WEF
-
తెలంగాణకు పెట్టుబడులు.. రూ.1.78 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో రికార్డు స్థాయిలో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు, 49,500 ఉద్యోగాల కల్పనకు సంబంధించి పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల సాధన లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం’.. ముందెన్నడూ లేనిరీతిలో భారీ ఫలితాన్ని సాధించినట్లు తెలిపింది. గత ఏడాది జరిగిన సదస్సులో కేవలం రూ.40 వేల కోట్ల పెట్టుబడులు సాధించగా.. ప్రస్తుత సదస్సులో నాలుగింతలకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొంది. ఈ నెల 16న విదేశీ పర్యటనకు బయలుదేరిన రేవంత్‌రెడ్డి బృందం 17 నుంచి 19వ తేదీ వరకు సింగపూర్‌లో పర్యటించింది. అనంతరం దావోస్‌కు చేరుకుని మూడురోజుల పాటు డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో పాల్గొంది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. సమావేశాలు సక్సెస్ అయ్యాయన్న సర్కారు దావోస్‌లో పారిశ్రామికవేత్తలతో తెలంగాణ రైజింగ్ బృందం నిర్వహించిన సమావేశాలు విజయవంతమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. అమెజాన్, సన్ పెట్రో కెమికల్స్, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్, మేఘా ఇంజనీరింగ్ సంస్థలు భారీ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీలు హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో హైదరాబాద్ కేంద్రంగా విస్తరణ ప్రణాళికలు ప్రకటించాయి. డేటా సెంటర్ల రంగంలో అమెజాన్, టిల్మాన్, ఉర్సా, సిఫి, కంట్రోల్ ఎస్ సంస్థలు పెట్టుబడులను ప్రకటించాయి. సోలార్ సెల్స్, రాకెట్ తయారీ, రక్షణ రంగంలోనూ భారీ ఎత్తున పెట్టుబడుల ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలున్నాయని పేర్కొంది. తెలంగాణ రైజింగ్– 2050 లక్ష్య సాధనపై అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలు, విధాన నిర్ణేతల నుంచి పెద్దయెత్తున సానుకూలత వ్యక్తమైనట్లు ప్రకటించింది. యూనీలివర్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్, సుహానా మసాలా, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, ఫోనిక్స్, అగిలిటీ, స్కైరూట్ ఏరోస్సేస్, జేఎస్‌డబ్ల్యూ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపింది. అనేక రంగాల్లో అనుకూలతలు: సీఎం రేవంత్ ‘అంతర్జాతీయగా వాణిజ్యానికి పర్యాయపదంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. సాఫ్ట్వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్, తెలంగాణకు అనుకూలతలు ఉన్నాయి. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్రి్టక్ వాహనాలు, సెమీ కండక్టర్లతో పాటు ఇతర రంగాల్లో పురోగతికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ తర్వాత సరఫరా వ్యవస్థలు చైనా బయట అవకాశాలను (చైనా ప్లస్ వన్) అన్వేషిస్తున్న నేపథ్యంలో ఆ అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోంది. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు క్లస్టర్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాం. ఔటర్ రింగు రోడ్డు లోపలి వైపు సేవలు, ప్రతిపాదిత రీజినల్ రింగు రోడ్డు, ఓఆర్ఆర్ నడుమ తయారీ, ట్రిపుల్ ఆర్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణను ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఉద్యోగాల కల్పన, ఆదాయం పెంపు, వాణిజ్య అవకాశాలు, మరింత మెరుగైన సంక్షేమం కోసం ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగుతాం..’ అని దావోస్ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. -
డబ్ల్యూఈఎఫ్‌లో చేరిన 'ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్'
ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఈఎఫ్)కు చెందిన ''ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇనిషియేటివ్''లో చేరింది. CO2e ఉద్గారాలను తగ్గించడం, ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పించడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని ఏఎం గ్రీన్ డబ్ల్యూఈఎఫ్‌లో చేరింది.మూడు బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడితో.. సుమారు 10,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించడానికి ఏఎం గ్రీన్ సన్నద్ధమైంది. దీని ద్వారా స్థానికి, జాతీయ ఆర్థిక వ్యవస్థలను పెంచడమే కాకుండా.. నిర్మాణం, పరికరాల తయారీ, గృహ నిర్మాణం వంటి పరిశ్రమలకు మద్దతు ఇస్తుంది.ఏఎం గ్రీన్ ఛైర్మన్ 'అనిల్ చలమలశెట్టి' ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా మేము అవిశ్రాంతంగా పని చేస్తున్నాము. ఇప్పుడు ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇనిషియేటివ్‌లో చేరే అవకాశం లభించింది. డబ్ల్యుఈఎఫ్ చొరవతో పాలుపంచుకోవడానికి.. క్లస్టర్ ట్రాన్సిషన్ లక్ష్యాలను నెరవేర్చడానికి ఎదురుచూస్తున్నామని అన్నారు.ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇనిషియేటివ్‌లో సభ్యునిగా.. ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్ డీకార్బనైజేషన్ క్లస్టర్లపై ప్రపంచవ్యాప్త పనికి మద్దతు ఇవ్వడం.. ఫోరమ్‌తో అభివృద్ధి పనులను పంచుకోవడం వంటి వాటితో పాటు ఇతర ఫోరమ్ క్లస్టర్ల నుంచి ఉత్తమ అభ్యాసాలను పొందడం లక్ష్యంగా పెట్టుకుందని చలమల శెట్టి పేర్కొన్నారు.25 పారిశ్రామిక సమూహాలతో కూడిన మా గ్లోబల్ నెట్‌వర్క్‌కు.. ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్‌ను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక వనరులతో.. కాకినాడ క్లస్టర్ గ్రీన్ అమ్మోనియా & హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రాంతీయంగా అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కమ్యూనిటీలో భాగంగా, ఏఎం గ్రీన్ కాకినాడకు అంతర్దృష్టులను పంచుకోవడానికి.. పారిశ్రామిక డీకార్బనైజేషన్‌లో సామూహిక పురోగతికి దోహదపడే అవకాశం ఉంది, అని సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ హెడ్ & ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు 'రాబర్టో బొక్కా' అన్నారు. -
అరుదైన స్థానం దక్కించుకున్న హైదరాబాద్ కంపెనీ
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ‘టెక్నాలజీ పయనీర్స్ 2024’ జాబితాలో దేశంలోని పది కంపెనీలు చోటు సంపాదించాయి. కృత్రిమ మేధ (ఏఐ)తో సరికొత్త ఆవిష్కరణలు చేసిన 100 స్టార్టప్ కంపెనీలతో ఈ జాబితా రూపొందించారు. అందులో హైదరాబాద్‌కు చెందిన నెక్ట్స్‌వేవ్ కంపెనీ స్థానం దక్కించుకోవడం విశేషం.నెక్ట్స్‌వేవ్..ఏదో ఒకకోర్సు నేర్చుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరగానే సరిపోదు. నిత్యం కొత్త అంశాలు నేర్చుకుంటేనే ఉద్యోగంలో నిలదొక్కుకోగలం. ఆ దిశగా పని చేస్తోంది ‘నెక్ట్స్‌వేవ్’. ఐఐటీల్లో చదివిన హైదరాబాదీ యువకులు శశాంక్ రెడ్డి, రాహుల్, అనుపమ్ కొవిడ్ లాక్డౌన్ సమయంలో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ సంస్థను స్థాపించారు. కంటిన్యూయస్ కెరీర్ బిల్డింగ్ ప్రోగ్రాం(సీసీబీపీ) పేరిట కాలేజీల నుంచి గ్యాడ్యుయేట్లుగా బయటకు వచ్చే విద్యార్థులకు కంపెనీల్లో అవసరమయ్యే ఐఓటీ, ఏఐ, ఫుల్‌స్టాక్ తదితర స్కిల్స్ నేర్పించడం దీని ఉద్దేశం.దేశంలో డిగ్రీ అయిపోయాక ఖాళీగా ఉంటున్న దాదాపు 60 శాతం మందిని నిపుణులుగా తీర్చిదిద్దాలనేది సంస్థ లక్ష్యం. ఇక్కడ శిక్షణ పొందిన వారు ప్రముఖ సంస్థల్లో కొలువు దక్కించుకొని, నైపుణ్యాలకు సానబట్టే వేదిక దొరికితే దూసుకెళ్తామని నిరూపించారు కూడా. దేశవ్యాప్తంగా మూడు వేల కాలేజీలకు చెందిన 2 లక్షల మంది విద్యార్థులు ఈ స్టార్టప్ కమ్యూనిటీలో భాగస్వాములయ్యారు. ఫ్రెషర్స్‌తో పాటు వివిధ కారణాల వల్ల కెరియర్లో గ్యాప్ వచ్చిన, వేరే రంగంలో పనిచేసిన వారికీ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తమదేనని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. పనితీరుతో ఇన్వెస్టర్లనూ మెప్పించి.. గతంలో రూ.21 కోట్ల క్యాపిటల్‌ను సాధించారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే సాఫ్ట్వేర్ రంగంలో నిలదొక్కుకోవచ్చని చెబుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఉద్యోగాల కల్పనకు సహాయం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏడాదికి పది లక్షల మంది నిపుణులను తయారు చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలుపుతున్నారు.ఐటీ పరిశ్రమలో లేఆఫ్స్.. ఇప్పుడేం చేయాలంటే..ఐటీ పరిశ్రమలో ప్రముఖ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరుతో కొంతకాలంగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగంలోని సాఫ్ట్వేర్ల అప్డేషన్ అగిపోయింది. బ్యాంకింగ్ వెబ్సైట్లు, యాప్‌ల్లో కొత్త ఫీచర్లు అందించాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. దానికితోడు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌లు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు భారీగా పెరిగాయి. ఇవిచాలవన్నట్లు అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితులు నెలకొంటున్నాయి. దాంతో ఐటీ కంపెనీల లాభాలు భారీగా తగ్గుతున్నాయి. ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించి..తిరిగి పరిస్థితులు గాడినపడితే ఐటీ రంగం పుంజుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆలోపు కొత్తగా ఉద్యోగాలు కోసం చూస్తున్నవారు నిరాసక్తి చెందకుండా నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. -
డబ్ల్యూఈఎఫ్ జాబితాలో భారత కంపెనీలకు చోటు
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ‘టెక్నాలజీ పయనీర్స్ 2024’ జాబితాలో దేశంలోని పది కంపెనీలు చోటు సంపాదించాయి. కృత్రిమ మేధ (ఏఐ)తో సరికొత్త ఆవిష్కరణలు చేసిన 100 స్టార్టప్ కంపెనీలతో ఈ జాబితా రూపొందించారు. అందులో హైదరాబాద్‌కు చెందిన నెక్ట్స్‌వేవ్ కంపెనీ స్థానం దక్కించుకోవడం విశేషం.డబ్ల్యూఈఎఫ్ రూపొందించిన జాబితాలో స్వచ్ఛ ఇంధనంపై ఆవిష్కరణలు చేసిన కంపెనీలు, ఆరోగ్య సంరక్షణ, బయోటెక్, అంతరిక్ష, న్యూరోటెక్నాలజీల్లో వినూత్నంగా ఆలోచిస్తున్న సంస్థలు ఉన్నాయి.హైదరాబాద్ సంస్థ నెక్ట్స్వేవ్తెలుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలైన రాహుల్ అట్టులూరి, గుజ్జుల శశాంక్ రెడ్డి, అనుపమ్ ఏర్పాటు చేసిన నెక్ట్స్‌వేవ్ ఈ జాబితాలో స్థానం పొందింది. ఈ సంస్థ చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు ఏఐ ఆధారిత కోడింగ్ కోర్సులను ఆన్లైన్లో అందిస్తోంది.భారత్ చెందిన కంపెనీలు ఇవే..ఏఐ సహాయంతో ముందస్తు దశ రొమ్ము కేన్సర్ పరీక్షను నిరమాయ్ అభివృద్ధి చేస్తోంది. పిక్సెల్ కంపెనీ జియో స్పేషియల్ డేటాను అందించే హైపర్‌స్పెక్ట్రల్ శాటిలైట్ ఇమేజినరీని అభివృద్ధి చేస్తోంది. భారతీయ భాషల వినియోగానికి ఏఐ మోడళ్లు, ప్లాట్‌ఫారాలను సర్వమ్ ఏఐ సిద్ధం చేస్తోంది. పునరుత్పాదక ఇంధనాన్ని నిల్వ చేసుకునే సొల్యూషన్లను యాంపియర్‌అవర్ తయారుచేస్తోంది. క్రాప్ఇన్ అనే మరో అంకురం రైతులు తమ పొలాలకు జియో-టాగ్ చేసుకునేందుకు, వ్యవసాయ రికార్డులను డిజిటలీకరణ చేసుకునేందుకు పర్యవేక్షణ, నిర్వహణ పరిష్కారాన్ని అభివృద్ధి చేస్తోంది. హెల్త్‌ప్లిక్స్ అనేది ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులను అభివృద్ధి చేస్తోంది. ఇంటర్నేషనల్ బ్యాటరీ కంపెనీ(ఐబీసీ) రీఛార్జబుల్ ప్రిస్మాటిక్ లిథియం అయాన్ నికెల్ మాంగనీజ్ కోబాల్ట్ బ్యాటరీలను తయారు చేస్తోంది. స్ట్రింగ్ బయో అనే మరో కంపెనీ విషవాయువుల నుంచి జంతువులు, మానవులకు ఉపయోగపడే పోషకాలను తయారు చేస్తోంది. -
2024లో ముంచుకొస్తున్న ముప్పు..
ఒకవైపు భారీవర్షాలు, తుపాన్లు, వరదలు మరోవైపు కరవు కాటకాలు.. వీటికితోడు ఇటీవల కాలంలో పెచ్చురిల్లుతున్న విభిన్న దాడులతో సామాన్యులు చితికిపోతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో ఏఐ ఆధారిత మోసాలు, సైబర్‌దాడులు, రాజకీయమోసాలు 2024లో అధికం కాబోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వీటికితోడు అంతర్జాతీయంగా ఎన్నో రిస్క్‌లు సంభవించబోతున్నట్లు అంచనావేస్తూ ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనామిక్ ఫోరం) నివేదిక విడుదల చేసింది. భారత్, అమెరికా, బ్రిటన్, మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 300 కోట్ల మంది ఎన్నికల క్రతువులో భాగం కానున్నారు. అయితే తప్పుడు సమాచార వ్యాప్తి ఎన్నికలకు పెనుముప్పుగా పరిణమించనుంది. ఆయా దేశాల్లో ఎన్నికల ఫలితాలపైనా, ప్రజాస్వామ్య మనుగడపైనా ఇది తీవ్ర ప్రభావం చూపనుందని ప్రపంచ ఆర్థిక వేదిక వెలువరించిన ‘గ్లోబల్ రిస్క్ నివేదిక-2024’లో వెల్లడైంది. ఆర్థిక, పర్యావరణ, రాయకీయ, భౌగోళిక, సాంకేతిక తదితర 34 ముప్పులపై ఈ నివేదిక ర్యాంకులను ప్రకటించింది. తప్పుడు సమాచారం అతిపెద్ద ముప్పుగా ఉన్న దేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉంది. అమెరికా ఆరోస్థానంలో ఉంది. కేవలం వాతావరణానికి సంబంధించి తప్పడు సమాచారం వల్ల కలిగే రిస్క్ 2024లో 100కు 66 శాతంగా ఉంటుందని నివేదిక ద్వారా తెలిసింది. నివేదికలోని వివరాల ప్రకారం..(రిస్క్ శాతం) 1. తీవ్రమైన వాతావరణం 66% 2. ఏఐ ఆధారిత తప్పుడు సమాచారం 53% 3. సామాజికంగా/ రాజకీయంగా కలిగే రిస్క్ 46% 4. జీవన వ్యయం 42% 5. సైబర్ దాడులు 39% 6. ఆర్థిక తిరోగమనం 33% 7. కీలకమైన వస్తువుల సరఫరాలో అంతరాయం 25% 8. సాయుధ బలగాల మధ్య యుద్ధం 25% 9. మౌలిక సదుపాయాలపై దాడులు 19% 10. ఆహార సరఫరా గొలుసుల అంతరాయం 18% -
ఇంధన పరివర్తన ఇండెక్స్‌లో భారత్ సత్తా.. మెరుగైన ర్యాంక్ సాధన
న్యూఢిల్లీ: ఇంధన పరివర్తన(ఎనర్జీ ట్రాన్సిషన్) ఇండెక్స్‌లో భారత్ 67వ ర్యాంకులో నిలిచినట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) నివేదిక తాజాగా పేర్కొంది. గ్లోబల్ ర్యాంకింగ్స్ జాబితాలో స్వీడన్ తొలి స్థానాన్ని పొందగా.. డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ టాప్–5లో చోటు సాధించాయి. 120 దేశాలతో కూడిన ఈ ఇండెక్స్‌లో అన్ని రకాలుగా ఎనర్జీ ట్రాన్సిషన్‌కు ఊపునిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్ మాత్రమేనని వెల్లడించింది. ఐటీ దిగ్గజం యాక్సెంచర్ సహకారంతో నివేదికను రూపొందించింది. ప్రపంచ ఇంధన సంక్షోభం, భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల కారణంగా ఎనర్జీ ట్రాన్సిషన్ మందగించినప్పటికీ భారత్ చెప్పుకోదగ్గ చర్యలు చేపట్టినట్లు నివేదిక పేర్కొంది. నిరంతర ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న నేపథ్యంలోనూ భారత్ ఇంధన తీవ్రతను తగ్గించుకున్నట్లు తెలియజేసింది. అంతర్జాతీయ ఇంధనాలను పొందడం ద్వారా కర్బనాలకు సైతం చెక్ పెడుతున్నట్లు వెల్లడించింది. అందుబాటులో విద్యుత్ నిర్వహణను సమర్ధవంతంగా చేపడుతున్నట్లు ప్రశంసించింది. శుద్ధ ఇంధనాల వినియోగాన్ని పెంచడం, పునరుత్పాదక ఇంధనాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు ఇండెక్స్‌లో భారత్ మెరుగుపడేందుకు దోహదం చేసినట్లు వివరించింది. -
టాప్ ఆశావహ స్టార్టప్ 100 లిస్ట్: దేశీ సంస్థలు నాలుగు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఆశావహ, మార్గదర్శక 100 అంకుర సంస్థల జాబితాలో భారత్ నుంచి నాలుగు స్టార్టప్‌లు చోటు దక్కించుకున్నాయి. గిఫ్టోలెక్సియా సొల్యూషన్స్, జాక్‌మాజ్ టెక్నాలజీ, ఎవల్యూషన్‌క్యూ, నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఇందులో ఉన్నాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) దీన్ని రూపొందించింది. పాఠశాల విద్యార్థుల్లో బోధనాంశాలను నేర్చుకోవడంలో లోపాలు తలెత్తే రిసు్కలను గుర్తించే టెక్నాలజీ ఆధారిత సాధనాన్ని గిఫ్టోలెక్సియా అభివృద్ధి చేస్తోంది. ఈఎస్జీ (పర్యావరణం, సామాజిక, గవర్నెన్స్) ఇన్వెస్టింగ్‌కు ఉపయోగపడేలా శాటిలైట్ డేటాను విశ్లేషిం చే సాంకేతికతను జాక్‌మాజ్ రూపొందిస్తోంది. ఇదీ చదవండి: వేదాంతా భారీ పెట్టుబడులు: ఏకంగా రూ. 14,000 కోట్లు నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ సంస్థ.. 3డీ బయోప్రింటర్లను, ఎవల్యూషన్‌క్యూ సంస్థ ..క్వాంటమ్ టెక్నాలజీలకు సైబర్‌సెక్యూరిటీ ఉత్పత్తులను అందిస్తోంది. వ్యాపారం, సమాజంపై గణనీయంగా ప్రభావం చూపగలిగే కొత్త సాంకేతికతలను ఆవిష్కరించే అంకుర సంస్థలతో డబ్ల్యూఈఎఫ్ 2000 నుంచి టెక్నాలజీ పయోనీర్స్ జాబితాను రూపొందిస్తోంది. ఈ ఏడాది లిస్టులో 31 దేశాలకు చెందిన స్టార్టప్‌లు చోటు దక్కించున్నాయి. అమెరికా నుంచి అత్యధికంగా 29 కంపెనీలు, తర్వాత చైనా నుంచి 12 సంస్థలు ఉన్నాయి. టెక్నాలజీ పయోనీర్స్గా ఎంపికైన అంకుర సంస్థలకు.. ఎయిర్‌బీఎన్‌బీ, గూగుల్, ట్విటర్ వంటి దిగ్గజాల సరసన చోటు దక్కుతుంది. -
టాప్ 100 స్టార్టప్‌లలో భారత్ సంస్థలు.. దిగ్గజాల సరసన చోటు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఆశావహ, మార్గదర్శక 100 అంకుర సంస్థల జాబితాలో భారత్ నుంచి నాలుగు స్టార్టప్‌లు చోటు దక్కించుకున్నాయి. గిఫ్టోలెక్సియా సొల్యూషన్స్, జాక్‌మాజ్ టెక్నాలజీ, ఎవల్యూషన్‌క్యూ, నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఇందులో ఉన్నాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) దీన్ని రూపొందించింది. పాఠశాల విద్యార్థుల్లో బోధనాంశాలను నేర్చుకోవడంలో లోపాలు తలెత్తే రిస్కులను గుర్తించే టెక్నాలజీ ఆధారిత సాధనాన్ని గిఫ్టోలెక్సియా అభివృద్ధి చేస్తోంది. ఈఎస్జీ (పర్యావరణం, సామాజిక, గవర్నెన్స్) ఇన్వెస్టింగ్‌కు ఉపయోగపడేలా శాటిలైట్ డేటాను విశ్లేషించే సాంకేతికతను జాక్‌మాజ్ రూపొందిస్తోంది. నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ సంస్థ.. 3డీ బయోప్రింటర్లను, ఎవల్యూషన్‌క్యూ సంస్థ .. క్వాంటమ్ టెక్నాలజీలకు సైబర్‌సెక్యూరిటీ ఉత్పత్తులను అందిస్తోంది. వ్యాపారం, సమాజంపై గణనీయంగా ప్రభావం చూపగలిగే కొత్త సాంకేతికతలను ఆవిష్కరించే అంకుర సంస్థలతో డబ్ల్యూఈఎఫ్ 2000 నుంచి టెక్నాలజీ పయోనీర్స్ జాబితాను రూపొందిస్తోంది. ఈ ఏడాది లిస్టులో 31 దేశాలకు చెందిన స్టార్టప్‌లు చోటు దక్కించున్నాయి. అమెరికా నుంచి అత్యధికంగా 29 కంపెనీలు, తర్వాత చైనా నుంచి 12 సంస్థలు ఉన్నాయి. టెక్నాలజీ పయోనీర్స్గా ఎంపికైన అంకుర సంస్థలకు.. ఎయిర్‌బీఎన్‌బీ, గూగుల్, ట్విటర్ వంటి దిగ్గజాల సరసన చోటు దక్కుతుంది. -
1.4 కోట్ల ఉద్యోగాలు ఉఫ్! ప్రపంచ ఆర్థిక వేదిక సంచలన రిపోర్ట్
భారత జాబ్ మార్కెట్‌పై ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సంచలన నివేదిక వెలువరించింది. దేశంలో వచ్చే ఐదేళ్లలో భారత జాబ్ మార్కెట్ 22 శాతం క్షీణిస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు ఊడిపోనున్నాయని ఆ రిపోర్ట్ పేర్కొంటోంది. ఇదీ చదవండి: International labour Day: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్‌లో...? అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. గత కొన్ని నెలలుగా అనేక కంపెనీలు లేఆఫ్స్ అమలు చేస్తున్నాయి. అమెజాన్, గూగుల్ వంటి పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలు సైతం వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ జాబ్ మార్కెట్‌పై 800కు పైగా కంపెనీలతో సర్వే నిర్వహించిన డబ్ల్యూఈఎఫ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. వచ్చే ఉద్యోగాల కన్నా పోయేవే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా 2027 నాటికి 69 మిలియన్ల (6.9 కోట్లు) కొత్త ఉద్యోగాలు వస్తాయని, ఇదే సమయంలో 83 మిలియన్ల (8.3 కోట్లు) ఉద్యోగాలు ఊడిపోతాయని డబ్ల్యూఈఎఫ్ సర్వే ద్వారా అంచనా వేసింది. అంటే కొత్తగా వచ్చే ఉద్యోగాల కన్నా ఊడిపోయే ఉద్యోగాల సంఖ్యే ఎక్కువగా ఉంది. మొత్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు ఊడిపోనున్నాయని డబ్ల్యూఈఎఫ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. జాబ్ మార్కెట్ క్షీణత భారత్‌లో 22 శాతంగా ఉంటుందని అంచనా వేసిన డబ్ల్యూఈఎఫ్ ప్రపంచ వ్యాప్తంగా 23 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, డేటాసెట్ విభాగాల్లో ఉన్న 673 మిలియన్ (67.3 కోట్లు) ఉద్యోగాల్లో 83 మిలియన్ (8.3 కోట్లు) ఉద్యోగాలను వచ్చే ఐదేళ్లలో తొలగించాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో 69 మిలియన్ (6.9 కోట్లు) ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. ఫలితంగా 14 మిలియన్ల (1.4 కోట్లు) ఉద్యోగాలు పోతాయి. ఇది ప్రస్తుతం ఉపాధిలో 2 శాతం. ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీలు అవలంబించడమే ఇందుకు కారణమని డబ్ల్యూఈఎఫ్ వెల్లడించింది. ప్రమాదంలో ఉన్న ఉద్యోగాలు ఇవే.. పెరుగుతున్న సాంకేతికత, డిజిటలైజేషన్ కారణంగా బ్యాంక్ టెల్లర్లు, క్యాషియర్లు డేటా ఎంట్రీ క్లర్క్‌ల వంటి క్లరికల్ ఉద్యోగాలు వేగంగా తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులు, బిగ్ డేటా నిపుణులు, ఏఐ మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టుల ఉద్యోగాలు 2027 నాటికి సగటున 30 శాతం పెరుగుతాయని అంచనా. ఇదీ చదవండి: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు! -
డబ్ల్యూఈఎఫ్ లైట్‌హౌస్ నెట్‌వర్క్‌లో డాక్టర్ రెడ్డీస్ ప్లాంటు
న్యూఢిల్లీ: గ్లోబల్ లైట్‌హౌస్ నెట్వర్క్ (జీఎల్ఎన్)లో కొత్తగా 11 ఫ్యాక్టరీలు, పారిశ్రామిక సైట్లను చేర్చినట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ నుంచి దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) హైదరాబాద్ ప్లాంటు, శ్రీసిటీలోని మాండెలీజ్ ఫ్యాక్టరీ, ఇండోర్‌లోని సిప్లా ప్లాంటు ఉన్నాయి. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3డీ ప్రింటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి విప్లవాత్మకమైన సాంకేతికతలను ఉపయోగించడంలో ముందుంటున్న 100 పైగా తయారీ సంస్థలు జీఎల్ఎన్లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు మారిపోతున్న నాణ్యత ప్రమాణాల అంచనాలను అందుకునేందుకు డీఆర్ఎల్ హైదరాబాద్ ప్లాంటు భారీ స్థాయిలో డిజిటలీకరణ చేపట్టినట్లు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. తయారీ వ్యయాలను 43 శాతం మేర తగ్గించుకున్నట్లు పేర్కొంది. పాతికేళ్ల హైదరాబాద్ ప్లాంటుకు డిజిటల్ లైట్‌హౌస్ ఫ్యాక్టరీ హోదా దక్కడం గర్వకారణమని డీఆర్ఎల్ గ్లోబల్ హెడ్ (తయారీ విభాగం) సంజయ్ శర్మ తెలిపారు. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ ఆటోమేషన్స్ మొదలైన వాటితో శ్రీ సిటీలోని ప్లాంటులో మాండెలీజ్ సంస్థ తయారీ వ్యయాలను 38 శాతం తగ్గించుకుందని, కార్మికుల ఉత్పాదకతను 89 శాతం మేర పెంచుకుందని డబ్ల్యూఈఎఫ్ వివరించింది. అంతర్జాతీయంగా మాండెలీజ్‌కు ఉన్న ఫ్యాక్టరీలకు ఈ ప్లాంటు ప్రామాణికంగా మారిందని తెలిపింది. లైట్‌హౌస్ నెట్‌వర్క్‌లోని నాలుగు సంస్థలకు అత్యుత్తమమైన సస్టెయినబిలిటీ లైట్‌హౌస్‌ల హోదా ఇచ్చినట్లు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. -
దావోస్‌కు బై బై...తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రత్యేకతలను వివరించి, రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చేపట్టిన పర్యటన ముగిసింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా జరిపిన చర్చలు, సంప్రదింపులతో కేటీఆర్ బృందం రాష్ట్రానికి సుమారు రూ.4,200 కోట్ల మేర పెట్టుబడులు రాబట్టగలిగింది. కేటీఆర్ శుక్రవారం తన బృందంతో కలిసి తిరుగు పయనమయ్యారు. శనివారం ఉదయం రాష్ట్రానికి చేరుకోనున్నారు. తొలుత యూకేలో.. ఈనెల 18న హైదరాబాద్ నుంచి యూకేకు చేరుకున్న కేటీఆర్.. నాలుగు రోజుల పాటు యూకే బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ నెల 22న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు చేరుకున్న కేటీఆర్ 26వ తేదీ వరకు 45 కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. నాలుగు రౌండ్ టేబుల్ సమావేశాలు, మరో నాలుగు చర్చా గోష్టుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేకతలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను కేటీఆర్ వివరించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌కు బహుళజాతి కంపెనీల ప్రతినిధుల నుంచి ప్రశంసలు దక్కడంతోపాటు.. పలు అవగాహన ఒప్పందాలు, పెట్టుబడి ప్రకటనలు, చర్చలకు ఈ పెవిలియన్ వేదికగా నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ ప్రధాన సమావేశ మందిరం, ఇండియా పెవిలియన్, సీఐఐ పెవిలియన్‌లో జరిగిన చర్చలు, తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన ఫార్మా లైఫ్ సైన్స్, దేశంలోని ప్రముఖ యూనికార్న్ వ్యవస్థాపకులతో జరిగిన గోష్టుల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రభుత్వ విధానాలను, పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడిందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రభుత్వ అధికారులు, పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు, ముఖ్యంగా యూకే, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన ప్రవాస భారతీయులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. జెడ్ఎఫ్ కంపెనీ ప్రతినిధులతో భేటీ దావోస్‌లో చివరిరోజున స్విట్జర్లాండ్‌లోని జ్యురిక్లో జెడ్ఎఫ్ కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తామని జెడ్ఎఫ్ ప్రతినిధులు చెప్పారు. తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని.. హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్న క్యాంపస్ 3 వేల మంది సిబ్బందితో తమ అతిపెద్ద కార్యాలయంగా ఉండబోతుందన్నారు. జూన్ 1న నానక్‌రామ్‌గూడలో జెడ్ఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నామని వెల్లడించారు. జెడ్ఎఫ్ కంపెనీ విస్తరణతో తెలంగాణలో మొబిలిటీ రంగానికి అదనపు బలం చేకూరుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. మళ్లీ వచ్చే ఏడాది దాకా! సాక్షి, హైదరాబాద్: వారం రోజుల పాటు దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ చివరి రోజు స్విట్జర్లాండ్‌లోని జూరిచ్‌లో సరదాగా గడిపారు. ఓ వీధి పక్కన రెస్టారెంట్లో సేదతీరుతున్న ఫొటోను ట్వీట్ చేశారు. ‘దావోస్‌కు బై బై.. వచ్చే ఏడాది దాకా’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
దావోస్‌లో జోష్‌గా.. తెలంగాణకు భారీ పెట్టుబడులు..
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ భారీ పెట్టుబడులు సాధిస్తోంది. పలు ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. పలు కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ బుధవారం రెండు భారీ పెట్టుబడులు సాధించింది. రైల్వే కోచ్‌ల తయారీలో పేరొందిన స్టాడ్లర్ రైల్ సంస్థ వచ్చే రెండేళ్లలో రూ.1,000 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో స్టాడ్లర్ రైల్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్ రైల్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు ఆన్స్ గార్డ్ బ్రొక్‌మెయ్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మోకిలలో ఇప్పటికే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన మేధా సర్వోడ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి స్టాడ్లర్ రైల్ ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుత పెట్టుబడి ద్వారా సుమారు 2,500 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే కోచ్‌లు భారత్‌కే కాకుండా ఆసియా పసిఫిక్ ప్రాంతానికి కూడా ఎగుమతి అవుతాయి. కాగా స్టాడ్లర్ రైల్ పెట్టుబడిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విదేశాలకు కూడా కోచ్‌లు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడం తెలంగాణకు గర్వకారణమన్నారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందనే విషయం మరోసారి నిరూపితమైందని చెప్పారు. తెలంగాణలో ఏర్పాటు చేసే తమ యూనిట్‌కు అత్యంత ప్రాధాన్యత ఉందనిబ్రొక్‌మెయ్ పేర్కొన్నారు. తమ కంపెనీ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధిని సాధించేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందన్నారు. స్వల్ప వ్యవధిలోనే ఫెర్రింగ్ ఫార్మా విస్తరణ భారత్‌లో తమ విస్తరణ ప్రణాళికలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు మరో స్విస్ సంస్థ ఫెర్రింగ్ ఫార్మా ప్రకటించింది. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో బుధవారం మంత్రి కేటీఆర్‌తో సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అల్లేసండ్రో గిలియో ప్రతినిధి బృందం సమావేశం అయ్యింది. క్రోన్, అల్సరేటివ్ కోలైటిస్ వంటి (జీర్ణకోశ సంబంధిత) వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ‘పెంటసా‘ను ఉత్పత్తి చేసేందుకు తెలంగాణలోని కొత్త ప్లాంట్‌ను వినియోగించుకోనున్నట్లు తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద మేసాలజైన్ అనే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్ (ఏపీఐ) తయారీదారుల్లో ఒకటిగా ఉన్న ఫెర్రింగ్ ఫార్మా ప్రస్తుతం వివిధ దేశాల్లో తన ఉత్పత్తులను తయారు చేస్తోంది. వీటికి అదనంగా హైదరాబాద్ నగరంలో తన ఫార్ములేషన్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నెలరోజుల క్రితమే తమ యూనిట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సంస్థ స్వల్ప వ్యవధిలోనే అదనంగా మరో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ‘ష్నైడర్ ఎలక్ట్రిక్’మరో యూనిట్ తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫ్రెంచ్ కంపెనీ ష్నైడర్ ఎలక్ట్రిక్ రాష్ట్రంలో మరో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో బుధవారం భేటీ సందర్భంగా సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు లుక్ రిమోంట్ ఈ మేరకు ప్రకటన చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న తమ యూనిట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఫ్యాక్టరీగా అడ్వాన్సŠడ్ లైట్ హౌస్ అవార్డును అందుకున్నదని రిమోంట్ తెలిపారు. ఐఓటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనలిటిక్స్, ఏఐ డీప్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం వాడినందుకు ఈ అవార్డు దక్కిందన్నారు. తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలు సాఫీగా కొనసాగుతున్నాయంటూ, రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక స్నేహపూర్వక వాతావరణంపై ఆయన ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ఉన్న ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే తమ కంపెనీ విస్తరణకు పూనుకున్నట్లు తెలిపారు. తమ నూతన తయారీ ప్లాంట్ ఎనర్జీ మేనేజ్మెంట్, ఆటోమేషన్ సంబంధిత ఉత్పత్తులను తయారు చేస్తుందని చెప్పారు. ష్నైడర్ ఎలెక్ట్రిక్ అదనపు తయారీ యూనిట్ వలన కొత్తగా 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ తెలిపారు. -
ఎమర్జింగ్ టెక్నాలజీ..రెండు అంచుల కత్తి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌చైన్, డేటా సైన్సెస్ వంటి ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిజ్ఞానం రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటివి. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ (కొత్త, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ) వినియోగంతో కలిగే లాభనష్టాలపై ప్రభుత్వాలకు పూర్తి అవగాహన ఉండాలి’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో భాగంగా ‘ప్రజా బాహుళ్యంలోకి కృత్రిమ మేథస్సు (ఏఐ).. ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన ఆవశ్యకత’ అనే అంశంపై మంగళవారం జరిగిన చర్చాగోష్టిలో కేటీఆర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వాలకు నియంత్రణ అధికారాలు ఇవ్వాలి ‘ఫేషియల్ రికగ్నిషన్ (ముఖాన్ని బట్టి వ్యక్తుల గుర్తింపు), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడంలో ప్రజల విశ్వాసం, నమ్మకం పొందడమే ప్రభుత్వాలకు అత్యంత సవాలుతో కూడుకున్న అంశం. డేటా భద్రత, దాని వినియోగంలో నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో పాటు, అనుమతి లేకుండా నిఘా కార్యకలాపాలకు ఈ టెక్నాలజీని ఉపయోగించబోమనే భరోసా ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వ విభాగాలకు ఎలాంటి నియంత్రణ అధికారాలు ఉండాలనే అంశాన్ని స్పష్టంగా నిర్దేశిస్తేనే ప్రజలకు భరోసా ఏర్పడుతుంది. పార్లమెంటరీ విధానంలో ప్రభుత్వాలకు నియంత్రణ అధికారాలు ఇవ్వాలి..’అని కేటీఆర్ సూచించారు. టెక్నాలజీని సరైన రీతిలో ఉపయోగించాలి ‘ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా నేరస్తులు, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడం పోలీసులకు సులభమవుతుంది. దీనిద్వారా నేరాల నియంత్రణ, సమర్థ పోలీసింగ్ సాధ్యమవుతుందని ప్రభుత్వాలు అర్థం చేసుకుంటున్నాయి. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలి. ఈ టెక్నాలజీని సరైన రీతిలో ఉపయోగిస్తే పోలీసులతో పాటు ప్రజలకు కూడా విస్తృత ప్రయోజనాలు కలుగుతాయి. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా సేకరించే డేటా, ఇతర ఫలితాలను ప్రజలతో పంచుకున్నపుడే ఈ ప్రక్రియ విజయవంతం అవుతుంది..’అని మంత్రి వ్యాఖ్యానించారు. చర్చాగోష్టిలో నిప్పన్ ఎలక్ట్రిక్ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ తకయుకి మోరిట, ఉషాహిది సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఈడీ ఎంజీ నికోల్, ఎడ్జ్టెక్ సీఈఓ కోయెన్వాన్ ఓస్ట్రోమ్ పాల్గొన్నారు. అలాగే దావోస్ వేదికగా డెలాయిట్ గ్లోబల్ సీఈఓ పునీత్ రంజన్ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. డిజిటల్ హెల్త్, డిజిటల్ ఎడ్యుకేషన్, వాతావరణ మార్పు అంశాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై చర్చించారు. నోవార్టిస్ విస్తరణ ప్రణాళికలు ‘అనేక దేశాల్లో తయారీ యూనిట్లతో పాటు పరిశోధన కేంద్రాలను కలిగిన నోవార్టిస్ హైదరాబాద్‌లో కంపెనీ విస్తరణ ప్రణాళికలు రూపొందిస్తోంది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళ జాతి ఫార్మా కంపెనీల్లో నోవార్టిస్ సామర్థ్యం అతిపెద్దది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నోవార్టిస్ కార్యాలయం 9వేల మంది ఉద్యోగులతో రెండో అతిపెద్ద కార్యాలయంగా మారింది. హైదరాబాద్‌లోని ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల వల్లే ఇది సాధ్యమైంది.’అని నోవార్టిస్ సీఈఓ వాస్ నరసింహన్ దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ సందర్భంగా వ్యాఖ్యానించారు. సోదరుడు వైఎస్ జగన్‌తో భేటీ అద్భుతం డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కేటీఆర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వైఎస్ జగన్‌తో దిగిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ‘నా సోదరుడు ఏపీ సీఎం జగన్‌తో భేటీ అద్భుతంగా జరిగింది..’