కోహ్లి ఖరీదైన వాచ్‌ కలెక్షన్‌.. ధర కోట్లలోనే! అన్నింటి కంటే కాస్ట్‌లీ ఏదో తెలుసా? | Virat Kohli Luxury And Costly Watch Collection Has Incredible Timepieces Viral | Sakshi
Sakshi News home page

Virat Kohl: కోహ్లి ఖరీదైన వాచ్‌ కలెక్షన్‌.. ధర కోట్లలోనే! అన్నింటి కంటే కాస్ట్‌లీ ఏదో తెలుసా?

Published Fri, Aug 4 2023 7:06 PM | Last Updated on Fri, Aug 4 2023 7:33 PM

Virat Kohl Luxury Costly Watch Collection Has Incredible Timepieces Viral - Sakshi

టాప్‌ మోస్ట్‌ సెలబ్రిటీలలో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి ఉన్న క్రేజే వేరు. ఆటతో పాటు స్టైలిష్‌ లుక్స్‌తో ఆకట్టుకునే రన్‌మెషీన్‌కు ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో 255 మిలియన్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న కింగ్‌ కోహ్లికి ఉన్న ఫ్యాన్స్‌ పేజీలకు లెక్కేలేదు.

ఇందులో.. కెరీర్‌ గణాంకాలతో పాటు కోహ్లి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్‌డేట్లు సహా అతడు వాడే వస్తువుల వివరాలు  కూడా షేర్‌ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కోహ్లి ఖరీదైన వాచ్‌ కలెక్షన్‌  తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోంది. మరి టీమిండియా స్టైలిష్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లి వద్దనున్న అత్యంత ఖరీదైన వాచ్‌ ఏదో తెలుసా?!

1. రెయిన్‌బో ఎవర్‌రోజ్‌ గోల్డ్‌ రోలెక్స్‌ డైటోనా- ధర. సుమారు రూ. 4.6 ​కోట్లు


2. ప్లాటినం రోలెక్స్‌ డైటోనా- ధర. సుమారు రూ. 1.23 కోట్లు


3. ప్లాటినం పటేక్‌ ఫిలిప్‌ గ్రాండ్‌ కాంప్లికేషన్‌- ధర. సుమారు రూ. 2.6 కోట్లు

4. అడేమర్స్‌ పిగెట్‌ రాయల్‌ ఓక్స్‌ డబుల్‌ బ్యాలెన్స్‌ వీల్‌- ధర సుమారు రూ. 1.2 కోట్లు


5. 18 క్యారెట్‌ యెల్లో గోల్డ్‌ రోలెక్స్‌ డైటోనా విత్‌ గ్రీన్‌ డయల్‌- ధర సుమారు 1.1 కోట్లు


6. పటేక్‌ ఫిలిప్‌ అక్వానాట్‌ 18 క్యారెట్‌ రోజ్‌ గోల్డ్‌ 5167A-001- ధర సుమారు రూ. 87 లక్షలు

7. పటేక్‌ ఫిలిప్‌ నటాలియస్‌ 5712/1A- ధర రూ. 1.14 కోట్లు


8. రోలెక్స్‌ ఓస్టర్‌ పెర్పాట్యుయల్‌ స్కై డ్వెల్లర్‌- ధర సుమారు రూ. 1.8 కోట్లు


9. రోలెక్స్‌ డైటోనా విత్‌ వైట్‌ డయల్‌- ధర సుమారు రూ. 3.2 కోట్లు

కాగా వెస్టిండీస్‌ పర్యటన ముగించుకున్న విరాట్‌ కోహ్లి గురువారమే స్వదేశానికి చేరుకున్నాడు. కరేబియన్‌ దీవి నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు తిరిగి వచ్చాడు. ఇక విండీస్‌తో టెస్టుల్లో అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన కోహ్లి.. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. మిగతా రెండు మ్యాచ్‌లలో అతడికి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.

చదవండి: ఏదో క్లబ్‌గేమ్‌ ఆడుతున్నట్లు.. రాష్ట్రస్థాయి మ్యాచ్‌ అన్నట్లు! తిలక్‌ అలా.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement