి ఉండటంతో పాటు ఏపీలో కొత్తగా నిర్మించే నాలుగు పోర్టుల ద్వారా లభించే లాజిస్టిక్ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై జపాన్‌కు చెందిన లాజిస్టిక్ కంపెనీ మిట్సుయి ఓ ఎస్కే లైన్స్ ఆసక్తి వ్యక్తం చేసింది. మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులతో సరుకు రవాణాను ఏటా 507 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దీనికి సంబంధించి కంటైనర్ హబ్, లాజిస్టిక్ రంగాలపై దృష్టి సారించాలని సీఎం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హషిమొటో కాకినాడలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ ఈవీ వాహనాలపై ‘హీరో’తో చర్చలు రాష్ట్రంలో వ్యాపార విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ అంశాలపై హీరో గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్‌తో సీఎం జగన్ చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన హీరో గ్రూపు అథెర్ ఎనర్జీలో ఇప్పటికే 36 శాతం వాటాను కొనుగోలు చేయడమే కాకుండా తైవాన్‌కు చెందిన బ్యాటరీ టెక్నాలజీ గగొరోలో భాగస్వామిగా చేరింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, హీరో గ్రూప్ విస్తరణ అవకాశాలపై చర్చలు జరిగాయి. సీఎం జగన్‌తో స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి సంజయ్ భట్టాచార్య తదితరులు విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్లో భాగంగా పరిశ్రమలకు నీటి వనరులను సమకూర్చడంలో భాగంగా తిరుపతి సమీపంలో ఉన్న హీరో కంపెనీకి కండలేరు నుంచి నీటిని ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. అంతకుముందు భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్‌తో కూడిన స్విస్ పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో సీఎం జగన్ సమావేశమై ఏపీలో వ్యాపార అవకాశాలపై చర్చించారు. భారత రాయబారి సంజయ్ భట్టాచార్య కూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. -
CM YS Jagan Davos Tour: ఇంధన రంగంలో 60 వేల కోట్ల పెట్టుబడి
దావోస్: సుస్థిర అభివృద్ధిలో భాగంగా కర్బన ఉద్గారాలు లేని ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కాలుష్య రహిత ఇంధనం ఉత్పత్తే లక్ష్యంగా రాష్ట్రంలో రెండు మెగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ రెండు ప్రాజెక్టులను అదానీ గ్రీన్ ఎనర్జీ నెలకొల్పనుంది. ఇందులో 3,700 మెగావాట్లు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు కాగా 10 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కూడా ఉంది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఇవి అత్యంత కీలకం కానున్నాయి. రెండు ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎంవోయూలో పేర్కొన్నారు. తద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రెండో రోజు విస్తృతంగా చర్చ దావోస్‌లో తొలిరోజు గౌతమ్ అదానీతో సమావేశమైన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోరోజు సోమవారం మరోసారి భేటీ నిర్వహించి ఈ ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం జగన్, అదానీ గ్రూపు సంస్థల అధిపతి గౌతమ్ అదానీల సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, అదానీ గ్రీన్ ఎనర్జీ తరఫున ఆశిష్ రాజ్‌వంశీ ఎంవోయూపై సంతకాలు చేశారు. -
దావోస్ పర్యటనలో రెండోరోజు సీఎం జగన్ (ఫొటోలు)
-
జపాన్ షిప్పింగ్ కంపెనీ సీఈవోతో సీఎం జగన్ భేటీ
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌లో జపాన్‌కి చెందిన ప్రముఖ ట్రాన్స్పోర్ట్ సంస్థ మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈఓ తకీషి హషిమొటోతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ షిప్పింగ్ కంపెనీల్లో ఒకటిగా మిట్సుయి ఉంది. ఏపీలో అభివృద్ధి చేస్తున్న పోర్టులు ఇక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. స్విస్ పార్లమెంటు బృందం మరోవైపు స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్ బృందం వరల్డ్ ఎకామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా దావోస్‌కు చేరుకున్న సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో వ్యాపార అవకాశాలపై ముఖ్యమంత్రితో స్విస్ పార్లమెంటు బృందం చర్చలు జరిపింది. చదవండి: టెక్నాలజీ హబ్‌గా విశాఖపట్నం.. టెక్ మహీంద్రా సీఈవోతో సీఎం జగన్ చర్చలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టెక్నాలజీ హబ్‌గా విశాఖపట్నం.. టెక్ మహీంద్రా సీఈవోతో సీఎం జగన్ చర్చలు
