ఉద్యోగరహిత వృద్ధే పెద్ద సవాలు: డబ్ల్యూఈఎఫ్
న్యూఢిల్లీ/జెనీవా: ఆదాయాల్లో అసమానతలు, ఉద్యోగరహిత వృద్ధి.. ఈ రెండే ప్రస్తుతం ప్రపంచానికి అత్యంత కీలక సవాళ్లని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. 2015 ఏడాదికి సంబంధించి టాప్-10 ట్రెండ్స్‌పై విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది.
సరైన నాయకత్వాలు లేకపోవడం, భౌగోళికపరమైన వ్యూహాల్లో పోటాపోటీ,ప్రజాస్వామ్యంలో బలహీనతలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కాలుష్యం పెరిగిపోవడం, వాతావరణంలో పెను మార్పులు, జాతీయతావాదాలు తీవ్రతరం, నీటి ఎద్దడి పెరగడం, ఆర్థిక వ్యవస్థల్లో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత వంటివి ఈ ట్రెండ్స్‌లో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రాజకీయ, ఆర్థిక పరమైన అంశాలకే అధిక ప్రాధాన్యం ఉన్నప్పటికీ... సరైన నాయకత్వలేమి అనే ధోరణి 2015లో కీలకం కానుందని సర్వే నివేదిక పేర్కొంది. ఇప్పటిదాకా 7వ స్థానంలో ఉన్న ఈ అంశం ఏకంగా 3వ స్థానానికి చేరిందని వెల్లడించింది.