luxury watches
-
టైటన్ హీలియోస్‌కు కొత్త బ్రాండ్స్
న్యూఢిల్లీ: లగ్జరీ వాచ్‌ల విక్రయంలో ఉన్న టైటన్ హీలియోస్ మరిన్ని విదేశీ బ్రాండ్స్‌ను జోడిస్తోంది. 12–18 నెలల్లో కొత్తగా 10 బ్రాండ్స్‌ను పరిచయం చేయనుంది. ప్రస్తుతం హీలియోస్ స్టోర్లలో టామీ హిల్ఫిగర్, టిస్సో, స్వరోస్కీ, ఫాజిల్ వంటి 45 బ్రాండ్ల వాచ్‌లు కొలువుదీరాయి. వీటి ధరలు రూ.5,000 మొదలుకుని రూ.1,00,000 వరకు ఉన్నాయి. మరోవైపు హీలియోస్ స్టోర్ల సంఖ్యను కంపెనీ గణనీయంగా పెంచుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 50 ఔట్లెట్లు రానున్నాయని టైటన్ వాచెస్, వేరబుల్స్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ శుక్లా వెల్లడించారు. ‘మొత్తం వ్యాపారంలో హీలియోస్ నుంచి 10 శాతం ఆదాయం సమకూరుతోంది. ఈ విభాగం ఆదాయం 45 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నాం. హీలియోస్ టర్నోవర్‌లో 20 శాతం కొత్త కలెక్షన్, లిమిటెడ్ ఎడిషన్స్ నుంచి అందుకోవాలని దృష్టిపెట్టాం. పండుగల సీజన్ ప్రమోషన్స్ కారణంగా కస్టమర్ల రాక, ఆన్లైన్ సేల్స్ 20–25 శాతం అధికం అవుతాయని భావిస్తున్నాం. అన్ని బ్రాండ్స్‌లో కలిపి ఏటా 150 దాకా కేంద్రాలను జోడిస్తున్నాం’ అని వివరించారు. టైటన్‌కు దేశవ్యాప్తంగా 95 నగరాలు, పట్టణాల్లో 240 హీలియోస్ స్టోర్లు ఉన్నాయి. హీలియోస్తోపాటు టైటన్ వరల్డ్, ఫాస్ట్‌ట్రాక్, రాగా, జూప్, ఎస్ఎఫ్ బ్రాండ్లలో 1,110కిపైగా కేంద్రాలు ఉన్నాయి. -
కోహ్లి ఖరీదైన వాచ్ కలెక్షన్.. ధర కోట్లలోనే! అన్నింటి కంటే కాస్ట్లీ ఏదో తెలుసా?
టాప్ మోస్ట్ సెలబ్రిటీలలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ఉన్న క్రేజే వేరు. ఆటతో పాటు స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకునే రన్‌మెషీన్‌కు ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో 255 మిలియన్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న కింగ్ కోహ్లికి ఉన్న ఫ్యాన్స్ పేజీలకు లెక్కేలేదు. ఇందులో.. కెరీర్ గణాంకాలతో పాటు కోహ్లి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్డేట్లు సహా అతడు వాడే వస్తువుల వివరాలు కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కోహ్లి ఖరీదైన వాచ్ కలెక్షన్ తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. మరి టీమిండియా స్టైలిష్ స్టార్ విరాట్ కోహ్లి వద్దనున్న అత్యంత ఖరీదైన వాచ్ ఏదో తెలుసా?! 1. రెయిన్బో ఎవర్రోజ్ గోల్డ్ రోలెక్స్ డైటోనా- ధర. సుమారు రూ. 4.6 కోట్లు 2. ప్లాటినం రోలెక్స్ డైటోనా- ధర. సుమారు రూ. 1.23 కోట్లు 3. ప్లాటినం పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్- ధర. సుమారు రూ. 2.6 కోట్లు 4. అడేమర్స్ పిగెట్ రాయల్ ఓక్స్ డబుల్ బ్యాలెన్స్ వీల్- ధర సుమారు రూ. 1.2 కోట్లు 5. 18 క్యారెట్ యెల్లో గోల్డ్ రోలెక్స్ డైటోనా విత్ గ్రీన్ డయల్- ధర సుమారు 1.1 కోట్లు 6. పటేక్ ఫిలిప్ అక్వానాట్ 18 క్యారెట్ రోజ్ గోల్డ్ 5167A-001- ధర సుమారు రూ. 87 లక్షలు 7. పటేక్ ఫిలిప్ నటాలియస్ 5712/1A- ధర రూ. 1.14 కోట్లు 8. రోలెక్స్ ఓస్టర్ పెర్పాట్యుయల్ స్కై డ్వెల్లర్- ధర సుమారు రూ. 1.8 కోట్లు 9. రోలెక్స్ డైటోనా విత్ వైట్ డయల్- ధర సుమారు రూ. 3.2 కోట్లు కాగా వెస్టిండీస్ పర్యటన ముగించుకున్న విరాట్ కోహ్లి గురువారమే స్వదేశానికి చేరుకున్నాడు. కరేబియన్ దీవి నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు తిరిగి వచ్చాడు. ఇక విండీస్‌తో టెస్టుల్లో అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన కోహ్లి.. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. మిగతా రెండు మ్యాచ్‌లలో అతడికి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. చదవండి: ఏదో క్లబ్‌గేమ్ ఆడుతున్నట్లు.. రాష్ట్రస్థాయి మ్యాచ్ అన్నట్లు! తిలక్ అలా.. -
‘నేనే కింగ్’: మాంగో అయినా లగ్జరీ వాచ్ అయినా...!
సాక్షి, ముంబై: రూ.2 వేల నోటు ఉపసంహరణపై రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటన తరువాత బడా బాబులతోపాటు, సామాన్య ప్రజలు దాకా తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లను వదిలించుకునే పనిలో తలమునకలై ఉన్నారు. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్టు తమ తమ స్థాయిల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లలో పెద్ద నోటుదే ప్రస్తుత హవా. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రోజువారీ నిత్యావసరాలు మొదలు ప్రీమియం బ్రాండెడ్ వస్తువుల కొనుగోళ్లదాకా.. మామిడిపండ్ల నుంచి ఖరీదైన వాచీల దాకా రూ.2 వేల నోటుతోనే కొనుగోలు చేస్తున్నారట. రూ.2 వేల నోటు చలామణికి మరో నాలుగు నెలల్లో (సెప్టెంబరు 30) గడువు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లో ఏది కొన్నా చెల్లింపులు మాత్రం రూ.2 వేల నోటుతోనే. దీనికి తోడు డిజిటల్ పేమెంట్స్‌లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇపుడు కస్టమర్లు ది బెస్ట్‌గా భావిస్తున్నారట. ఆన్లైన్లో వేసవి సీజన్లో అత్యధికంగా లభించే మామిడిపళ్ల దగ్గరనుంచి ఖరీదైన వాచీలను, ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేస్తూ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రోజూ 8 నుంచి 10 పెద్ద నోట్లు వస్తున్నాయని ముంబైలోని ఓ మామిడి పళ్ల వ్యాపారి చెప్పారు. (సింపుల్ వన్: లాంగెస్ట్ రేంజ్ స్కూటర్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?) సెంట్రల్ ముంబైలోని రాడో స్టోర్‌లో స్టోర్ మేనేజర్ మైఖేల్ మార్టిస్ మాట్లాడుతూ తమ స్టోర్‌లో 2000 రూపాయల నోట్లు 60-70 శాతం పెరిగిందని పేర్కొన్నారు. అంతేకాదు తమ వాచ్ అమ్మకాలు గతంలో 1-2 నుండి రోజుకు 3-4కు పెరిగిందని మార్టిస్ చెప్పారు. పెట్రోల్ బంకుల్లో కూడా ఎక్కువగా రూ.2 వేల నోటే ఇస్తున్నారని, దీంతో చిల్లర సమస్య ఎదుర్కొంటున్నామని బంకు యజమానులు చెబుతున్నారు. రూ.2 వేల నోటుపై ఆర్బీఐ ప్రకటించింది మొదలు తమకు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెరిగాయని జొమాటో ప్రతినిధి తెలిపారు. బంగారం షాపులకు కూడా రద్దీ పుంజుకోవడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ట్రైన్ రిజర్వేషన్లకు, బస్ టికెట్లకు ఇలా ఒకటేమిటి.. దాదాపు ప్రతీ లావాదేవీ పెద్ద నోటుతోనే. (ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ‘గార్బేజ్ క్వీన్స్’ : వైరల్ ఫోటోలు) కాగా దేశంలోనే అతిపెద్ద డినామినేషన్ నోటు రూ.2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ ఈ కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, ఖాతాల్లో జమ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ గడువును సెప్టెంబర్ 30గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
Hardik Pandya: అవన్నీ ఉత్త పుకార్లే.. 5 కోట్లు కాదు.. ఆ వాచీ ధర కోటిన్నర మాత్రమే
Hardik Pandya Clarifies on 2 Luxury Wrist Watches Price After Customs Row: ‘‘సోమవారం.. నవంబరు 15 ఉదయం నేను నా లగేజీతో దుబాయ్ నుంచి ఇండియాకు చేరుకోగానే... ముంబై ఎయిర్‌పోర్టు కస్టమ్స్ కౌంటర్ దగ్గరకు వెళ్లి.. నేను కొన్న వస్తువుల గురించి తెలియజేశాను. కస్టమ్స్ డ్యూటీ చెల్లించాను కూడా. కానీ.. నాకు సంబంధించిన వస్తువులను సీజ్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారమవుతున్నాయి. అందుకే.. అసలు విషయం గురించి స్పష్టతనివ్వాలని భావించాను’’ అంటూ తన గురించి ప్రచారమవుతున్న కథనాలపై టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. కాగా సరైన పత్రాలు చూపని కారణంగా పాండ్యాకు చెందిన సుమారు 5 కోట్ల విలువైన వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్న వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా పాండ్యా క్లారిటీ నోట్ షేర్ చేశాడు. ‘‘నాకు నేనుగా.. స్వయంగా కస్టమ్స్ అధికారుల వద్దకు వెళ్లాను. దుబాయ్‌లో నేను చట్టబద్ధంగా ఖరీదు చేసిన వస్తువులకు పన్ను చెల్లించాను. వాళ్లు అడిగిన పత్రాలు అన్నీ కూడా సమర్పించాను. వస్తువులకు సంబంధించి ఎంత డ్యూటీ చెల్లించాల్సి వస్తుందో వాళ్లు నాకు చెప్పారు. నిజానికి ఆ వాచ్ వాస్తవ ధర ఇంచు మించు కోటిన్నర. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్లుగా రూ. 5 కోట్లు కాదు’’ అని పాండ్యా పేర్కొన్నాడు. పాండ్యా గతంలో షేర్ చేసిన ఫొటోలు నేను చట్టాన్ని గౌరవిస్తాను ‘‘ప్రభుత్వ సంస్థలను నేను గౌరవిస్తాను. చట్టాన్ని పాటించే దేశ పౌరుడిని నేను. ముంబై కస్టమ్స్ డిపార్టుమెంటు అడిగిన విధంగా నేను అన్ని వివరాలు అందించాను. చట్టబద్ధమైన డాక్యుమెంట్లు చూపించాను. దీంతో వాళ్లు కూడా నాకు సహకరించారు. నేను చట్టాన్ని అతిక్రమించాననే వార్తలు అన్నీ కూడా నకిలీవే’’ అని హార్దిక్ పాండ్యా తన సుదీర్ఘ పోస్టులో రాసుకొచ్చాడు. ఈ క్రమంలో అభిమానులు పాండ్యాకు అండగా నిలుస్తుండగా.. కొంతమంది హేటర్స్ మాత్రం.. ‘‘ఏంటి.. కోటిన్నర వాచ్ పెట్టుకుంటేనే సిక్స్ కొడతావా లేదంటే.. ఆడటం చేతకాదా? విలాసాలపై కాదు.. ఆటపై దృష్టి పెట్టు ముందు’’ అని ట్రోల్ చేస్తున్నారు. చదవండి: Shoaib Akhtar: ఏంటది అసహ్యంగా.. అసలు విషయం తెలీదా.. లేదంటే సెమీస్‌లో పాక్‌ను ఓడించినందుకేనా అక్కసు! pic.twitter.com/k9Qv0UnmyS — hardik pandya (@hardikpandya7) November 16, 2021 -
Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. 5 కోట్ల విలువైన వాచీలు సీజ్!
Hardik Pandya’s watches worth Rs 5 crore seized at airport: టీ20 ప్రపంచకప్-2021లో పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. పాండ్యా వద్ద గల అత్యంత ఖరీదైన వాచ్‌లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి టీమిండియా నిష్క్రమించిన తర్వాత యూఏఈ నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న క్రమంలో ఎయిర్‌పోర్టులో తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వాచ్‌ల విలువ సుమారు 5 కోట్ల రూపాయలు. ఏబీపీ లైవ్ కథనం ప్రకారం... నవంబరు 14 రాత్రి జరిగిన ఈ ఘటన జరిగింది. సదరు వాచీలకు సంబంధించిన ఇన్వాయిస్లు పాండ్యా చూపకపోవడంతో ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడిని ఆపిన కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఖరీదైన బ్రాండ్లు.. హార్దిక్ పాండ్యా వద్ద అత్యంత ఖరీదైన, ప్రసిద్ధ కంపెనీలకు చెందిన వాచ్ కలెక్షన్ ఉంది. వీటిలో పటేక్ ఫిలిఫ్ నాటిలస్ ప్లాటినమ్ 5711 ప్రముఖమైంది. జీక్యూ ఇండియా రిపోర్టు ప్రకారం... ఈ వాచ్ మొత్తం ప్లాటినమ్‌తో రూపొందించబడింది. 32 బాగెట్ కట్ ఎమరాల్డ్స్ పొదిగి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ బ్రాస్లెట్ కూడా ఉంటుంది. అంతేకాదు కస్టమర్లు కోరిన విధంగా వారికిష్టమైన రీతిలో వాచ్‌ను తయారు చేసి ఇస్తారు. ఇక ఐపీఎల్ 2021 రెండో అంచె ప్రారంభానికి ముందుకు హార్దిక్ పాండ్యా ఈ వాచీని ధరించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: Venkatesh Iyer: ఆ ఇంగ్లండ్ ఆల్రౌండర్లా.. టీమిండియాకు నేను ఆడాలి అనుకుంటున్నా.. -
మన వాళ్లు రూ.2 కోట్ల వాచీనీ కొనేస్తున్నారు..!