దావోస్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు రెండో రోజు ఏపీ సీఎం జగన్ పలువురు ప్రముఖులతో వరుసగా సమావేశం అవుతున్నారు. రెండో రోజు ఉదయం సెషన్లో ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్‌పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఆ తర్వాత దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీలతో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల పెంపు అంశాలపై ప్రధానంగా చర్చించారు. విద్యారంగంలో పెట్టుబడులు దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఫ్లోరెన్స్ వెర్జలెన్ మాట్లాడుతూ... ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నైపుణ్యాలను ఎలా అభివృద్ధిచేయాలన్నదానిపై చర్చ జరిగినట్టు తెలిపారు. అదే విధంగా కొత్త తరహా ఇంధనాలపైనా కూడా సమావేశంలో చర్చించామన్నారు. విద్యారంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దస్సాల్ట్ ఉత్సాహంగా ఉందని ఆమె తెలిపారు. విశాఖ కేంద్రంగా ఐటీ దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌కి వచ్చిన టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీతో సీఎం సమావేశం అయ్యారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇక్కడి మానవ వనరుల లభ్యత తదితర అంశాలపై వారు చర్చలు జరిపారు. సమావేశం ముగిసిన తర్వాత సీపీ గుర్నానీ మాట్లాడుతూ.. విశాఖపట్నాన్ని మేజర్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. ఇక్కడ నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని టెక్ మహీంద్రాను సీఎం కోరారని తెలిపారు. దీనికి గాను ఆంధ్రా వర్శిటీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు టెక్ మహీంద్రా చైర్మన్ వెల్లడించారు. మానవ నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో ఆంధ్ర యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తామన్నారు అదే విధంగా ఆర్టిఫియల్ ఇంలెటిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా విశాఖపట్నాన్ని తీర్చిద్దాలనే సంకల్పంతో సీఎం జగన్ ఉన్నట్టు గుర్నానీ వెల్లడించారు. మరింత మంది ప్రముఖులతో దావోస్‌లో జరుగుతున్న సమావేశాల ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సదస్సు రెండో రోజు సీఎం పలువురు ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జపాన్‌కు చెందిన ప్రముఖ రవాణా సంస్థ మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ సీఈఓ తకేషి హషిమొటోతో సీఎం జగన్ భేటీ కానున్నారు. అదే విధంగా హీరోమోటార్ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ పవన్ ముంజల్‌తోనూ జగన్ సమావేశం కానున్నారు. చివరగా ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతోనూ సీఎం జగన్ చర్చలు జరపనున్నారు. ఇంకా మరింత మంది ప్రముఖులనూ ఆయన కలిసే అవకాశం ఉంది. చదవండి: ఏపీలో ప్రతీ కుటుంబానికి ‘ఫ్యామిలీ డాక్టర్’ - డబ్ల్యూఈఎఫ్ సదస్సులో వైఎస్ జగన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీలో ప్రతీ కుటుంబానికి ‘ఫ్యామిలీ డాక్టర్’ - డబ్ల్యూఈఎఫ్ సదస్సులో వైఎస్ జగన్
CM YS Jagan Davos Tour: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు (సోమవారం) ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ అంశంపై మాట్లాడారు. డబ్ల్యూఈఎఫ్ పబ్లిక్ సెషన్లో పాల్గొన్న ఆయన ఏపీలో కోవిడ్ నియంత్రణకు తీసుకున్న చర్యలతో పాటు రాష్ట్రంలో వైద్య వ్యవస్థలు ఎలా బలోపేతం చేస్తున్నది వివరించారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం తీరు తెన్నులను వెల్లడించారు. కోవిడ్ నియంత్రణ ఏపీలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కోవిడ్ నియంత్రణ కార్యాచరణ అమలు చేశాం. 44 ఇళ్లు ఒక యూనిట్‌గా ఇంటింటికి సర్వే చేపట్టాం. ఇందు కోసం ప్రతీ 50 ఇళ్లకు ఒక వలంటీర్ వంతున పని చేశారు. 42 వేల మంది ఆశావర్కర్లు ఇందులో పాలు పంచుకున్నారు. ఇంటింటికి వెళ్లి కోవిడ్ లక్షణాలు కనిపించిన వారిని గుర్తించాం. ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాం. మెడిసిన్స్ అందించాం. రోగులు అవసరమైన పౌష్టిక ఆహారం అందిస్తూ పకడ్బందీ ప్రణాళిక అమలు చేశాం. అందువల్లే కరోనా మరణాల రేటు ఏపీలో జాతీయ స్థాయి కన్నా చాలా తక్కువగా దేశంలోనే అత్యల్పంగా 0.6 శాతంగా నమోదు అయ్యింది. ఫ్యామిలీ డాక్టర్ తరహాలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఆ తర్వాత ఏవైనా రోగాలు వస్తే వాటికి సరైన సమయంలో వైద్యం అందివ్వడమనేది మరో కీలకమైన అంశం. ఈ రెండు అంశాలను సెంట్రిక్‌గా చేసుకుని ఏపీలో హెల్త్‌కేర్ సిస్టమ్‌ని రెడీ చేశాం. రాష్ట్రంలో రెండు వేల జనాభా కల్గిన ఒక గ్రామంలో విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. వీటిపైన ప్రతీ 13 వేల జనాభా మండలం యూనిట్‌గా రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పాము. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నలుగురు డాక్టర్లు ఉంటారు. అంటే ప్రతీ పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ఈ పీహెచ్‌సీలకు అనుబంధంగా 104 అంబులెన్సులు ఉంటాయి. పీహెచ్సీలో ఉన్న డాక్టర్లకు కొన్ని గ్రామాల బాధ్యతలను అప్పగించాం. రోజు విడిచి రోజు ఈ డాక్టర్లు అంబులెన్సుల ద్వారా గ్రామాలకు వెళ్తారు. అక్కడి ప్రజలతో మాట్లాడుతారు... వీరంతా ఆ గ్రామంలోని ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్లుగా మారుతారు. పేరు పెట్టి పిలిచే సాన్నిహిత్యంతోపాటు ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ డాక్టర్లకు తెలుస్తుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఏదైనా సమస్యలు వచ్చినా మొగ్గ దశలోనే దానికి చికిత్స అందించే వీలు ఉంటుంది. వైద్య వ్యవస్థ బలోపేతం మండల స్థాయి దాటి ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ హాస్పటిల్స్ చికిత్స అందిస్తాయి. ప్రతీ పార్లమెంటు యూనిట్‌గా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కాలేజీలకు అనుబంధంగా టీచింగ్ కాలేజీలు వస్తాయి. అక్కడ పీజీ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్లంతా హెల్త్‌కేర్‌లో భాగమవుతారు. దీని ద్వారా హెల్త్‌కేర్ సిస్టమ్ బలోపేతం అవుతుంది. మూడేళ్లలో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా వైద్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. మా ప్రభుత్వం రావడానికి ముందు 11 మెడికల్ కాలేజీలు ఉంటే కొత్తగా 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేశాం. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గం ఒక యూనిట్‌గా మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల అన్ని చోట్ల హెచ్చుతగ్గులు లేకుండా వైద్యవ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇందు కోసం ఇప్పటికే రెండు బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించాం. మూడేళ్లలో ఫలితాలు అందుతాయి. ఏపీలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కోవిడ్ నియంత్రణ కార్యాచరణ అమలు చేశామని సీఎం జగన్ తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ ఇన్సురెన్స్ కమ్యూనిటీ హెల్త్ ఇన్సురెన్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే పథకం అమలు చేస్తోంది. ఇందులో వెయ్యికి పైగా అనారోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. కానీ అంతకంటే మిన్నంగా ఏపీలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం అమలు చేస్తున్నాం. ఇందులో ఏకంగా 2,446 రకాల అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందిస్తున్నాం. ఐదు లక్షల కంటే తక్కువ వార్షియ ఆదాయం కలిగిన 1.44 కోట్ల కుటుంబాలు ఈ పథకం ద్వారా సేవలు పొందుతున్నారు. గత మూడేళ్లలో 25 లక్షల మందికి ఈ పథకం ద్వారా ఉచితంగా వైద్య సాయం అందించామని సీఎం జగన్ వెల్లడించారు. -
CM YS Jagan Davos Tour: తయారీ హబ్‌గా ఏపీ
సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ ఊపందుకునేలా సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నాం. కాలుష్యం లేని పారిశ్రామిక ప్రగతి కోసం తగిన చర్యలు తీసుకుంటున్నాం. కొత్తతరం పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల తయారీ, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. కోవిడ్ పరిణామాలతో దెబ్బతిన్న ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థలను తిరిగి గాడిలో పెడుతున్నాం. ప్రజల కొనుగోలు శక్తి పెరిగేలా అడుగులు ముందుకు వేశాం. పాలనలో విప్లవాత్మక సంస్కరణలతో అనేక సేవలు అందిస్తున్నాం. పలు రంగాల్లో త్వరితగతిన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నాం. – దావోస్ వేదికపై సీఎం జగన్ సాక్షి, అమరావతి: పర్యావరణ హిత తయారీ రంగంలో అవకాశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దృష్టి సారించింది. కొత్తగా అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంతో పాటు, కాలుష్యం లేని ఇంధన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. దావోస్‌లో ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో తొలి రోజు ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు అంశాలపై అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చిస్తూ బిజీబిజీగా గడిపారు. డబ్ల్యూఈఎఫ్‌తో ప్లాట్‌ఫాం పార్ట్నర్గా ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్, బీసీజీ గ్లోబల్ చైర్మన్ హాన్స్ పాల్, అదానీ గ్రూపు సంస్థల చైర్మన్ గౌతం అదానీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా విద్య, వైద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాన్ని పలువురు కొనియాడారు. కొత్త పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా విద్య, వైద్య రంగాలే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీకి ఏపీలో పెట్టుబడుల అవకాశాలకు సంబంధించిన సమాచారం అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫుడ్ హబ్‌గా ఏపీ దావోస్‌లోని కాంగ్రెస్ సెంటర్లో డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాజ్ ష్వాప్‌తో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్లాజ్ మాట్లాడుతూ.. ఏపీకి అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ధాన్యాగారంగా పేరొందిన రాష్ట్రం ఫుడ్ హబ్‌గా మారేందుకు అన్ని రకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో పలు చోట్ల ఆహార కొరత ఏర్పడుతున్న పరిస్థితులను తీర్చడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించగలదని తెలిపారు. అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ భాగస్వామ్యంపై డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ష్వాప్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం, అభివృద్ధిపై చర్చించారు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగు పరచడంపై శ్రద్ధ పెట్టామని చెప్పారు. సోషల్ గవర్నెన్స్, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో డబ్ల్యూఈఎఫ్ వేదిక ద్వారా రాష్ట్రానికి మంచి ప్రయోజనాలు అందాలని ఆకాక్షింస్తూ.. ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న అంశాల గురించి వివరించారు. పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు, భవిష్యత్ తరాలను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి విద్య, వైద్య రంగాల్లో పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నామని సీఎం వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికీ, వారి గడప వద్దకే సేవలు అందిస్తున్నామని చెప్పారు. డబ్ల్యూఈఎఫ్‌తో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలు చూపుతున్న అధికారులు వైద్య రంగంలో భాగస్వామ్యం కండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆరోగ్యం – వైద్య విభాగాధిపతి డాక్టర్ శ్యాం బిషేన్‌తో కాంగ్రెస్ సెంటర్లో సీఎం సమావేశమయ్యారు. బయోటెక్నాలజీ, వైద్య రంగంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణలపై డబ్ల్యూఈఎఫ్‌తో కలిసి పనిచేసే అంశంపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఏపీలో ఆరోగ్య రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులను సీఎం వివరించారు. ప్రతి 2 వేల జనాభాకు వైఎస్సార్ క్లినిక్స్.. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా పాలనా వికేంద్రీకరణ తదితర అంశాలను సీఎం వివరించారు. నూతన బోధనాస్పత్రులు, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూఈఎఫ్ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం తర్వాత సీఎం కాంగ్రెస్ వేదిక నుంచి నేరుగా ఏపీ పెవిలియన్‌కు చేరుకుని, జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అంశాలను తెలియజేసేలా ఏపీ పెవిలియన్‌ను తీర్చిదిద్దారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులతో వరుస సమావేశాలు జరిపారు. కాలుష్య రహిత వ్యవస్థే లక్ష్యం డబ్ల్యూఈఎఫ్ మొబిలిటీ, సస్టెయిన్‌బిలిటీ విభాగాధిపతి, పెడ్రో గోమెజ్‌తో ఏపీ పెవిలియన్‌లో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టిన మూవ్ ఇండియా కార్యక్రమానికి ఏపీని మొదటిసారిగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో వీరి సమావేశానికి కీలక ప్రాధాన్యం ఏర్పడింది. రవాణా రంగంలో వస్తున్న మార్పులపై, కాలుష్యం లేని రవాణా వ్యవస్థ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై, ఇంధన రంగం భవిష్యత్‌పై ఇద్దరి మధ్య విస్తృతంగా చర్చ జరిగింది. ప్రస్తుతం వివిధ వాహనాలకు వినియోగిస్తున్న బ్యాటరీలను ఎలాంటి కాలుష్యం లేకుండా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉందని సీఎం నొక్కి చెప్పారు. లేకపోతే నీటి వనరులు, భూమి కాలుష్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి సమస్యల నేపథ్యంలో పంప్డ్ స్టోరేజ్ కాన్సెప్ట్‌ను ఏపీకి తీసుకొచ్చామని వివరించారు. విండ్, సోలార్, హైడల్.. ఈ మూడింటినీ సమీకృత పరిచే ప్రాజెక్టును రాష్ట్రంలో చేపట్టామని, భవిష్యత్తు సవాళ్లకు ఇదొక చక్కని పరిష్కారం కాగలదని విశదీకరించారు. ఇలా వచ్చే కరెంటును రవాణా వ్యవస్థలకు వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మెనియా లాంటి కొత్తతరం ఇంధనాల ఉత్పత్తిపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తర్వాత డబ్ల్యూఈఎఫ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒప్పందం కుదుర్చుకున్నారు. సీఎం జగన్‌తో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే డబ్ల్యూఈఎఫ్ ఒప్పందంతో ఉపయోగాలు ఇలా.. ► డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. ► రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికత, కాలుష్యం లేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్ తగిన సహకారం అందిస్తుంది. ► రాష్ట్రాన్ని అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. ► నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవ వనరుల తయారీ, స్థిరంగా ఉత్పత్తులు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం లాంటి ఆరు అంశాల్లో రాష్ట్రానికి మార్గనిర్దేశం లభిస్తుంది. ఏపీ చర్యలు భేష్ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) గ్లోబల్ చైర్మన్ హాన్స్‌పాల్ బక్నర్‌తో సీఎం జగన్ సమావేశమ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. అనుమతుల్లో జాప్యం లేకుండా సింగిల్ డెస్క్ విధానం ద్వారా పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో తూర్పు భాగానికి రాష్ట్రం గేట్వేగా మారేందుకు అన్ని రకాల అవకాశాలున్నాయని, ఇందుకోసం కొత్తగా మూడు పోర్టుల నిర్మాణం ప్రారంభించామన్నారు. విద్య, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను బీసీజీ గ్లోబల్ చైర్మన్ బక్నర్ ప్రశంసించారు. నైపుణ్య మానవ వనరులను తయారు చేయడానికి చేపట్టిన కార్యక్రమాల వల్ల పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అనంతరం మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఏపీ పెవిలియన్ సమీపంలోనే మహారాష్ట్ర కూడా పెవిలియన్ ఏర్పాటు చేసింది. అనంతరం ముఖ్యమంత్రి.. అదానీ గ్రూపు సంస్థల చైర్మన్ గౌతం అదానీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై వారిద్దరూ చర్చించారు. దావోస్‌లో నేడు సీఎం జగన్ పాల్గొనే కార్యక్రమాలు ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ అంశంపై డబ్ల్యూఈఎఫ్ పబ్లిక్ సెషన్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడనున్నారు. స్విస్ కాలమానం ప్రకారం ఉ.8:15 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉ.11.45 గంటలకు) సెషన్ ప్రారంభం. టెక్ మహీంద్రా ఛైర్మన్, సీఈఓ సీపీగురానీతో భేటీ.. దస్సాల్ట్ సీఈఓ బెర్నార్డ్ ఛార్లెస్‌తో సమావేశం. è జపాన్‌కు చెందిన ప్రముఖ రవాణా సంస్థ మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ సీఈఓ తకేషి హషిమొటోతో భేటీ. హీరోమోటార్ కార్పొరేషన్ చైర్మన్, ఎండీ పవన్ ముంజల్‌తో సమావేశం.. ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతో భేటీ. మరింత మంది ప్రముఖులనూ కలిసే అవకాశం.