ప్రపంచ ఆర్థిక వేదిక జాబితాలో భారత కంపెనీలకు చోటు | 10 Indian startups in the list of Tech Pioneers 2024 by WEF | Sakshi
Sakshi News home page

డబ్ల్యూఈఎఫ్‌ జాబితాలో భారత కంపెనీలకు చోటు

Published Fri, Jun 7 2024 9:07 AM | Last Updated on Fri, Jun 7 2024 2:00 PM

10 Indian startups in the list of Tech Pioneers 2024 by WEF

హైదరాబాద్‌లోని నెక్ట్స్‌వేవ్‌కు స్థానం

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) విడుదల చేసిన ‘టెక్నాలజీ పయనీర్స్‌ 2024’ జాబితాలో దేశంలోని పది కంపెనీలు చోటు సంపాదించాయి. కృత్రిమ మేధ (ఏఐ)తో సరికొత్త ఆవిష్కరణలు చేసిన 100 స్టార్టప్‌ కంపెనీలతో ఈ జాబితా రూపొందించారు. అందులో హైదరాబాద్‌కు చెందిన నెక్ట్స్‌వేవ్‌ కంపెనీ స్థానం దక్కించుకోవడం విశేషం.

డబ్ల్యూఈఎఫ్‌ రూపొందించిన జాబితాలో స్వచ్ఛ ఇంధనంపై ఆవిష్కరణలు చేసిన కంపెనీలు, ఆరోగ్య సంరక్షణ, బయోటెక్, అంతరిక్ష, న్యూరోటెక్నాలజీల్లో వినూత్నంగా ఆలోచిస్తున్న సంస్థలు ఉన్నాయి.

హైదరాబాద్‌ సంస్థ నెక్ట్స్‌వేవ్‌

తెలుగు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలైన రాహుల్‌ అట్టులూరి, గుజ్జుల శశాంక్‌ రెడ్డి, అనుపమ్‌ ఏర్పాటు చేసిన నెక్ట్స్‌వేవ్‌ ఈ జాబితాలో స్థానం పొందింది. ఈ సంస్థ చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు ఏఐ ఆధారిత కోడింగ్‌ కోర్సులను ఆన్‌లైన్‌లో అందిస్తోంది.

భారత్‌ చెందిన కంపెనీలు ఇవే..

ఏఐ సహాయంతో ముందస్తు దశ రొమ్ము కేన్సర్‌ పరీక్షను నిరమాయ్‌ అభివృద్ధి చేస్తోంది. పిక్సెల్‌ కంపెనీ జియో స్పేషియల్‌ డేటాను అందించే హైపర్‌స్పెక్ట్రల్‌ శాటిలైట్‌ ఇమేజినరీని అభివృద్ధి చేస్తోంది. భారతీయ భాషల వినియోగానికి ఏఐ మోడళ్లు, ప్లాట్‌ఫారాలను సర్వమ్‌ ఏఐ సిద్ధం చేస్తోంది. పునరుత్పాదక ఇంధనాన్ని నిల్వ చేసుకునే సొల్యూషన్లను యాంపియర్‌అవర్‌ తయారుచేస్తోంది. క్రాప్‌ఇన్‌ అనే మరో అంకురం రైతులు తమ పొలాలకు జియో-టాగ్‌ చేసుకునేందుకు, వ్యవసాయ రికార్డులను డిజిటలీకరణ చేసుకునేందుకు పర్యవేక్షణ, నిర్వహణ పరిష్కారాన్ని అభివృద్ధి చేస్తోంది. హెల్త్‌ప్లిక్స్‌ అనేది ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్‌ మెడికల్‌ రికార్డులను అభివృద్ధి చేస్తోంది. ఇంటర్నేషనల్‌ బ్యాటరీ కంపెనీ(ఐబీసీ) రీఛార్జబుల్‌ ప్రిస్మాటిక్‌ లిథియం అయాన్‌ నికెల్‌ మాంగనీజ్‌ కోబాల్ట్‌ బ్యాటరీలను తయారు చేస్తోంది. స్ట్రింగ్‌ బయో అనే మరో కంపెనీ విషవాయువుల నుంచి జంతువులు, మానవులకు ఉపయోగపడే పోషకాలను తయారు చేస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement