దావోస్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
స్మార్ట్ సిటీలపై జ్యూరిచ్‌లో సమావేశం
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు బృందం మంగళవారం దావోస్ చేరుకుంది. తొలుత జ్యూరిచ్ చేరుకున్న వీరికి స్థానికంగా ఉండే తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. అక్కడ స్మార్ట్ సిటీలపై ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. బాబు వెంట యనమల, కంభంపాటి ఉన్నారు. అనంతరం చంద్రబాబు బృందం రోడ్డు మార్గంలో దావోస్ చేరుకుంది.