The World Economic Forum
-
డబ్ల్యూఈఎఫ్‌లో చేరిన 'ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్'
ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఈఎఫ్)కు చెందిన ''ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇనిషియేటివ్''లో చేరింది. CO2e ఉద్గారాలను తగ్గించడం, ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పించడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని ఏఎం గ్రీన్ డబ్ల్యూఈఎఫ్‌లో చేరింది.మూడు బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడితో.. సుమారు 10,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించడానికి ఏఎం గ్రీన్ సన్నద్ధమైంది. దీని ద్వారా స్థానికి, జాతీయ ఆర్థిక వ్యవస్థలను పెంచడమే కాకుండా.. నిర్మాణం, పరికరాల తయారీ, గృహ నిర్మాణం వంటి పరిశ్రమలకు మద్దతు ఇస్తుంది.ఏఎం గ్రీన్ ఛైర్మన్ 'అనిల్ చలమలశెట్టి' ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా మేము అవిశ్రాంతంగా పని చేస్తున్నాము. ఇప్పుడు ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇనిషియేటివ్‌లో చేరే అవకాశం లభించింది. డబ్ల్యుఈఎఫ్ చొరవతో పాలుపంచుకోవడానికి.. క్లస్టర్ ట్రాన్సిషన్ లక్ష్యాలను నెరవేర్చడానికి ఎదురుచూస్తున్నామని అన్నారు.ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇనిషియేటివ్‌లో సభ్యునిగా.. ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్ డీకార్బనైజేషన్ క్లస్టర్లపై ప్రపంచవ్యాప్త పనికి మద్దతు ఇవ్వడం.. ఫోరమ్‌తో అభివృద్ధి పనులను పంచుకోవడం వంటి వాటితో పాటు ఇతర ఫోరమ్ క్లస్టర్ల నుంచి ఉత్తమ అభ్యాసాలను పొందడం లక్ష్యంగా పెట్టుకుందని చలమల శెట్టి పేర్కొన్నారు.25 పారిశ్రామిక సమూహాలతో కూడిన మా గ్లోబల్ నెట్‌వర్క్‌కు.. ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్‌ను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక వనరులతో.. కాకినాడ క్లస్టర్ గ్రీన్ అమ్మోనియా & హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రాంతీయంగా అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కమ్యూనిటీలో భాగంగా, ఏఎం గ్రీన్ కాకినాడకు అంతర్దృష్టులను పంచుకోవడానికి.. పారిశ్రామిక డీకార్బనైజేషన్‌లో సామూహిక పురోగతికి దోహదపడే అవకాశం ఉంది, అని సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ హెడ్ & ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు 'రాబర్టో బొక్కా' అన్నారు. -
ఏపీకి పెట్టుబడులతో రండి
► యూరప్ తెలుగు సమాజానికి చంద్రబాబు పిలుపు ► జ్యూరిచ్‌లో ప్రవాస భారతీయులతో ముఖ్యమంత్రి భేటీ ► ఏపీని విద్య, వైజ్ఞానిక నిలయంగా మారుస్తామని వెల్లడి ► దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు స్వాగత సమావేశంలో పాల్గొన్న సీఎం సాక్షి, హైదరాబాద్: వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా యూరప్ తెలుగు సమాజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనే ముందు ఆయన జ్యూరిచ్‌లో కొద్దిసేపు ఉన్నారు. స్థానిక ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులు, వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలుగు సంఘం నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... యూరోపియన్ దేశాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తమ విధానాలు, పద్ధతులతో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేయవచ్చని చెప్పారు. సరికొత్త ఆలోచనలను ఆహ్వానించడానికి తాను దేశ విదేశాల్లో పర్యటిస్తున్నానని తెలిపారు. ప్రవాస భారతీయుల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఏపీ ఎన్ఆర్టీ పేరుతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల ప్రముఖులను ఆహ్వానించి ఏపీని విద్య, వైజ్ఞానిక నిలయంగా మార్చనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీ సీఎం రమేష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ , ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్ష, కార్యదర్శులు జయకుమార్, కారం సురేష్ పాల్గొన్నారు. కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ ఎథికల్ కాఫీ కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇప్పటికే ఏపీలో ఉన్న కాఫీ కంపెనీని తీసుకుంటామని, లేదంటే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మియర్ బర్గర్ కంపెనీ ప్రతినిధులతో కూడా ఆయన సమావేశమయ్యారు. సోలార్ ప్యానెళ్ల తయారీ కంపెనీ స్థాపనకు ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. ఫండ్ మేనేజింగ్ రంగంలో ప్రసిద్ధిగాంచిన బీహెచ్ఎం కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. బయోటెక్, మెడికల్ సైన్స్, డయోగ్నొస్టిక్ మెడికల్ పరికరాల ఉత్పత్తి సంస్థల ఏర్పాటుకు కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్‌లో పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సిందిగా స్విట్జర్లాండ్ కంపెనీలను చంద్రబాబు కోరారు. 24న సింగపూర్ పర్యటన సీఎం తొలిరోజు దావోస్ పర్యటన విజయవంతమైందని, రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం ప్రకటించింది. అంతకు ముందు భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు బృందం జ్యూరిచ్‌కు చేరుకుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. రాత్రి పదిన్నర గంటలకు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు స్వాగత సమావేశంలో, కాంగ్రెస్ సెంటర్లో భారతీయులు నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు ఈ నెల 24న సింగపూర్‌లో పర్యటించి నూతన రాజధాని నిర్మాణంపై ఆ దేశ మంత్రి ఈశ్వరన్ తదితరులతో చర్చించనున్నారు. -
దావోస్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
స్మార్ట్ సిటీలపై జ్యూరిచ్‌లో సమావేశం సాక్షి, హైదరాబాద్: వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు బృందం మంగళవారం దావోస్ చేరుకుంది. తొలుత జ్యూరిచ్ చేరుకున్న వీరికి స్థానికంగా ఉండే తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. అక్కడ స్మార్ట్ సిటీలపై ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. బాబు వెంట యనమల, కంభంపాటి ఉన్నారు. అనంతరం చంద్రబాబు బృందం రోడ్డు మార్గంలో దావోస్ చేరుకుంది. -
ఉద్యోగరహిత వృద్ధే పెద్ద సవాలు: డబ్ల్యూఈఎఫ్
న్యూఢిల్లీ/జెనీవా: ఆదాయాల్లో అసమానతలు, ఉద్యోగరహిత వృద్ధి.. ఈ రెండే ప్రస్తుతం ప్రపంచానికి అత్యంత కీలక సవాళ్లని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. 2015 ఏడాదికి సంబంధించి టాప్-10 ట్రెండ్స్‌పై విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. సరైన నాయకత్వాలు లేకపోవడం, భౌగోళికపరమైన వ్యూహాల్లో పోటాపోటీ,ప్రజాస్వామ్యంలో బలహీనతలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కాలుష్యం పెరిగిపోవడం, వాతావరణంలో పెను మార్పులు, జాతీయతావాదాలు తీవ్రతరం, నీటి ఎద్దడి పెరగడం, ఆర్థిక వ్యవస్థల్లో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత వంటివి ఈ ట్రెండ్స్‌లో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రాజకీయ, ఆర్థిక పరమైన అంశాలకే అధిక ప్రాధాన్యం ఉన్నప్పటికీ... సరైన నాయకత్వలేమి అనే ధోరణి 2015లో కీలకం కానుందని సర్వే నివేదిక పేర్కొంది. ఇప్పటిదాకా 7వ స్థానంలో ఉన్న ఈ అంశం ఏకంగా 3వ స్థానానికి చేరిందని వెల్లడించింది.