లగ్జరీ కార్లకు ఏమాత్రం తీసిపోకుండా ఇప్పుడు ఖరీదైన వాచీలూ భారత్‌లో దర్శనమిస్తున్నాయి. ఒమెగా, బుల్గారీ, పియాజెట్, బ్రుగీ, ఉర్విక్.. ఇలా కంపెనీ ఏదైతేనేం. లిమిటెడ్ ఎడిషన్ అయితే చాలు భారత్‌లో రూ.2 కోట్ల వరకూ వెచ్చించే సంపన్నులూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వజ్రాలు పొదిగిన, ప్లాటినం, బంగారంతో తయారైన ఈ ఖరీదైన వాచీలను ఇష్టపడని వారుండరు. అయితే వీటి అమ్మకాలే వాచీలో ముల్లుల్లాగా సెలైంట్‌గా జరుగుతున్నాయి. విక్రయించిన కంపెనీగానీ, కొనుక్కున్న కస్టమర్ గానీ ఈ విషయాన్ని వెల్లడించడానికి ఇష్టపడడం లేదు. రూ.10 లక్షలు, ఆపైన ఖరీదు చేసే ‘ప్రెస్టీజ్’ వాచీలు భారత్‌లో ఏటా 300లపెనే అమ్ముడు అవుతున్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు. ఇదీ వాచీల విపణి.. దేశవ్యాప్తంగా వ్యవస్థీకత రంగంలో వాచీల విక్రయ పరిమాణం రూ.6,000 కోట్లుంది. అవ్యవస్థీకత రంగంలోనూ ఇదే స్థాయిలో వ్యాపారం జరుగుతోంది. అయితే, ప్రతి వంద మందిలో ముగ్గురికి మాత్రమే వాచీ ఉంటోంది. అదే ప్రపంచంలో ఇది 25 శాతం దాకా ఉంది. అంతస్తును ప్రదర్శించుకునేందుకు.. రూ.10 లక్షలు ఆపైన ధరలో ఉండే వాచీలను ప్రెస్టీజ్ విభాగం కింద పరిగణిస్తున్నారు. ఈ విభాగంలో ఏటా దేశంలో 300 వాచీలు అమ్ముడవుతున్నాయట. లిమిటెడ్ ఎడిషన్లలో చేతితో చేసిన ఒక్కో వాచీ తయారీకి ఆరు నెలల పైన సమయం పడుతోంది. మొత్తం వాచీల అమ్మకాల్లో టాప్-30 నగరాల వాటా 80 శాతముంది. కలర్‌ఫుల్ కాపర్.. రాగి (కాపర్) వర్ణంతో తయారైన వాచీలను ధరించేందుకు మహిళలు మక్కువ చూపుతున్నారు. ఆ తర్వాత వైన్ వర్ణం, తెలుపు రంగుల వాచీలకు గిరాకీ ఎక్కువ. మగ వారి విషయంలో స్టీలు, రోజ్ గోల్డ్ కలర్స్‌కు క్రేజ్ ఉంది. వ్యాపారులైతే చేతికి రోజ్ గోల్డ్ కలర్ వాచీ ఉండాల్సిందేనంటున్నారు. దక్షిణాదిన ఈ రంగు వాచీలకు మంచి ఆదరణ ఉంది. మూడేళ్ల క్రితం వరకు అమ్ముడైన వాచీల్లో పురుషులు ధరించేవి 90 శాతం, స్త్రీలవి 10 శాతం ఉండేవి. ఇప్పుడు స్త్రీల వాచీల వాటా 30 శాతానికి ఎగసింది. డిస్కౌంట్లు కోరరు.. వాచీల విషయంలో హైదరాబాద్ కస్టమర్లు హుందాగా వ్యవహరిస్తారట. బ్రాండ్, విలువకే తొలి ప్రాధాన్యమిస్తారని జస్ట్ లైఫ్‌సై ్టల్ బ్రాండ్ మేనేజర్ మనోజ్ సుబ్రమణియన్ అంటున్నారు. -
22 కోట్ల విలువైన వాచీల చోరీ
పారిస్ (ఫ్రాన్స్): పారిస్‌లో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.22 కోట్ల విలువ చేసే వాచీలను దుండగులు చోరీ చేశారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఫ్రాన్స్‌లోకి చిక్ 8వ డిస్ట్రిక్‌లో ఉన్న ఓ గిడ్డంగిలో చోటుచేసుకుంది. ఇది 'రిచర్డ్ మిల్లే'కు చెందిన అత్యంత ఖరీదైన వాచీలకు సంబంధించిన గిడ్డంగిగా పోలీసులు తెలిపారు. దుండుగులు వాచీలను ఉంచిన లాకర్లతో సహా ఎత్తుకుపోయారు. ప్రపంచంలోనే టాప్ బ్రాండ్లు, పారిస్‌లోనే ఖరీదైన ఏరియా అయిన ఇక్కడ లభిస్తాయి.