
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్ పర్యటనపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర ప్రతిష్ట ఏమైపోయినా పర్వాలేదన్నది బాబు ఉద్ధేశం. సీఎం వైఎస్ జగన్‌కు పేరు, ప్రఖ్యాతలు వస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. మంచి ఫలితాలతో దావోస్ నుంచి తిరిగివస్తాం’’ అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: లండన్‌లో సీఎం జగన్ ల్యాండింగ్‌పై మంత్రి బుగ్గన క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment