ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకి హాజరయ్యారు. ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు సీఎం జగన్‌తో పాటు మంత్రులు దావోస్ సదస్సుకు వెళ్లారు. అందులో భాగంగా సమావేశం తొలిరోజు సీఎం జగన్.. డబ్ల్యూఈఎఫ్(WEF) హెల్త్ విభాగాధిపతి శ్యాం బిషేన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. ఆయనతో ఆరోగ్య రంగంపై చర్చించారు.
అనంతరం, డబ్ల్యూఈఎఫ్ మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో డబ్ల‍్యూఈఎఫ్‌లో ప్లాట్‌ఫాం పార్టనర్‌షిప్‌పై ఒప్పందం చేసుకున్నారు. సదస్సులో భాగంగానే బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్ పాల్ బక్నర్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. సీఎం జగన్‌ను మహారాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఆదిత్య ఠాక్రే మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, సీఎం జగన్‌తో అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతం అదానీ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చించారు.
అంతకుముందు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో సమావేశమయ్యారు. అదే సమయంలో దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం జ్యోతిప్రజ్వాలన చేశారు. ఏపి పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
ఇది కూడా చదవండి: వరల్డ్ ఎకనామిక్ ఫోరం: ఏపీ పెవిలియన్ ప్రారంభించిన సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment