
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్విస్ లగ్జరీ వాచీల దిగ్గజం బ్రైట్‌లింగ్ వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో కొత్తగా ఆరు బొటిక్ స్టోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. దీంతో వీటి సంఖ్య 10కి చేరనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు పుణె తదితర నగరాల్లో నాలుగు బొటిక్ స్టోర్స్ ఉన్నట్లు బ్రైట్‌లింగ్ ఇండియా ఎండీ ప్రదీప్ భానోత్ తెలిపారు.
దేశీయంగా స్విస్ వాచీల మార్కెట్ సుమారు రూ. 2,500 కోట్లుగా ఉంటోందని ఆయన చెప్పారు. పరిశ్రమ ఏటా సుమారు 15 శాతం ఎదుగుతుండగా, తాము అంతకు మించి వృద్ధిని నమోదు చేస్తున్నట్లు ప్రదీప్ చెప్పారు. స్మార్ట్ వాచీలు వచ్చినప్పటికీ .. హోదాకు నిదర్శనంగా ఉండే బ్రైట్‌లింగ్‌లాంటి లగ్జరీ వాచీల ప్రాధాన్యతను గుర్తించే వారు పెరుగుతున్నారని ఆయన తెలిపారు.
అలాగే వాటిపై ఖర్చు చేసే సామర్థ్యాలు పెరుగుతుండటం కూడా వ్యాపార వృద్ధికి దోహదపడనుందని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్ స్టోర్‌లో సుమారు రూ. 3.11 లక్షల నుంచి సుమారు రూ. 17 లక్షల పైచిలుకు విలువ చేసే వాచీలు అందుబాటులో ఉన్నాయి. 140 ఏళ్ల బ్రైట్‌లింగ్ చరిత్రలో అత్యంత ప్రాధాన్యమున్న వాచీలను ఇందులో మార్చి 25 వరకు ప్రదర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment