'170 ఏళ్లయినా వారికది సాధ్యం కాదు'
'170 ఏళ్లయినా వారికది సాధ్యం కాదు'
Published Wed, Oct 26 2016 5:40 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
మహిళలు, పురుషులతో సమానంగా పోటీపడుతున్నారు. అన్ని రంగాల్లో తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఆర్థిక సమానత్వం పొందడాన్ని కూడా మహిళలు ఛాలెంజింగ్గా తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. కానీ 170 ఏళ్లైనా పురుషులతో సమానంగా మహిళలు ఆర్థిక సమానత్వం సాధించలేరని డబ్ల్యూఈఎఫ్ తేల్చేసింది. యాన్యువల్ జెండర్ గ్యాంప్ ఇండెక్స్ పేరుతో మంగళవారం విడుదల చేసిన రిపోర్టులో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఈ విషయాలు వెల్లడించింది. ఉద్యోగాల్లో, సంపాదనల్లో స్త్రీ, పురుషుల మధ్య ఉన్న తేడాలు తగ్గడం గతేడాది నుంచి నెమ్మదించాయని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది.
2186 ఏడాది వచ్చినా స్త్రీ, పురుషులు ఆర్థిక సమానత్వం పొందరని ఈ రిపోర్టు తేల్చింది. ఈ రిపోర్టు అంచనాలు, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ రిపోర్టు వెలువరించామని, ఆర్థిక సమానత్వం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని డబ్ల్యూఈఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సాహిదా జాహిది తెలిపారు. 144 దేశాలతో రూపొందిన ఈ రిపోర్టులో ఐస్ల్యాండ్, ఫిన్ల్యాండ్లు ముందజంలో ఉన్నాయని పేర్కొన్నారు. యెమెన్, సిరియా, సౌదీ అరేబియా, ఇరాన్ దేశాలు ఈ ప్రొగ్రెస్లో కిందస్థానంలో ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. విద్య, ఆరోగ్యం, ఆర్థికావకాశాలు, రాజకీయ సాధికారిత, జీవానోపాధి వంటి అంశాలతో దేశాలు ఏ మేరకు అభివృద్ధి సాధించాయో లెక్కించామని వివరించారు.
రాజకీయ సాధికారిత తేడాను ప్రస్తావించిన డబ్ల్యూఈఎఫ్, అమెరికాలో జరుగబోతున్న ఎన్నికల్లో మొదటి మహిళా అధ్యక్షురాలుగా హిల్లరీ క్లింటన్ విజయం సాధించబోతున్నారని తెలిపింది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటనే ముందజలో ఉన్నట్టు పేర్కొంది. రాజకీయ సాధికారితలో అమెరికా 73వ స్థానంలో నిలిచింది. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో స్త్రీ, పురుషుల మధ్య ఉన్న తేడాను బట్టి ఈ గణాంకాలను వివరించింది. గ్లోబల్గా పొలిటికల్ జెండర్ గ్యాప్ నెమ్మదిగా తొలుగుతుందని, ఈ తేడా మెరుగుపడుతున్నట్టు తెలిపింది. మొత్తం 391 పేజీల రిపోర్టుతో డబ్ల్యూఈఎఫ్ ఈ రిపోర్టును రూపొందించింది.
Advertisement
Advertisement