అని మంత్రి ట్వీట్ చేశారు. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేతోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ ఐటీ, లైఫ్‌సైన్సెస్ రంగంపై ఆదిత్య ఠాక్రే ఆసక్తి చూపగా, పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ చేపట్టిన హరితహారం, పంచాయతీరాజ్ చట్టంలో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించడం గురించి కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు త్వరలో హైదరాబాద్ రానున్నట్లు ఆదిత్య థాకరే తెలిపారు. ఏపీ లోక్‌సభ సభ్యులు మిథున్‌రెడ్డి, ఎన్ఈసీ కార్పొరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నొరిహికో ఇషిగురో, భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ భారతి మిట్టల్, వైస్ చైర్మన్ రాజన్ భారతి మిట్టల్, హెచ్‌సీఎల్ ఎండీ విజయ్ గుంటూరు, భారత్ ఫోర్జ్ డిప్యూటీ ఎండీ అమిత్ కళ్యాణిలు కేటీఆర్‌ను కలిశారు. ఆశీర్వాద్ రూ.500 కోట్ల పెట్టుబడి తెలంగాణలో రూ.500 కోట్లు పెట్టుబడితో 500 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలని ఆశీర్వాద్ పైప్స్ (ఎలియాక్సిస్) నిర్ణయించింది. ఈ మేరకు దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో మంగళవారం ఒప్పందం కుదిరింది. తెలంగాణలో ఏర్పాటు చేసే ప్లాంట్ ద్వారా స్టోరేజి, డిస్ట్రిబ్యూషన్ పైప్స్, ఫిట్టింగ్స్ వంటి ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారు చేస్తామని కంపెనీ సీఈఓ కోయిన్ స్టికర్ వెల్లడించారు. ఉత్పత్తులను దేశీయ మార్కెట్‌కే పరిమితం చేయకుం డా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. -
దావోస్ WEF సదస్సులో ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పీచ్
-
తెలంగాణలో రూ.500 కోట్లతో లులూ పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు లులూ గ్రూపు ముందుకు వచ్చింది. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే ఒక ఉత్పత్తి యూనిట్ కలిగి ఉన్న స్పెయిన్ కంపెనీ ‘కిమో ఫార్మా’రూ.100 కోట్ల పెట్టుబడితో మరో యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపింది. స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగ కంపెనీ ‘స్విస్ రే’నగరంలో తన కార్యాలయాన్ని ప్రారంభించనుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు తొలిరోజు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుతో చర్చలు జరిపిన అనంతరం ఈ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో మరోచోట యూనిట్: లులూ అధినేత దావోస్‌లో కేటీఆర్.. లులూ గ్రూప్ అధిపతి యూసుఫ్ అలీతో సమావేశమై చర్చలు జరిపారు. రూ.500 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు యూసుఫ్ ముందుకు రాగా, దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతుల పత్రాలను మంత్రి అక్కడికక్కడే అందజేశారు. రాష్ట్రంలో మరోచోట సైతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని యూసుఫ్ తెలిపారు. తమ యూనిట్లకు త్వరలోనే శంకుస్థాపన నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి యూరప్ వంటి దేశాలకు ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో తమ యూనిట్ ఉండనుందన్నారు. తెలంగాణలో భారీ కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించనున్నామని, హైదరాబాద్‌లో పలు స్థలాలను కూడా ఎంపిక చేశామని, యజమానులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. నగరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో షాపింగ్ మాల్ నిర్మించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయోత్పత్తులు, అనుబంధ రంగాల ఉత్పత్తులకు డిమాండ్ పెంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, లులూ గ్రూప్ అంతర్జాతీయ స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో ఇది సాకారం కానుందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 250 మందితో ‘స్విస్ రే’ కార్యాలయం రాష్ట్రంలో నైపుణ్యం గల మానవ వనరుల లభ్యతను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ‘స్విస్ రే’గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వెరోనికా స్కాట్టి బృందం మంత్రి కేటీఆర్‌తో జరిపిన చర్చల సందర్భంగా సంసిద్ధత వ్యక్తం చేసింది. తొలుత 250 మంది ఉద్యోగులతో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, దశల వారీగా ఈ సంఖ్యను మరింతగా పెంచుకుంటూ వెళ్తామని వెరోనికా తెలిపారు. సంస్థ డేటా, డిజిటల్ విభాగాలను బలోపేతం చేయడం, బీమా ఉత్పత్తులను రూపొందించడం, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై తమ హైదరాబాద్ కార్యాలయం పనిచేస్తుందని చెప్పారు. ఇన్నోవేషన్, ఇతర సహకారం కోసం టీ–హబ్‌తో భాగస్వామ్యానికి సైతం సంసిద్ధత వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కిమో ఏపీఐ యూనిట్ కిమో ఫార్మా 2018లో నగరంలో క్వాలిటీ కంట్రోల్, స్టెబిలిటీ ల్యాబ్స్ వంటి విభాగాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. కాగా రూ.100 కోట్లతో తమ రెండో ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేస్తామని కిమో గ్రూప్ డైరెక్టర్ జీన్ డానియల్ బోనీ మంత్రి కేటీఆర్‌తో జరిపిన చర్చల సందర్భంగా వెల్లడించారు. భవిష్యత్తులో ఆక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్ (ఏపీఐ) ఉత్పత్తి యూనిట్‌తో పాటు పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నగరంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీషో’ ఈ–కామర్స్ భారీ పెట్టుబడి: కేటీఆర్ ట్వీట్ ఈ–కామర్స్ పరిశ్రమ ‘మీషో’ హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చిందని, ద్వితీయ శ్రేణి నగరాల్లో రిటైల్ సేల్స్‌పై దృష్టి పెట్టనుందని కేటీఆర్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. డబ్ల్యూఈఎఫ్‌లో వచ్చిన మరో భారీ పెట్టుబడి ఇది అని తెలిపారు. -
లైఫ్‌సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో లైఫ్‌సైన్సెస్ (జీవశాస్త్ర) రంగానికి ప్రాధాన్యత మరింత పెరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ రంగంలో ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని నిలబడేందుకు భారత్‌లో విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమని అన్నా రు. భారత్‌లో ఈ రంగం పురోగతికి అవసరమైన విధానాలకు అంతగా మద్దతు లభించడం లేదని చెప్పారు. అదే సమయంలో లైఫ్‌సైన్సెస్ రంగానికి హైదరాబాద్ రాజధానిగా మారిందని తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా లైఫ్‌సైన్సెస్ రంగానికి సంబంధించి.. ‘తెలంగాణ: ఆసియాలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు కీలక స్థానం’అనే అంశంపై సోమవారం జరిగిన చర్చలో కేటీఆర్ పాల్గొన్నారు. ఐటీ, ఫార్మా రంగాలు కలిసి పనిచేయాలి తెలంగాణలో లైఫ్‌సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ఏర్పాటు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించడం లేదని మంత్రి విమర్శించారు. కొత్త ఆవిష్కరణలకు ఊతమివ్వడం ద్వారానే ఈ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్తులో లైఫ్‌సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలు ప్రయోగశాలను దాటి డిజిటల్ డ్రగ్ డిస్కవరీ (ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ఔషధాల ఆవిష్కరణ) వైపు పయనిస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ, ఫార్మా రంగాలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని సూచించారు. సులభతర విధానాలు అవసరం భారత్‌లో పరిశోధన, అభివృద్ధి రంగాల్లో విదేశీ పెట్టుబడులకు వీలుగా సులభతర విధానాలు అవసరమని, ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. వచ్చే దశాబ్దం పాటు భారత్ లైఫ్‌సైన్సెస్ రంగం అభివృద్ధి పథంలో నడిచే అవకాశముందని, ఔషధ తయారీ సంస్థలు ప్రస్తుతమున్న మందుల తయారీకే పరిమితం కాకుండా, కొత్త మందులను తయారు చేసే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత్‌లో నైపుణ్యానికి కొదవలేదని, లైఫ్‌సైన్సెస్ రంగంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణలో లైఫ్‌సైన్సెస్ రంగంలోని ఔత్సాహిక పరిశోధకులకు సహకారం అందించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తోందని తెలిపారు. ఈ చర్చాగోష్టిలో కేటీఆర్‌తో పాటు డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెందిన జీవీ ప్రసాద్‌రెడ్డి, పీడబ్ల్యూసీకి చెందిన మహమ్మద్ అథర్ పాల్గొన్నారు. -
దావోస్‌లో యంగ్ అచీవర్స్‌తో మంత్రి కేటీఆర్ మాటామంతి
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లండన్ నుంచి జ్యూరీచ్ మీదుగా దావోస్‌కి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన వెంటనే ఇండియన్ స్టార్టప్ కల్చర్‌కి బూస్ట్ తెచ్చిన యంగ్ అచీవర్స్‌ను పర్సనల్‌గా కలుసుకున్నారు. ఆన్లైన్ స్టాక్‌మార్కెట్ బ్రోకింగ్ ఏజెన్సీ జెరోదా ఫౌండర్ నితిన్ కామత్, మీషో ఫౌండర్ విదిత్‌ఆత్రేలను కలుసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి భోజనం చేస్తూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్విస్‌రే ముఖ ఇన్సురెన్సు సంస్థ స్విస్‌రే తెలంగాణలో మరిన్ని రంగాల్లో విస్తరించేందుకు సుముఖత వ్యక్తం చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గతేడాది ఆగస్టులో స్విస్ రే సంస్థ సుమారు 250 మంది సిబ్బందితో హైదరాబాద్‌లో ఇన్సురెన్సు సేవలు ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఉన్న బీఎస్ఎఫ్ఐ ఎకోసిస్టమ్ ప్రోత్సహాకరంగా ఉండటంతో ఇక్కడే డిజిటల్, డేటా, ప్రొడక్ట్ మోడలింగ్, రిస్క్ మేనేజ్మెంట్ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. 160 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కంపెనీ 80 దేశాల్లో సర్వీసులు అందిస్తోంది. Happy to announce a big addition to Hyderabad BFSI ecosystem A big welcome to @SwissRe who will be setting up their office in Hyderabad this August Swiss Re is a 160 year old insurance organisation, headquartered in Zurich, Switzerland and operates in 80 locations globally pic.twitter.com/1bpRA6vNX1 — KTR (@KTRTRS) May 23, 2022 చదవండి: ఏపీలో ప్రతీ కుటుంబానికి ‘ఫ్యామిలీ డాక్టర్’ - డబ్ల్యూఈఎఫ్ సదస్సులో వైఎస్ జగన్ -
వరల్డ్ ఎకనామిక్ ఫోరం: ప్రముఖులతో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకి హాజరయ్యారు. ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు సీఎం జగన్‌తో పాటు మంత్రులు దావోస్ సదస్సుకు వెళ్లారు. అందులో భాగంగా సమావేశం తొలిరోజు సీఎం జగన్.. డబ్ల్యూఈఎఫ్(WEF) హెల్త్ విభాగాధిపతి శ్యాం బిషేన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. ఆయనతో ఆరోగ్య రంగంపై చర్చించారు. అనంతరం, డబ్ల్యూఈఎఫ్ మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో డబ్ల్యూఈఎఫ్‌లో ప్లాట్‌ఫాం పార్టనర్‌షిప్‌పై ఒప్పందం చేసుకున్నారు. సదస్సులో భాగంగానే బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్ పాల్ బక్నర్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. సీఎం జగన్‌ను మహారాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఆదిత్య ఠాక్రే మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, సీఎం జగన్‌తో అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతం అదానీ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో సమావేశమయ్యారు. అదే సమయంలో దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం జ్యోతిప్రజ్వాలన చేశారు. ఏపి పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఇది కూడా చదవండి: వరల్డ్ ఎకనామిక్ ఫోరం: ఏపీ పెవిలియన్ ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
6 అంశాల్లో సహకారంపై WEF - రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం
-
ఏపీలో అవకాశాలపై విశ్వ వేదికన చర్చ
సాక్షి, అమరావతి: నాలుగో పారిశ్రామిక విప్లవం (ఇండస్ట్రియలైజేషన్ 4.0) దిశగా చేపట్టాల్సిన చర్యలపై దావోస్‌లో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సు వేదికగా చర్చించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఆ సదస్సులో పారిశ్రామికవేత్తలు, ఆర్థిక వేత్తలకు వివరించనున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల 2020, 2021లో డబ్ల్యూఈఎఫ్ సదస్సులు ప్రత్యక్షంగా నిర్వహించలేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈనెల 22 నుంచి 26 వరకు దావోస్‌లో ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు మంత్రులు, అధికారుల బృందంతో కలిసి సీఎం వైఎస్ జగన్ శుక్రవారం విజయవాడ నుంచి బయలుదేరి, రాత్రికి దావోస్‌కు చేరుకోనున్నారు. కరోనా మహమ్మారి వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని దావోస్ వేదికగా సీఎం నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం వివరించనుంది. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను అధిగమించేందుకు చేసే ప్రయత్నంలో ఈ వేదిక ద్వారా ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం కానుంది. కోవిడ్ నియంత్రణ నుంచి సుపరిపాలన దాకా.. కరోనా మహమ్మారి నియంత్రణలో రాష్ట్రం అనుసరించిన వ్యూహాన్ని దావోస్ వేదికపై సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందం వినిపించనుంది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ద్వారా కరోనా కట్టడికి చేసిన విశేష ప్రయత్నాలను తెలియజెప్పనుంది. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు, çసమగ్ర సామాజికాభివృద్ధిలో భాగంగా నవరత్నాల అమలు, అధికార వికేంద్రీకరణ – సుపరిపాలన, భవిష్యత్ తరాల కోసం విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించనుంది. సంప్రదాయేతర ఇంధన వనరుల రంగం, పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి తదితర అంశాలపైనా ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందం దృష్టి సారించనుంది. కాలుష్యం లేని వ్యవస్థే లక్ష్యం కాలుష్యం లేని పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేయాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే అంశాన్ని ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందం ప్రధానంగా వివరించనుంది. పారిశ్రామికీకరణలో భాగంగా నాలుగో విప్లవం దిశగా ప్రపంచం కదులుతున్న నేపథ్యంలో.. దానిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. కాలుష్య రహిత విధానాలతో ఉత్పత్తులు సాధించడం, అందుకు తగిన విధంగా వ్యవస్థలను రూపొందించుకోవడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంలో భాగంగా ఇంటర్ కనెక్టివిటీ, రియల్ టైం డేటా, యాంత్రీకరణ, ఆటోమేషన్‌లకు పారిశ్రామికీకరణలో చోటు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీనిపై విస్తృతంగా జరిగే చర్చల్లో రాష్ట్ర బృందం పాల్గొననుంది. పెట్టుబడులకు స్వర్గధామం ఇండిస్ట్రియలైజేషన్ 4.0కు సరైన వేదికగా నిలిచేందుకు రాష్ట్రానికి ఉన్న వనరులు, అవకాశాలను కూడా ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందం వివరించనుంది. పారిశ్రామికీకరణ దిశగా కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను కూడా వివరించనున్నారు. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు అదనంగా మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టుల నిర్మాణం, కొత్తగా మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, నిర్మాణం వంటి వాటి ద్వారా ఇండస్ట్రియలైజేషన్ 4.0కు ఏ రకంగా దోహదపడుతోందో విశదీకరిస్తారు. బెంగళూరు – హైదరాబాద్, చెన్నై – బెంగుళూరు, విశాఖపట్నం – చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ఈ సదస్సు ద్వారా వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తల ముందు ఉంచుతారు. పరిశ్రమల కోసం సుశిక్షితులైన మానవ వనరుల నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్న తీరును కూడా వివరిస్తారు. పీపుల్ – ప్రోగ్రెస్ – పాజిబిలిటీస్ పారిశ్రామిక వ్యూహాల్లో తీసుకురావాల్సిన మార్పులపై కూడా దావోస్ వేదికగా రాష్ట్రం చర్చించనుంది. నేరుగా ఇంటి గుమ్మం వద్దకే ఉత్పత్తులు చేరవేసే విధానాన్ని మరింత బలోపేతం చేయడం, దాన్ని డిజిటలైజేషన్‌తో అనుసంధానించడం.. రాష్ట్రంలో ఉత్పత్తి రంగాన్ని మరింత వృద్ధి చేయడం, ఎగుమతులకు అవసరమైన నాణ్యతతో వస్తు ఉత్పత్తులు తయారు చేయడానికి తగిన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలకు సంబంధించి అత్యుత్తమ సంస్థల భాగస్వామ్యంపై దృష్టి పెట్టనుంది. ఈ అంశాలను వివరిస్తూ దావోస్‌లో ‘పీపుల్ – ప్రోగ్రెస్ – పాజిబిలిటీస్’ నినాదంతో ఏపీ పెవిలియన్ నిర్వహిస్తోంది. కీలక అంశాల్లో భాగస్వామ్యం ప్రపంచ వ్యాప్తంగా హాజరయ్యే ప్రతినిధులతో కూడిన దావోస్ సదస్సు పలు కీలక అంశాలపై దృష్టి పెట్టనుంది. ఆహారం – వాతావరణ మార్పులు, సాంకేతిక రంగంలో వినూత్న ఆవిష్కరణలు, సుపరిపాలన, సైబర్ సెక్యూరిటీ, అంతర్జాతీయ సహకారం – పునర్ నిర్మాణం, ఆర్థిక వ్యవస్థలో సమతుల్యత, అందరికీ ఆరోగ్యంపై జరిగే చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కానుంది. -
మందగమనం తాత్కాలికమే..
