ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఈఎఫ్)కు చెందిన ''ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇనిషియేటివ్''లో చేరింది. CO2e ఉద్గారాలను తగ్గించడం, ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పించడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని ఏఎం గ్రీన్ డబ్ల్యూఈఎఫ్‌లో చేరింది.
మూడు బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడితో.. సుమారు 10,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించడానికి ఏఎం గ్రీన్ సన్నద్ధమైంది. దీని ద్వారా స్థానికి, జాతీయ ఆర్థిక వ్యవస్థలను పెంచడమే కాకుండా.. నిర్మాణం, పరికరాల తయారీ, గృహ నిర్మాణం వంటి పరిశ్రమలకు మద్దతు ఇస్తుంది.
ఏఎం గ్రీన్ ఛైర్మన్ 'అనిల్ చలమలశెట్టి' ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా మేము అవిశ్రాంతంగా పని చేస్తున్నాము. ఇప్పుడు ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇనిషియేటివ్‌లో చేరే అవకాశం లభించింది. డబ్ల్యుఈఎఫ్ చొరవతో పాలుపంచుకోవడానికి.. క్లస్టర్ ట్రాన్సిషన్ లక్ష్యాలను నెరవేర్చడానికి ఎదురుచూస్తున్నామని అన్నారు.
ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇనిషియేటివ్‌లో సభ్యునిగా.. ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్ డీకార్బనైజేషన్ క్లస్టర్‌లపై ప్రపంచవ్యాప్త పనికి మద్దతు ఇవ్వడం.. ఫోరమ్‌తో అభివృద్ధి పనులను పంచుకోవడం వంటి వాటితో పాటు ఇతర ఫోరమ్ క్లస్టర్‌ల నుంచి ఉత్తమ అభ్యాసాలను పొందడం లక్ష్యంగా పెట్టుకుందని చలమల శెట్టి పేర్కొన్నారు.
25 పారిశ్రామిక సమూహాలతో కూడిన మా గ్లోబల్ నెట్‌వర్క్‌కు.. ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్‌ను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక వనరులతో.. కాకినాడ క్లస్టర్ గ్రీన్ అమ్మోనియా & హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రాంతీయంగా అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కమ్యూనిటీలో భాగంగా, ఏఎం గ్రీన్ కాకినాడకు అంతర్దృష్టులను పంచుకోవడానికి.. పారిశ్రామిక డీకార్బనైజేషన్‌లో సామూహిక పురోగతికి దోహదపడే అవకాశం ఉంది, అని సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ హెడ్ & ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు 'రాబర్టో బొక్కా' అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment