ఒకవైపు భారీవర్షాలు, తుపాన్లు, వరదలు మరోవైపు కరవు కాటకాలు.. వీటికితోడు ఇటీవల కాలంలో పెచ్చురిల్లుతున్న విభిన్న దాడులతో సామాన్యులు చితికిపోతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో ఏఐ ఆధారిత మోసాలు, సైబర్‌దాడులు, రాజకీయమోసాలు 2024లో అధికం కాబోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వీటికితోడు అంతర్జాతీయంగా ఎన్నో రిస్క్‌లు సంభవించబోతున్నట్లు అంచనావేస్తూ ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనామిక్ ఫోరం) నివేదిక విడుదల చేసింది.
భారత్, అమెరికా, బ్రిటన్, మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 300 కోట్ల మంది ఎన్నికల క్రతువులో భాగం కానున్నారు. అయితే తప్పుడు సమాచార వ్యాప్తి ఎన్నికలకు పెనుముప్పుగా పరిణమించనుంది. ఆయా దేశాల్లో ఎన్నికల ఫలితాలపైనా, ప్రజాస్వామ్య మనుగడపైనా ఇది తీవ్ర ప్రభావం చూపనుందని ప్రపంచ ఆర్థిక వేదిక వెలువరించిన ‘గ్లోబల్ రిస్క్ నివేదిక-2024’లో వెల్లడైంది.
ఆర్థిక, పర్యావరణ, రాయకీయ, భౌగోళిక, సాంకేతిక తదితర 34 ముప్పులపై ఈ నివేదిక ర్యాంకులను ప్రకటించింది. తప్పుడు సమాచారం అతిపెద్ద ముప్పుగా ఉన్న దేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉంది. అమెరికా ఆరోస్థానంలో ఉంది. కేవలం వాతావరణానికి సంబంధించి తప్పడు సమాచారం వల్ల కలిగే రిస్క్ 2024లో 100కు 66 శాతంగా ఉంటుందని నివేదిక ద్వారా తెలిసింది. నివేదికలోని వివరాల ప్రకారం..(రిస్క్ శాతం)
1. తీవ్రమైన వాతావరణం 66%
2. ఏఐ ఆధారిత తప్పుడు సమాచారం 53%
3. సామాజికంగా/ రాజకీయంగా కలిగే రిస్క్ 46%
4. జీవన వ్యయం 42%
5. సైబర్ దాడులు 39%
6. ఆర్థిక తిరోగమనం 33%
7. కీలకమైన వస్తువుల సరఫరాలో అంతరాయం 25%
8. సాయుధ బలగాల మధ్య యుద్ధం 25%
9. మౌలిక సదుపాయాలపై దాడులు 19%
10. ఆహార సరఫరా గొలుసుల అంతరాయం 18%
Comments
Please login to add a commentAdd a comment