దావోస్ (స్విట్జర్లాండ్): భారత్‌లో వృద్ధి మందగమనం తాత్కాలికమేనని, ఇకపై వృద్ధి పుంజుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా అన్నారు. శుక్రవారం దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 2019 అక్టోబర్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంచనాలు ప్రకటించినప్పటితో పోలిస్తే 2020 జనవరిలో మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. అమెరికా–చైనా మధ్య తొలి దశ ఒప్పందంతో తగ్గుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, సమకాలిక పన్ను కోతలు తదితర అంశాలు సానుకూల పరిస్థితులకు దారితీసినట్టు చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 3.3 శాతం వృద్ధి రేటు అన్నది అద్భుతమేమీ కాదన్నారు. ‘‘ఇప్పటికీ వృద్ధి నిదానంగానే ఉంది. అయితే పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరింత దూకుడైన ద్రవ్య విధానాలు అవసరం. నిర్మాణాత్మక సంస్కరణలు కావాలి. మరింత చైతన్యం కావాలి’’ అని జార్జీవా పేర్కొన్నారు. వర్ధమాన మార్కెట్లలో ఒక్క భారత మార్కెట్‌నే తాము డౌన్‌గ్రేడ్ చేశామని, అది కూడా తాత్కాలికమేనని చెప్పారు. రానున్న కాలంలో పరిస్థితులు మెరుగుపడతాయన్నారు. వర్ధమాన దేశాల్లో ఇండోనేషియా, వియత్నాంను ఆశాకిరణాలుగా పేర్కొన్నారు. చాలా ఆఫ్రికా దేశాలు కూడా మంచి పనితీరు చూపిస్తున్నాయని, అదే సమయంలో మెక్సికో వంటి దేశాల పనితీరు ఆశావహంగా లేదన్నారు. తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం, దీర్ఘకాలంగా తయారీ వృద్ధి బలహీనంగా ఉండడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా ఆమె పేర్కొన్నారు. ఎన్నో అంశాలపై ప్రగతి... డబ్ల్యూఈఎఫ్ 50 వార్షిక సదస్సు విశేషమైనదిగా సంస్థ ప్రెసిడెంట్ బోర్గేబ్రెండే పేర్కొన్నారు. ఎన్నో అంశాలపై ప్రగతిని సాధించినట్టు చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ/ప్రైవేటు సహకారం అన్నది ఎంతో కీలకమైనదిగా అభివర్ణించారు. అంతర్జాతీయంగా సమ్మిళిత, స్థిరమైన వృద్ధి కోసం ఓఈసీడీతో కలసి పనిచేస్తామని ప్రకటించారు. 2030కి లక్ష కోట్ల చెట్ల సంరక్షణ, పెంపకం లక్ష్యానికి సహకరిస్తామని, నాలుగో పారిశ్రామిక విప్లవానికి వీలుగా పునఃనైపుణ్య శిక్షణ తదితర కార్యక్రమాలను ప్రకటించారు. టాటా స్టీల్‌కు డబ్ల్యూఈఎఫ్ గౌరవం గ్లోబల్ లైట్‌హౌస్ నెట్‌వర్క్‌లో చేరినందుకు టాటా స్టీల్ కళింగనగర్ను డబ్ల్యూఈఎఫ్ సత్కరించింది. టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ అవార్డును అందుకున్నట్టు కంపెనీ తెలిపింది. గోయల్ కీలక భేటీలు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ డబ్ల్యూఈఎఫ్ సదస్సు సందర్భంగా శుక్రవారం పలు కీలక నేతలతో చర్చలు జరిపారు. సమగ్రాభివృద్ధి, పారదర్శకత దిశగా సంస్కరణలకు భారత్ సిద్ధంగా ఉందని డబ్ల్యూటీవో చీఫ్ రాబర్టో అజవేదోతో చెప్పారు. ఈయూ వాణిజ్య కమిషనర్ ఫిల్ హోగన్, ప్రముఖ ఆర్థికవేత్త మేఖేల్ స్పెన్స్, బ్లాక్‌స్టోన్ గ్రూపు చైర్మన్ ష్వార్జ్‌మాన్, ఏబీబీ చైర్మన్ పీటర్ వోసర్ తదితరులతోనూ గోయల్ చర్చించారు. ప్రపంచ వృద్ధి అంచనాలు సవరణ సవరించిన ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసింది. 2019 సంవత్సరానికి వృద్ధి రేటు 2.9 శాతానికి సవరించిం ది. 2020లో ఇది 3.3 శాతంగా ఉంటుందని పేర్కొంది. 2021లో 3.4 శాతానికి పెరుగు తుందని అంచనా వేసింది. -
‘అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశమే’
దావోస్ : వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా డబ్ల్యూటీవోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ దేశం పట్ల డబ్ల్యూటీవో న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. చైనా, భారత్‌లను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చూస్తున్న అంతర్జాతీయ వాణిజ్య సంస్థ అమెరికాను మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించడం లేదని వ్యాఖ్యానించారు. తమ దేశాన్ని సరిగ్గా ట్రీట్ చేయని డబ్ల్యూటీవో తీరుపై తాను కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నానని, చైనా..భారత్‌లను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చూస్తున్న ఈ సంస్థ తమను ఎందుకు అలా చూడటం లేదని ప్రశ్నించారు. దావోస్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో అమెరికా సైతం అభివృద్ధి చెందుతున్న దేశమేనని, తమను ఇలా చూడకుండా, భారత్..చైనాలనే అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చూడటంతో ఆ దేశాలు భారీ ప్రయోజనాలను దక్కించుకుంటున్నాయని రుసరుసలాడారు. ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలైతే తమదీ అభివృద్ధి చెందుతున్న దేశమని గుర్తించాలని అన్నారు. డబ్ల్యూటీవో ఈ దిశగా నూతన విధానం చేపట్టకపోతే..తాము ఏదో ఒకటి చేయాల్సి వస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాకు డబ్ల్యూటీవో అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. చదవండి : కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తా -
5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ సాధ్యమే
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు భారత్‌లో పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి గురుప్రసాద్ మహాపాత్ర వెల్లడించారు. పటిష్టమైన విధానాలు అమలు చేస్తున్న ప్రభుత్వ సారథ్యంలో ఈ లక్ష్యం సులభసాధ్యమేనని గురువారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం భారత ఆర్థిక సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ‘అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెట్టిన భారత్.. 2024 నాటికల్లా 5 లక్షల కోట్ల డాలర్లు, 2030 నాటికి 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని నిర్దేశించుకుంది. ఇది కచ్చితంగా సాధ్యమే. ఇటు రాష్ట్రాలు, అటు కేంద్రం స్థాయిలో ప్రభుత్వాలు పటిష్టమైన విధానాలు అమలు చేస్తుండటంతో ఇందుకు పూర్తి అనువైన పరిస్థితులు ఉన్నాయి’ అని మహాపాత్ర తెలిపారు. కాగా, అధిక వృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టబోతోందని నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. మరోవైపు, చౌక ధరలు, డిస్కౌంట్లతో పోటీ సంస్థలను దెబ్బకొట్టేందుకు ఈ–కామర్స్ వేదికను విదేశీ కంపెనీలు ఉపయోగించరాదని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. విదేశీ ఈ–రిటైల్ కంపెనీలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయన్నే ఆందోళనల నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వం మరింత ఊతం ఇవ్వాలి.. పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం మరింత ఊతం ఇవ్వాలని గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్ చెప్పారు. మందగిస్తున్న ఎకానమీ వృద్ధి రేటుకు తోడ్పాటునిచ్చేలా వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇవి ద్రవ్య లోటును పెంచేవే అయినా తప్పక తీసుకోవాల్సిన చర్యలని గోద్రెజ్ చెప్పారు. అటు, ఇంటర్నెట్ సేవల ప్రయోజనాలు అందరికీ సమానంగా అందాలని, ప్రాంతీయ భాషల్లో మరింత కంటెంట్ అందుబాటులోకి రావాలని ఐటీ దిగ్గజం విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు. హువావేకు ఎయిర్టెల్ మిట్టల్ బాసట భద్రతాపరమైన అంశాల పేరిట చైనా సంస్థ హువావేను ప్రపంచ దేశాలు నిషేధించేలా అమెరికా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ ఆ కంపెనీకి బాసటగా నిల్చారు. హువావే ఉత్పత్తులు అధునాతనమైనవని, పోటీ సంస్థల ఉత్పత్తులతో పోలిస్తే ఎన్నో రెట్లు ఉత్తమమైనవని ఆయన చెప్పారు. 5జీ సేవలకు సంబంధించి హువావే కచ్చితంగా బరిలో ఉండాల్సిందేనని మిట్టల్ చెప్పారు. అయితే, భద్రతాపరమైన రిస్కుల వల్లే హువావేని వ్యతిరేకిస్తున్నామని, రక్షణాత్మక ధోరణులకు.. దీనికి సంబంధం లేదని అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ స్పష్టం చేశారు. -
అలా అయితే నీకు పెళ్లికాదు; ఇంక చాలు!
న్యూఢిల్లీ : ‘ఆటలు ఆడితే నిన్నెవరూ పెళ్లి చేసుకోరు’ అంటూ క్రీడల్లోకి రాకుండా ఆడపిల్లల్ని నిరుత్సాహ పరచవద్దని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సూచించారు. మహిళా క్రీడా ప్రపంచంలో తాను భాగస్వామినైనందుకు గర్వపడుతున్నానన్నారు. పురుషులతో పాటుగా మహిళలకు సమానమైన అవకాశాలు రానప్పటికీ.. నేడు ఎంతో మంది మహిళామణులు తమ దేశ కీర్తి పతాకను ఎగురవేస్తున్నారని పేర్కొన్నారు. ఇక సమాన అవకాశాలు లభిస్తే ఆకాశమే హద్దుగా చెలరేగి... తమ ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే ఇందుకు సమాజంతో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, బంధువుల ఆలోచనాసరళిలో మార్పు వచ్చినపుడే అమ్మాయిలు క్రీడల్లో రాణిస్తారని అభిప్రాయపడ్డారు. చిన్నపుడు పీటీ ఉషను చూసి స్ఫూర్తి పొందానని.. ప్రస్తుతం పీవీ సింధు, సైనా నెహ్వాల్, దీపా కర్మాకర్ వంటి ఎంతో మంది క్రీడారంగంలో తమదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా.. ‘మహిళలు- నాయకత్వం’ అనే అంశం మీద గురువారం జరిగిన ప్యానల్ డిస్కషన్స్‌లో ఐక్యరాజ్యసమితి దక్షిణాసియా మహిళా గుడ్‌విల్ అంబాసిడర్ సానియా మీర్జా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ నాకు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచీ వింటున్నా. ఎండలో ఆడితే నల్లబడతావు. అప్పుడు నిన్నెవరూ పెళ్లి చేసుకోరు అంటూ బంధువులు నన్ను బెదిరించేవారు. ప్లీజ్... తల్లిదండ్రులు, చుట్టాలు, ఆంటీలు, అంకుళ్లు అందరికీ ఓ విఙ్ఞప్తి. ఇలాంటి మాటలు చెప్పి ఆడపిల్లల్ని వెనక్కిలాగకండి. చిన్నతనంలో ఇటువంటి మాటలు విన్నపుడు నిజంగానే వాళ్లు చెప్పినట్లు జరుగుతుందా అనే చిన్న సందేహం ఉండేది. తెల్లగా ఉంటేనే అందం.. అందం ఉంటేనే పెళ్లి అనే మాటలు చెప్పే సంస్కృతి పోవాలి. అమ్మాయిలకు ఆత్మవిశ్వాసమే నిజమైన అందం అని ప్రతీ ఒక్కరూ గుర్తించాలి అని విఙ్ఞప్తి చేశారు. మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? ‘ఒకానొక రోజు ముంబై ఎయిర్‌పోర్టులో ఉన్న సమయంలో ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. మాతృత్వాన్ని బాగా ఆస్వాదిస్తున్నారా. తల్లిగా మీరు చాలా బాగున్నారు. మీతో ఒక ఫొటో తీసుకోవచ్చా అని అడిగాడు. నేను సరే అన్నాను. వెంటనే మీ కొడుకు ఎక్కడ తన ఫొటో కూడా కావాలి అన్నాడు. లేదు తను హైదరాబాద్‌లో ఉన్నాడని నేను చెప్పగానే.. తన ముఖంలో రంగులు మారిపోయాయి. అదేంటి మీ కొడుకు మీతో పాటే ఉండాలిగా అన్నాడు. నేను కూడా తనను అదే ప్రశ్న అడిగాను. తను ఇంటి దగ్గర ... నా భార్య దగ్గర ఉన్నాడు. అయినా నేను వెళ్లే ప్రతీ చోటుకు తనను తీసుకువెళ్లలేను అని సమాధానమిచ్చాడు. అపుడే అతడి మనస్తతత్వం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది’ అంటూ సానియా తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చారు. కాగా టెన్నిస్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన సానియా... పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రీడాజంట గతేడాది ఇజహాన్ అనే మగపిల్లాడికి జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో సానియా కొంతకాలంగా ఆటకు విరామమిచ్చారు. -
దావోస్‌లో ఏపీ లాంజ్ ఖర్చు రూ.17 కోట్లు
సాక్షి, అమరావతి: ‘‘నా ప్రతిభను ప్రపంచ దేశాలు గుర్తించాయి. అందుకే దేశంలో ఏ ముఖ్యమంత్రినీ పిలవని విధంగా కేవలం నన్ను మాత్రమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సమావేశాలకు పిలుస్తారు’’... ఇవీ చంద్రబాబు నాయుడు తరచూ చెప్పే మాటలు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, డబ్ల్యూఈఎఫ్ సదస్సులకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబును ప్రత్యేకంగా ఎప్పుడూ పిలవలేదని, ఆయనే రూ.కోట్లు ఖర్చు పెట్టి టిక్కెట్లు కొనుక్కొని వెళ్లినట్లు సాక్ష్యాలతో సహా బయటపడింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ) ద్వారా దావోస్‌లో రూ.కోట్లు పెట్టి లాంజ్‌లను కొనుగోలు చేసి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వానికి సీఐఐ సమర్పించిన బిల్లులే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. దావోస్‌లో లాంజ్‌ను కొనుగోలు చేయడానికి ఎంత మొత్తం చెల్లించాలో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకు(ఏపీఈడీబీ) రాసిన లేఖలో సీఐఐ వివరంగా పేర్కొంది. ఆ మొత్తాన్ని చెల్లించమని కోరింది. రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేసిన లాంజ్ల్లో సీఐఐ ద్వారా సమావేశాలు నిర్వహించి, తనను చూసి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటూ చంద్రబాబు ప్రచారం చేసుకునేవారు. 2019 జనవరిలో జరిగిన దావోస్ సమావేశాలకు అయిన ఖర్చు రూ.14.41 కోట్లు చెల్లించాలంటూ సీఐఐ బిల్లు సమర్పించింది. దీనిపై 18 శాతం జీఎస్టీ, ఇతర సుంకాలను కలిపితే ఈ మొత్తం రూ.17 కోట్లు దాటుతోంది. ఇందులో కేవలం ఏపీ లాంజ్ అద్దె రూ.2.48 కోట్లు. ఆ లాంజ్‌ను కంప్యూటర్లు, సోఫాలతో అందంగా తీర్చిదిద్దినందుకు రూ.2.51కోట్లు, నాలుగు రోజుల భోజనాలకు రూ.1.05 కోట్లు బిల్లు వేసింది. విచిత్రం ఏమిటంటే ఎల్ఈడీ తెరకు ఏకంగా రూ.1.45 కోట్ల బిల్లు వేశారు. 2018 సమావేశాలకు కూడా సీఐఐ రూ.9.86 కోట్ల బిల్లును సమర్పించింది. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారు. ప్రత్యేక విమానాలు,బస ఖర్చులు అదనం ఇవి కేవలం దావోస్‌లో లాంజ్ ఏర్పాటు, అక్కడి సమావేశాలకు అయిన ఖర్చు మాత్రమే. ఇది కాకుండా చంద్రబాబు తన మందీ మార్బలంతో వెళ్లిన ప్రత్యేక విమానాలు, బస వంటి ఖర్చులు కలుపుకుంటే ఈ వ్యయం రెండింతలవుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చంద్రబాబు ఏటా క్రమం తప్పకుండా దావోస్ సమావేశాలకు హాజరై, రూ.వేల కోట్ల పెట్టుబడులు, భారీగా పరిశ్రమలు వస్తున్నాయంటూ ప్రచారం చేశారు. కానీ ఇందులో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. సీఐఐ దావోస్ బిల్లు కాపీ